MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీకి రూ.2 లక్షల డౌన్ పేమెంట్ కడితే లోన్ ఎంత కావాలి? ఈఎంఐ ఎంత?
MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ .9.99 లక్షలుగా నిర్ణయించింది. దీని డిజైన్, స్టైల్, రేంజ్, ఫీచర్ల ఆధారంగా కస్టమర్లను ఆకర్శిస్తోంది. ఒకవేళ మీరు రూ.2 లక్షల డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవాలి అనుకుంటే రుణం ఎంత కావాలి? ఈఎంఐ ఎంత?
ఎంజీ విండ్సర్ ఈవీని కొనాలి అనుకుంటున్నారా? మెుత్తం డబ్బులు చెల్లించి తీసుకోలేకపోతున్నారా? అయితే మీరు లోన్ తీసుకుని ఈఎంఐ పద్ధతిలో పే చేసుకోవచ్చు. అందుకోసం ఈఎంఐ, రుణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. తద్వారా మీరు తక్కువ బడ్జెట్‌లో కూడా ఈ కారును సులభంగా కొనుగోలు చేయవచ్చు. కారు ఈఎంఐ కూడా మీ లోన్ వడ్డీ రేటు, రుణ కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దేశంలోని పలు బ్యాంకులతో పాటు ఫైనాన్స్ కంపెనీలు కూడా రుణాలు అందిస్తున్నాయి. 9 శాతం వడ్డీ రేటుతో లోన్ ఈఎంఐ తీసుకుంటే ఎంత చెల్లించాలో తెలుసుకోండి. కారు ఎక్స్-షోరూమ్ ధరపై రుణాన్ని లెక్కించి వివరిస్తున్నాం. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ లేదా ఇతరత్రా కారు ఆన్-రోడ్ ధర ఖర్చును మీరు చెల్లించాల్సి ఉంటుంది.
ఈఎంఐగా ఎంత పే చేయాలి?
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రారంభ ధర రూ.10 లక్షలుగా ఉంది. ఈ సందర్భంలో మీరు 20 శాతం డౌన్ పేమెంట్ అంటే రూ .2 లక్షలు చెల్లించాలి. అదే సమయంలో 80 శాతం అంటే రూ.8 లక్షల రుణం తీసుకోవాల్సి ఉంటుంది. 9 శాతం వడ్డీ రేటుతో 7 సంవత్సరాల పాటు రుణం తీసుకున్నప్పుడు నెలకు రూ .12,871 ఈఎంఐ అవుతుంది. ఈ విధంగా మీరు రుణంపై రూ .2,81,186 వడ్డీ చెల్లించాలి.
9 శాతం వడ్డీ రేటుతో 6 సంవత్సరాల కోసం రుణం తీసుకుంటే నెలకు రూ .14,420 ఈఎంఐ పడుతుంది. ఈ విధంగా మీరు రుణంపై రూ .2,38,271 వడ్డీ చెల్లించాలి. అదే విధంగా 9 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్ల పాటు రుణం తీసుకుంటే నెలకు రూ.16,607 ఈఎంఐ వస్తుంది. ఈ విధంగా మీరు రుణంపై రూ .1,96,401 వడ్డీ చెల్లించాలి.
ఎంజీ విండ్సర్ ఈవీ పవర్ట్రెయిన్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఎంజీ విండ్సర్ ఈవీలో 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. దీని పరిధి 331 కి.మీ. ముందు చక్రాలకు శక్తినిచ్చే ఎలక్ట్రిక్ మోటార్ 134 బిహెచ్‌పీ పవర్, 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఎకో, ఎకో+, నార్మల్, స్పోర్ట్ అనే నాలుగు డ్రైవ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.
కారు లోపల సీట్లకు క్విల్టెడ్ ప్యాటర్న్ లభిస్తుంది. ఇందులో 15.6 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది గొప్ప సీట్‌బ్యాక్ ఎంపికను కలిగి ఉంది. 135 డిగ్రీల వరకు ఎలక్ట్రికల్‌గా వంచగలదు. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, రియర్ ఏసీ వెంట్స్, కప్ హోల్డర్స్‌తో కూడిన సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా లభిస్తుంది.
వైర్ లెస్ ఫోన్ మిర్రరింగ్, వైర్ లెస్ ఛార్జర్, 360 డిగ్రీల కెమెరా, క్లైమేట్ కంట్రోల్ విత్ రియర్ ఏసీ వెంట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, రిక్లైనింగ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మల్టిపుల్ లాంగ్వేజ్ నాయిస్ కంట్రోలర్లు, జియో యాప్స్ అండ్ కనెక్టివిటీ, టీపీఎంఎస్, 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఫుల్ ఎల్ఈడీ లైట్‌లాంటి ఫీచర్లు ఎండీ విండ్సర్‌లో వస్తాయి.