Tata Punch facelift : టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​- కొత్తగా వచ్చే ఫీచర్స్​ ఇవే..-tata punch facelift launched gets new features check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch Facelift : టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​- కొత్తగా వచ్చే ఫీచర్స్​ ఇవే..

Tata Punch facelift : టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​- కొత్తగా వచ్చే ఫీచర్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu
Sep 17, 2024 03:23 PM IST

Tata Punch facelift launch : భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో టాటా పంచ్ ఫేస్​లిఫ్ట్ లాంచ్​ అయ్యింది. సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లతో ఈ 2024 టాటా పంచ్​ ఇప్పుడు అందుబాటులో ఉంది. సన్​రూఫ్​ వేరియంట్లు కూడా పెరిగాయి. చౌకగా లభిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. పూర్తి వివరాలు..
టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. పూర్తి వివరాలు..

మచ్​ అవైటెడ్​ టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ని టాటా మోటార్స్​ సంస్థ మంగళవారం సైలెంట్​గా లాంచ్​ చేసింది. ఈ 2024 టాటా పంచ్​ ఎక్స్​షోరూం ధర రూ. 6.12లక్షల నుంచి రూ. 9.45లక్షల వరకు ఉంటుంది. అలాగే, టాటా మోటార్స్​కి బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా ఉన్న టాటా పంచ్​పై రూ .18,000 వరకు బెనిఫిట్స్​ని ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ అప్డేటెడ్​, 2024 టాటా పంచ్​ ఎస్​యూవీని సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​లో బుక్​ చేసుకోవచ్చు.

2025 ఆర్థిక సంవత్సరంలో పంచ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా కొనసాగుతోందని దేశీయ ఆటో మేజర్ తెలిపింది. ఆగస్టు 2024లో నాలుగు లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకున్న దేశంలో అత్యంత వేగవంతమైన ఎస్​యూవీ ఈ టాటా పంచ్ అని కార్ల తయారీ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు, పండుగ సీజన్​కి ముందు ఫేస్​లిఫ్ట్​ని విడుదల చేయడంతో, పంచ్ ఎస్​యూవీకి అమ్మకాలు పెరుగుతాయని సంస్థ భావిస్తోంది.

టాటా పంచ్ ఫేస్​లిఫ్ట్ అప్​గ్రేడెడ్ ఫీచర్ లిస్ట్​తో వస్తుంది. ఇందులో కొన్ని క్లాస్-లీడింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎస్​యూవీలో వైర్​లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లేతో కూడిన 10.25-ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్, వైర్​లెస్ ఫోన్ ఛార్జర్, గ్రాండ్ కన్సోల్​తో కూడిన ఆర్మ్​రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్, టైప్ సీ ఫాస్ట్ యూఎస్​బీ ఛార్జర్ ఉన్నాయి.

ఈ ఫీచర్లను జోడించడం ద్వారా టాటా పంచ్ మొత్తం లైనప్​ని పూర్తి కొత్త వేరియంట్లతో అప్​గ్రేడ్ చేసినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. అడ్వెంచర్​ వేరియంట్​లో ఆటో కంపెనీ సన్​రూఫ్​ని యాడ్​ చేసింది. ఫలితంగా పంచ్​లో సన్​రూఫ్​ సన్ రూఫ్ అమర్చిన వేరియంట్లు మరింత చౌకగా మారాయని వాహన తయారీ సంస్థ పేర్కొంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అప్​డేట్ చేసిన టాటా పంచ్​లో ఎటువంటి కాస్మెటిక్ మార్పులు లేవు. ఫీచర్ అప్​గ్రేడ్​లు మాత్రమే ఉన్నాయి. పవర్ట్రెయిన్ పరంగా కూడా ఎలాంటి మార్పు లేదు! ఈ ఎస్​యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 1.2-లీటర్ మోటార్ నుంచి పవర్​ని పొందుతుంది. కారు ట్రాన్స్​మీషనన్ ఆప్షన్స్​లో మాన్యువల్, ఏఎంటీ గేర్​బాక్స్​ ఉన్నాయి.

ఆగస్ట్​ నెల సేల్స్​లో తగ్గిన పంచ్​ జోరు..!

ఆగస్ట్​ నెలకు సంబంధించిన బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల డేటాలో చాలా మార్పులు కనిపించాయి. ఇప్పటివరకు నెం.1గా కొనసాగుతున్న టాటా పంచ్​ 3వ స్థానానికి పడిపోయింది. మారుతీ సుజుకీ బ్రెజా టాప్​లో నిలిచింది.

ఆగస్టులో ఎస్​యూవీల అమ్మకాల్లో 32 శాతం వృద్ధితో మారుతీ సుజుకీ బ్రెజా అగ్రస్థానంలో నిలిచింది. కార్ల తయారీదారు ఈ ఎస్​యూవీ 19,190 యూనిట్లను విక్రయించింది, ఇది గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన 14,572 యూనిట్లతో పోలిస్తే ఎక్కువ. అంతకుముందు నెలలో విక్రయించిన 14,676 యూనిట్లతో పోలిస్తే ఇది అధికం. మారుతీ సుజుకీ పోర్ట్ఫోలియోలోని ఇతర ఎస్​యూవీలతో పాటు గత నెలలో 1.80 లక్షలకు పైగా కార్ల అమ్మకాలను సాధించడానికి బ్రెజా సహాయపడింది.

టాటా మోటార్స్ కు చెందిన అతిచిన్న ఎస్​యూవీ ఆగస్టు సేల్స్​లో మూడో స్థానానికి పడిపోయింది. ఐసీఈ, సీఎన్​జీ, ఈవీ వెర్షన్లలో అందిస్తున్న పంచ్ గత నెలలో 15,643 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఆగస్టులో 14,523 యూనిట్ల అమ్మకాలు జరగ్గా, జులైలో 16,121 యూనిట్లకు పడిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం