SUV Cars : టాటా పంచ్ స్పీడ్‌ని బ్రేక్ చేసేందుకు మారుతి, హ్యుందాయ్ ప్లానింగ్.. చౌకగా కార్లు!-maruti suzuki and hyundai planning to launch new micro affordable suvs to compete with tata punch ev ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Suv Cars : టాటా పంచ్ స్పీడ్‌ని బ్రేక్ చేసేందుకు మారుతి, హ్యుందాయ్ ప్లానింగ్.. చౌకగా కార్లు!

SUV Cars : టాటా పంచ్ స్పీడ్‌ని బ్రేక్ చేసేందుకు మారుతి, హ్యుందాయ్ ప్లానింగ్.. చౌకగా కార్లు!

Anand Sai HT Telugu
Sep 03, 2024 01:30 PM IST

SUV Cars : ఎస్‌యూవీ కార్లకు ఇటీవల డిమాండ్ పెరుగుతుంది. టాటా పంచ్ మంచి అమ్మకాలతో ముందు ఉంది. ఈ కంపెనీ అమ్మకాలు చూసిన మారుతీ, హ్యుందాయ్ కొత్త కార్లను ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మార్కెట్‌లోకి కార్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ
హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ

భారతదేశంలో మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్ ఇటీవల ప్రజాదరణ పొందుతోంది. ఇందుకు ఉదాహరణ ఏంటంటే.. టాటా పంచ్ అనే చిన్న కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. టాటా పంచ్ విక్రయాలను చూసిన తర్వాత, మారుతి సుజుకీ, హ్యుందాయ్ ఈ విభాగంలో కొత్త వాహనాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాటా పంచ్‌కు పోటీగా తీసుకువచ్చేందుకు ప్లానింగ్ చేస్తున్నాయి.

హ్యుందాయ్ మైక్రో ఎస్‌యూవీ

మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ ఇప్పటికే ఆధునిక స్టైలింగ్‌తో కూడిన ఎక్స్‌టర్‌ని కలిగి ఉంది. హ్యుందాయ్ అదే మోడల్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తక్కువ ధరలో ఇన్‌స్టర్ పేరుతో పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్‌తో సహా కొన్ని కొత్త డిజైన్ ఎలిమెంట్స్ మినహా ముందు డిజైన్ అలాగే ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ దాదాపు హ్యుందాయ్ లోగో క్రింద ఉంటుంది. వెనుక భాగంలో ఇది హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌ను కలిగి ఉంటుంది. టెయిల్ లైట్‌లకు కనెక్ట్ అయ్యే గ్లోస్-బ్లాక్ బార్‌తో జత చేసి రూఫ్ స్పాయిలర్ ఉంటుంది. మధ్యలో హ్యుందాయ్ లోగో కూడా ఉంటుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే పెద్ద 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉండవచ్చు. వైర్‌లెస్ ఛార్జర్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటాయి. ఇందులో యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ సరౌండ్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి. ఇన్‌స్టర్ EVని 42 kW, 49 kW రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందించవచ్చు. ఇది 95 bhp పవర్ కలిగిన చిన్న బ్యాటరీ, 113 bhp పవర్ కలిగిన పెద్ద బ్యాటరీ రెండింటికీ 147 Nm టార్క్ ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేస్తుందని తెలుస్తోంది. ఈ మోడల్ గరిష్టంగా 355 కి.మీ వరకు వెళ్తుంది.

మారుతి సుజుకి మైక్రో ఎస్‌యూవీ

మారుతి ఇప్పటికే మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో S-ప్రెస్సో, ఇగ్నిస్ కార్లను అందిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.., మారుతి కొత్త మైక్రో-ఎస్‌యూవీ 2026లో విడుదల కానుంది. దీని గురించి పెద్దగా సమాచారం లేనప్పటికీ, ఇది 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది. డిజైన్ విషయానికొస్తే ఇది గ్రాండ్ విటారా, ఫ్రాంక్‌ల మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. కొత్త ఇంటీరియర్‌లో పెద్ద హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆటో HVAC, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.

కొత్త మైక్రో ఎస్‌యూవీ 1.2-లీటర్ Z-సిరీస్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుందని భావిస్తున్నారు. మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉంటాయి. వాహనం భవిష్యత్తును నిర్ణయించే ముఖ్యమైన అంశం ధర. పోటీదారుల ధరలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్‌లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది.