Meta AI visualisation feature: మెటా ఏఐ లో కొత్తగా విజువలైజేషన్ ఫీచర్; ఇక నచ్చిన రూపంలోకి మారిపోండి
24 July 2024, 14:19 IST
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ల యాజమాన్య సంస్థ మెటా ప్రారంభించిన కృత్రిమ మేథ టూల్ మెటా ఏఐ లో కొత్తగా విజువలైజేషన్ ఫీచర్ ను ఆవిష్కరించారు. ఈ మెటా ఏఐ విజువలైజేషన్ ఫీచర్ గురించి సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇన్స్టాగ్రామ్లో వివరించారు.
మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్
Meta AI visualisation feature: మెటా ఏఐ లో కొత్త ఫీచర్ ను ఆవిష్కరించారు. ఇది విజువలైజేషన్ ఫీచర్. దీన్ని ఉపయోగించి, నచ్చిన అవతారంలోకి మారిపోవచ్చు. ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలనే విషయాలను మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో సవివరంగా తెలిపారు. స్వయంగా తాను గ్లాడియేటర్, బాయ్ బ్యాండ్ మెంబర్ గా మారి చూపించారు.
ఏంటీ మెటా ఏఐ విజువలైజేషన్ ఫీచర్?
మెటా ఏఐలోని ఈ కొత్త ఫీచర్ ను ఉపయోగించి నచ్చిన స్టైల్ లోకి ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. తమ కస్టమ్ ఇమేజ్ లను క్రియేట్ చేసుకునేందుకు మెటా ఏఐ సహకరిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇన్ స్టాలో వివరించారు. ఈ కొత్త ఫీచర్ వివిధ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాల్లో ఇది అందుబాటులో ఉంది.
మెటా ఏఐ విజువలైజేషన్ ఫీచర్ ను ఇలా ఉపయోగించాలి
మెటా ఏఐని ఉపయోగించి యూజర్లు తమ ముఖాన్ని స్కాన్ చేసి, తమను తమకు నచ్చిన ఇమేజ్ లోకి ట్రాన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని జుకర్బర్గ్ స్వయంగా డెమో చేసి చూపించారు. తనను గ్లాడియేటర్ గా, బాయ్ బ్యాండ్ సభ్యుడిగా, ఆపై పెద్ద బంగారు గొలుసు ధరించినట్లుగా ఇమేజ్ లను క్రియేట్ చేసి, ఆ వీడియోను ఇన్ స్టా లో పోస్ట్ చేశారు.
కంటెంట్ క్రియేటర్లకు యూజ్ ఫుల్ ఫీచర్
ఈ మెటా ఏఐ విజువలైజేషన్ ఫీచర్ కంటెంట్ క్రియేటర్లకు బాగా ఉపయోగపడుతుంది. వ్యాఖ్యలు, సందేశాలకు ఈ కస్టమైజ్డ్ ఇమేజెస్ ద్వారా ప్రతిస్పందించవచ్చు. తద్వారా కంటెంట్ క్రియేటర్లు తమ అభిమానులతో మరింత ఈజీ గా ఇంటరాక్ట్ కావచ్చు. అలాగే, కంటెంట్ క్రియేటర్లు మరింత క్రియేటివ్ గా తమ కంటెంట్ ను తయారు చేసుకోవచ్చు.
మెటా AI ఇప్పుడు ఏ కొత్త దేశాలలో అందుబాటులో ఉంది?
అర్జెంటీనా, కామెరూన్, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, మెక్సికో, పెరూ వంటి మరిన్ని దేశాల్లో మెటా ఏఐ అందుబాటులో ఉందని మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. అలాగే, మెటా ఏఐ (Meta AI) ఇప్పుడు హిందీ, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్ మరియు స్పానిష్ వంటి భాషల్లో అందుబాటులో ఉంది.