Mahindra Thar Roxx vs Mahindra Scorpio N : ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? ఏది కొనొచ్చు?
Thar Roxx on road price Hyderabad : మహీంద్రా థార్ రాక్స్ వర్సెస్ మహీంద్రా స్కార్పియో ఎన్.. ఈ రెండు 4x4 ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? ఏది కొంటే బెటర్? పూర్తి విశ్లేషణను ఇక్కడ చూసేయండి..
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్‌కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఎస్‌యూవీకి పెట్టింది పేరుగా ఎదుగుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ నుంచి ఇప్పటికే చాలా ప్రాడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి. వీటికి తోడు 5 డోర్ థార్ రాక్స్‌ని ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ ఆజోమొబైల్ సంస్థ. ఈ నేపథ్యంలో మహీంద్రాకు బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్న మరో ఎస్యూవీ.. మహీంద్రా స్కార్పియో ఎన్ని- మహీంద్రా థార్ రాక్స్‌తో పోల్చి, ఏది బెస్ట్? ఏది కొనొచ్చు? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మహీంద్రా థార్ రాక్స్ వర్సెస్ మహీంద్రా స్కార్పియో ఎన్: డైమెన్షన్స్..
థార్ రాక్స్- స్కార్పియో ఎన్ రెండూ వాటి కొలతల పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. థార్ రోక్స్ 4428 ఎంఎం పొడవు, 1870 ఎంఎం వెడల్పుతో మరింత కాంపాక్ట్‌గా ఉంటుంది. స్కార్పియో ఎన్ చాలా పెద్దది! పొడవు 4662 ఎంఎం, వెడల్పు 1917 ఎంఎం. అయితే స్కార్పియో ఎన్తో పోలిస్తే రాక్స్ కాస్త ఎత్తుగా ఉంటుంది. స్కార్పియో ఎన్ ఎత్తు 1857 మిల్లీమీటర్లు కాగా, థార్ రోక్స్ ఎత్తు 11923 మిల్లీమీటర్లు.
మహీంద్రా థార్ రాక్స్ వర్సెస్ మహీంద్రా స్కార్పియో ఎన్: ఇంజిన్- పర్ఫార్మెన్స్..
ఈ రెండు మహీంద్రా ఎస్‌యూవీలు ఆర్ డబ్ల్యూడీ (4×4) డ్రైవ్ ట్రెయిన్ వేరియంట్లలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను అందిస్తున్నాయి.
థార్ రాక్స్‌లో 2000 సీసీ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 330 ఎన్ఎమ్ లేదా 380 ఎన్ఎమ్ టార్క్, 150 బీహెచ్పీ, 160 బీహెచ్పీ, 174 బీహెచ్పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. అయితే పెట్రోలలోని థార్ రాక్స్ ఆర్ డబ్ల్యూడీ సెటప్‌తో మాత్రమే వస్తుంది. మరోవైపు స్కార్పియో ఎన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 197 బీహెచ్పీస 370 ఎన్ఎమ్ టార్క్, ఆటోమేటిక్‌తో 380 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
థార్ రాక్స్ డీజిల్ ఇంజన్‌తో,ఆర్డబ్ల్యూడీ వేరియంట్ 150బీహెచ్పీ పవర్, 330 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 4×4 వేరియంట్లలో ఇది 173బీహెచ్పీ పవర్, 370ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్కార్పియో ఎన్ డీజిల్ యూనిట్ ఆర్డబ్ల్యూడీతో కూడిన వేరియంట్లకు 130బీహెచ్పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 4×4 స్కార్పియో ఎన్తో, మీరు మాన్యువల్‌తో 173 బీహెచ్పీ, 370 ఎన్ఎమ్ టార్క్, 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో 400 ఎన్ఎమ్ టార్క్‌ని పొందుతారు.
మహీంద్రా థార్ రాక్స్ వర్సెస్ మహీంద్రా స్కార్పియో ఎన్: ఫీచర్లు
థార్ రాక్స్ ఎస్యూవీ డ్యాష్ బోర్డ్ డ్యూయzల్-టోన్ బ్లాక్, బీజ్ ట్రీట్మెంట్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన రెండు 10.25-ఇంచ్ డిస్ప్లేలను పొందుతుంది. సింగిల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, సింగిల్ ప్యాన్ లేదా పనోరమిక్ సన్ రూఫ్ (వేరియంట్ ను బట్టి), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.
స్కార్పియో ఎన్లో డ్యూయెల్ టోన్ బ్లాక్ అండ్ బ్రౌన్ ఇంటీరియర్స్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8-ఇంచ్ టచ్‌స్క్రీన్, 12-స్పీకర్ సెటప్, 7-ఇంచ్ కలర్ ఎంఐడీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్ విఎమ్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, ఎలక్ట్రికల్ అడ్జెస్టెబుల్, ఆటో-ఫోల్డ్ ఓఆర్ విఎమ్లు, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ యూఎస్బీ ఛార్జర్లు ఉన్నాయి. వైర్లెస్ ఛార్జర్, రేర్ సీట్ల కోసం టైప్-సి ఛార్జర్ వస్తుంది.
మహీంద్రా థార్ రోక్స్ వర్సెస్ మహీంద్రా స్కార్పియో ఎన్: ధర
థార్ రాక్స్ ప్రారంభ ధర రూ .12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా స్కార్పియో ఎన్ ప్రారంభ ధర రూ .13.85 లక్షలు (ఎక్స్-షోరూమ్).
మరి ఈ రెండింట్లో మీరు ఏది కొంటారు?