Hyundai Alcazar vs MG Hector Plus : ఈ రెండు బడా ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ?-2024 hyundai alcazar vs mg hector plus which one should be your choice ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Alcazar Vs Mg Hector Plus : ఈ రెండు బడా ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ?

Hyundai Alcazar vs MG Hector Plus : ఈ రెండు బడా ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ?

Sharath Chitturi HT Telugu
Sep 15, 2024 11:33 AM IST

Alcazar vs Hector Plus : 2024 హ్యుందాయ్​ అల్కాజార్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​ ప్లస్​.. ఈ రెండు బడా ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఇక్కడ తెలుసుకోండి..

2024 హ్యుందాయ్​ అల్కాజార్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​ ప్లస్​..
2024 హ్యుందాయ్​ అల్కాజార్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​ ప్లస్​..

సరికొత్త డిజైన్​, అప్​గ్రేడెడ్​ ఫీచర్స్​తో 2024 హ్యుందాయ్​ అల్కాజార్​ని ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. కొత్త అల్కాజార్ హ్యుందాయ్ క్రెటాకు బిగ్గర్​ వర్షెన్​గా వస్తుంది. అయితే స్టైలింగ్​ లాంగ్యువేజ్​లో మాత్రం క్రేటా నుంచి అల్కాజార్​ స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తుంది. హ్యుందాయ్ అల్కాజార్ అప్డేటెడ్ వెర్షన్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ .14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ధర రూ .21.55 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎంపీవీ వైబ్​ని ఇస్తున్న ఈ ప్రీమియం ఎస్​యూవీ.. మార్కెట్​లో ఉన్న ఎంజీ హెక్టార్​ ప్లస్​కి గట్టిపోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

2024 హ్యుందాయ్ అల్కాజార్ వర్సెస్ ఎంజీ హెక్టార్ ప్లస్: ధర

2024 హ్యుందాయ్ అల్కాజార్ ధర రూ .14.99 లక్షల నుంచి రూ .21.55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మరోవైపు, ఎంజీ హెక్టార్ ప్లస్ ధర రూ .17 లక్షల నుంచి రూ .22.83 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

ఇదీ చూడండి:- Volkswagen SUV : టాటా నెక్సాన్​కి పోటీగా.. వోక్స్​వ్యాగన్​ కొత్త ఎస్​యూవీ!

2024 హ్యుందాయ్ అల్కాజార్ వర్సెస్ ఎంజీ హెక్టార్ ప్లస్: స్పెసిఫికేషన్

2024 హ్యుందాయ్ అల్కాజార్ రెండు ఇంజిన్ ఆప్షన్స్​తో వస్తుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బోఛార్జ్​డ్ పెట్రోల్ ఇంజిన్ 158బీహెచ్​పీ పవర్, 253ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మేన్యువల్ లేదా 7-స్పీడ్ డీసీటీతో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఇందులోని 1.5-లీటర్ యూ2 సీఆర్​డీఐ డీజిల్ ఇంజిన్ 114బీహెచ్​పీ పవర్, 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

ఎంజీ హెక్టార్ ప్లస్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ మోటార్​లో 1.5-లీటర్ టర్బోఛార్జ్​డ్​ యూనిట్ ఉంటుంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్, సీవీటీతో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 141బీహెచ్​పీ పవర్, 250ఎన్ఎమ్ పీక్​ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. మరోవైపు, డీజిల్ వేరియంట్ 2.0-లీటర్ టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్ నుంచి పవర్​ని పొందుతుంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్​మిషన్​తో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 167బీహెచ్​పీ పవర్, 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

సంబంధిత కథనం