Nissan Magnite facelift : సరికొత్త డిజైన్, ఫీచర్స్‌తో నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్- లాంచ్ డేట్ ఇదే..
Nissan Magnite facelift launch date : సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్స్‌తో నిస్సాన్ మాగ్నైట్ లాంచ్‌కు రెడీ అవుతుంది. ఈ మోడల్ లాంచ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది. లాంచ్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నిస్సాన్‌కు ఇండియాలో ఉన్న బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ మాగ్నైట్. మొదట 2020లో లాంచ్ అయిన ఈ ఎస్‌యూవీకి మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ నిస్సాన్ మాగ్నైట్‌కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని సంస్థ రెడీ చేస్తోంది. ఈ విషయం గత కొంతకాలంగా వార్తల్లో ఉంది. ఇక ఇప్పుడు.. ఈ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది. 2024 అక్టోబర్ 4న ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని సంస్థ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. కొత్తగా వస్తున్న మోడల్లో కనిపించే మార్పులపై ప్రస్తుతం సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సరికొత్త డిజైన్, సరికొత్త ఫచ్స్ ఈ కొత్త నిస్సాన్ మాగ్నైట్‌లో ఉంటాయని తెలుస్తోంది.
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్: డిజైన్ మార్పులు..
ఈ ఎస్యూవీ ఫ్రెంట్- రేర్ భాగంలో కొత్త బంపర్ ఉంటుందని తెలుస్తోంది. గ్రిల్, హెడ్ లైట్ హౌసింగ్ కూడా కొత్తగా ఉంటాయి. ఇది కాకుండా, సైడ్స్‌లో కొత్త అల్లాయ్ వీల్స్, వీల్ కవర్లు ఉంటాయి.
ఇదీ చూడండి:- MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీకి రూ.2 లక్షల డౌన్ పేమెంట్ కడితే లోన్ ఎంత కావాలి? ఈఎంఐ ఎంత?
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్: ఇంటీరియర్ అప్డేట్స్..
ఈ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో సింగిల్ ప్యాన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో కూడిన పెద్ద 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, డ్రైవర్ కోసం 7 ఇంచ్ డిజిటల్ డిస్ప్లే వంటి కొన్ని కొత్త ఫీచర్ల రూపంలో క్యాబిన్ కొన్ని అప్డేట్స్ పొందే అవకాశం ఉంది. డ్యాష్‌బోర్డు కోసం కొత్త మెటీరియల్, సీట్ల కోసం కొత్త అప్ హోల్ స్టరీ కూడా ఉండవచ్చు.
ఇదీ చూడండి:- Maruti Suzuki Swift CNG : మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ లాంచ్.. కిలోకు 32.8 కి.మీ మైలేజీ, ధర ఎంత?
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్: ఇంజిన్..
నిస్సాన్ మాగ్నైట్ ఎస్యూవీ ఫేస్‌లిఫ్ట్‌లో ఎటువంటి యాంత్రిక మార్పులు ఉండకపోవచ్చు! ఇందులో నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్, టర్బోఛార్జ్డ్ యూనిట్లు ఉన్నాయి. రెండూ మూడు సిలిండర్ల ఇంజిన్లు,1.0-లీటర్ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవే కొనసాగే అవకాశం ఉంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71బీహెచ్పీ పవర్, 96ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బోఛార్జ్డ్ యూనిట్ 98బీహెచ్పీ పవర్, 160ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 5-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ లేదా 5-స్పీడ్ ఏఎమ్టీతో కనెక్ట్ చేసి ఉంటుంది. మరోవైపు, టర్బోఛార్డ్డ్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నిస్సాన్ మాగ్నైట్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభమై రూ.11.27 లక్షల వరకు ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ధరలపై క్లారిటీ లేదు. కాగా కొత్త ఎస్యూవీ ధర, పాత వర్షెన్ కన్నా స్వల్పంగా ఎక్కువగా ఉండొచ్చు.
సంబంధిత కథనం