Maruti Suzuki Swift CNG : మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ లాంచ్.. కిలోకు 32.8 కి.మీ మైలేజీ, ధర ఎంత?-maruti suzuki swift cng launched at 8 19 lakh rupees delivers 32 85 km with kg check all details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Swift Cng : మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ లాంచ్.. కిలోకు 32.8 కి.మీ మైలేజీ, ధర ఎంత?

Maruti Suzuki Swift CNG : మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ లాంచ్.. కిలోకు 32.8 కి.మీ మైలేజీ, ధర ఎంత?

Anand Sai HT Telugu
Sep 12, 2024 12:50 PM IST

Maruti Suzuki Swift CNG : మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ లాంచ్ అయింది. ఈ కార్లపై మారుతి ఫోకస్ చేస్తోంది. భారీగా వాహనాలను విక్రయించాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ కారు ధర ఎంత? ఫీచర్లు ఏంటి చూద్దాం..

మారుతి స్విఫ్ట్ సీఎన్జీ లాంచ్
మారుతి స్విఫ్ట్ సీఎన్జీ లాంచ్

డీజిల్ మోడళ్లను నిలిపివేసిన తరువాత సీఎన్జీ అమ్మకాలపై మారుతి సుజుకి ఫోకస్ చేస్తోంది. తాజాగా మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ సీఎన్జీని భారతదేశంలో విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ఆరు లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాపులర్ స్విఫ్ట్ మోడల్ ఈ అమ్మకాలను పెంచుతుందని భావిస్తున్నారు.

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ సీఎన్జీని భారత మార్కెట్లో విడుదలైంది. వీటి ధరలు రూ.8.19 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.19 లక్షల వరకు ఉన్నాయి. రెండు ధరలు ఎక్స్-షోరూమ్‌. డీజిల్ మోడళ్లను నిలిపివేసిన తరువాత మారుతి సుజుకి సీఎన్జీపై ప్రధానంగా దృష్టి పెట్టింది. 24-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆరు లక్షల సీఎన్జీ వాహనాల అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. స్విఫ్ట్ టార్గెట్ సేల్స్ సంఖ్యను సాధించడంలో బ్రాండ్‌ మరింత సహాయపడుతుంది. ఎందుకంటే ఈ మోడల్ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. ఈ కొత్త కారు 12 అక్టోబర్ 2024 నుండి కస్టమర్‌లకు డెలివరీ అవుతుంది.

స్విఫ్ట్ సీఎన్‌జీ సామర్థ్యం

మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ కిలోకు 32.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్‌తో నడిచేటప్పుడు, మాన్యువల్ గేర్ బాక్స్ లీటరుకు 24.80 కిలోమీటర్లు, ఎఎమ్ టి ట్రాన్స్ మిషన్ లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

ఫీచర్లు

మారుతి సుజుకి స్విఫ్ట్ మూడు సిలిండర్ల ఇంజిన్‌ను సీఎన్జీకి అనుకూలంగా మార్చింది. ఇది 5,700 ఆర్‌పీఎమ్ వద్ద 68.79 బిహెచ్‌పీ పవర్, 2,900 ఆర్‌పీఎమ్ వద్ద 101.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 81బిహెచ్‌పీ పవర్, 112ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సీఎన్జీ వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను మాత్రమే పొందుతాయి. పెట్రోల్ పవర్ట్రెయిన్తో, 5-స్పీడ్ ఏఎమ్‌టీ కూడా లభిస్తుంది.

LED ఫాగ్ లైట్లు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టైల్‌లైట్లు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, తొమ్మిది-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్‌లు, OTA అప్‌డేట్‌ల‌తోపాటుగా మరికొన్ని పీచర్లు ఉన్నాయి.

వేరియంట్‌ల వారీగా మారుతి సుజుకి స్విఫ్ట్ CNG ధరలు (ఎక్స్-షోరూమ్)

స్విఫ్ట్ VXi CNG - రూ. 8.19 లక్షలు

స్విఫ్ట్ VXi (O) CNG - రూ. 8.46 లక్షలు

స్విఫ్ట్ ZXi CNG - రూ. 9.19 లక్షలు