Hyundai Venue Adventure Edition : వచ్చేసింది హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్.. ఇందులో కొత్తగా ఏముందో తెలుసా?
Hyundai Venue Adventure Edition Launched : హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ లాంచ్ అయింది. ఇందులో కొన్ని ఫీచర్లు యాడ్ చేశారు. ఈ కారు ధర ఎంత? కొత్తగా ఏం అప్‌డేట్ చేశారో చూద్దాం..
హ్యుందాయ్ మోటార్ ఇండియా.. వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్‌ను రూ.10.15 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ మూడు వేరియంట్లలో వస్తుంది. ఎస్ (ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ). అడ్వెంచర్ ఎడిషన్ బ్లాక్ స్కిడ్ ప్లేట్లు, డోర్ క్లాడింగ్, నలుపు రంగు అల్లాయ్ వీల్స్‌తో ఎక్సిటీరియర్ వస్తుంది. రెడ్ బ్రేక్ కాలిపర్స్‌తో పాటు ఎక్స్ క్లూజివ్ అడ్వెంచర్ ఎంబ్లమ్, బ్లాక్ పెయింటెడ్ రూఫ్ రైల్స్, ఓఆర్ వీఎంలు, షార్క్ ఫిన్ యాంటెనా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ 4 మోనోటోన్ రంగులలో లభిస్తుంది. రేంజర్ ఖాకీ, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రేతో వస్తుంది. 3 డ్యూయల్ టోన్ రంగులు - రేంజర్ ఖాకీ బ్లాక్ రూఫ్, అట్లాస్ వైట్ విత్ బ్లాక్ రూఫ్, టైటాన్ గ్రే విత్ బ్లాక్ రూఫ్‌తో ఉంటుంది.
లోపలి భాగంలో లేత సేజ్ గ్రీన్ కలర్ ఇన్సర్ట్స్‌తో బ్లాక్ యాక్సెంట్స్, అడ్వెంచర్ ఎడిషన్ సీట్లు మ్యాచింగ్ హైలైట్స్‌తో ఉన్నాయి. అడ్వెంచర్ ఎడిషన్‌లో మెటల్ పెడల్స్, డ్యూయల్ కెమెరాలతో కూడిన డాష్ క్యామ్ కూడా వస్తాయి. వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో జత చేసిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 82 బీహెచ్పీ, 113.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్ డీసీటీతో జతచేసిన 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 118 బీహెచ్పీ, 172 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ దీని గురించి మాట్లాడారు. 'వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్‌తో వినియోగదారుల అంచనాలను అందుకుంటాం.' అని చెప్పారు.
హ్యుందాయ్ వెన్యూ ఇటీవలి అప్‌డేట్
హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త వెన్యూ ఇ ప్లస్ వేరియంట్‌ను బేస్ వేరియంట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ ఇ ప్లస్ ధర రూ .8.23 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎంట్రీ లెవల్ వెన్యూ ఇ ట్రిమ్ కంటే సుమారు రూ .29,000 ఎక్కువ.
ఎలక్ట్రిక్ సన్ రూఫ్‌తో కొత్త హ్యుందాయ్ వెన్యూ ఇ ప్లస్ కియా సోనెట్ హెచ్‌టిఇ(ఓ) ట్రిమ్‌ను అధిగమించింది. ఈ ఫీచర్ ధర రూ .8.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో అత్యంత సరసమైన సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ. ఇది కాకుండా హ్యుందాయ్ వెన్యూ ఇ ప్లస్‌లో టీఎఫ్టీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ హెడ్రెస్ట్, 60: 40 రియర్ సీట్ స్ప్లిట్ సీట్లు, టూ-స్టెప్ రిక్లైనింగ్ ఫంక్షన్.. ఇలా మరెన్నో ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు, డే అండ్ నైట్ ఐఆర్ విఎమ్, అన్ని సీట్లకు మూడు పాయింట్ల సీట్ బెల్ట్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఈఎస్ సీ), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్(హెచ్‌ఏసీ) తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.