Maruti Suzuki Swift Dzire : హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
Maruti Suzuki Swift Dzire on road price Hyderabad : మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే.. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Maruti Suzuki Swift Dzire on road price in Hyderabad : బడ్జెట్లో మంచి కారు తీసుకోవాలని చేస్తున్నారా? దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటైన స్విఫ్ట్ డిజైర్.. మీ లిస్ట్‌లో ఉందా? అయితే.. ఇది మీకోసమే. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్ ఆన్‌రోడ్ ప్రైజ్..
మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్:- రూ. 6.56 లక్షలు
డిజైర్ వీఎక్స్ఐ పెట్రోల్:- రూ. 7.49 లక్షలు
డిజైర్ వీఎక్స్ఐ ఏజీఎస్ పెట్రోల్:- రూ. 7.99 లక్షలు
డిజైర్ జెడ్ఎక్స్ఐ పెట్రోల్:- రూ. 8.17 లక్షలు
డిజైర్ వీఎక్స్ఐ సీఎన్జీ పెట్రోల్:- రూ. 8.44 లక్షలు
డిజైర్ జెడ్ఎక్స్ఐ ఏజీఎస్ పెట్రోల్:- రూ. 8.67 లక్షలు
Swift Dzire on road price Hyderabad : డిజైర్ జెడ్ఎక్స్ఐ ప్లస్ పెట్రోల్:- రూ. 8.89 లక్షలు
డిజైర్ జెడ్ఎక్స్ఐ సీఎన్జీ పెట్రోల్:- రూ. 9.12 లక్షలు
డిజైర్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏజీఎస్ పెట్రోల్:- రూ. 9.39 లక్షలు
ఇదీ చూడండి:- Maruti Suzuki Swift on road price Hyderabad : హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్..
అంటే.. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 6.56 లక్షలు- రూ. 9.39లక్షల మధ్యలో ఉంటుంది. ఇక.. ఇందులో ఎలాంటి డీజిల్ వేరియంట్ అందుబాటులో లేదు. ఒక సీఎన్జీ వేరియంట్ ఉంది. మిగిలినవి అన్నీ పెట్రోల్ వేరియంట్సే.
సాధారణంగా.. ఏదైనా కారును లాంచ్ చేసే సమయంలో.. దాని ఎక్స్‌షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తాయి ఆటోమొబైల్ సంస్థలు. కానీ.. వాటి ఆన్‌రోడ్ ప్రైజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే.. కారు కొనే ముందు.. ఎక్స్‌షోరూం ధరతో పాటు ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను కూడా తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నప్పుడే బడ్జెట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Maruti Suzuki Swift Dzire : మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌కు వెళ్లినట్టైతే.. ఆ సమయంలో కారుపై ఏదైనా ఆఫర్, డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ వంటివి ఉన్నాయా? అనేది తెలుస్తుంది. అది మీకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. పైగా.. వాహనాన్ని ఫిజికల్‌గా చెక్ చేసినట్టు కూడా ఉంటుంది. అందుకే.. ఒకసారి మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ను సందర్శించి నిర్ణయం తీసుకోవడం బెటర్.
2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్..
మారుతీ సుజుకీ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌కి త్వరలోనే అప్డేట్ వర్షెన్ రాబోతోంది. ఇందులో భారీ మార్పులే కనిపిస్తాయని టాక్ నడుస్తోంది. మే నెలలో ఈ మోడల్ లాంచ్ అవుతుందని సమాచారం. ఇక పలు ఎంపిక చేసిన డీలర్షిప్ షోరూమ్స్‌లో 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్ బుకింగ్స్ సైతం మొదలయ్యాయి. రూ. 11వేల టోకెన్ అమౌంట్‌తో ఈ హ్యాచ్‌బ్యాక్‌ని బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అంతేకాదు.. మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్‌కి కూడా అప్డేటెడ్ వర్షెన్ రెడీ అవుతోందని సమాచారం. దీని లాంచ్‌పై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ. కొన్ని రోజుల్లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం