OTT Most watched Web Series: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన టాప్-10 హిందీ వెబ్ సిరీస్‍లు ఇవే.. మీరెన్ని చూశారు!-panchayat 3 is most watched ott web series in 2024 heeramadi next netflix amazon prime otts hindi series ormax report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Most Watched Web Series: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన టాప్-10 హిందీ వెబ్ సిరీస్‍లు ఇవే.. మీరెన్ని చూశారు!

OTT Most watched Web Series: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన టాప్-10 హిందీ వెబ్ సిరీస్‍లు ఇవే.. మీరెన్ని చూశారు!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 18, 2024 08:14 PM IST

OTT Most watched Web Series: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఎక్కువ మంది చూసిన హిందీ వెబ్ సిరీస్‍లు ఏవో సమాచారం బయటికి వచ్చింది. ఆర్మాక్స్ మీడియా రిపోర్ట్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది టాప్-10 సిరీస్‍లు ఏవంటే..

OTT Most watched Web Series: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన టాప్-10 హిందీ వెబ్ సిరీస్‍లు ఇవే.. మీరెన్ని చూశారు!
OTT Most watched Web Series: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన టాప్-10 హిందీ వెబ్ సిరీస్‍లు ఇవే.. మీరెన్ని చూశారు!

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో చాలా వెబ్ సిరీస్‍లు వచ్చాయి. కొన్ని హిందీ సిరీస్‍లు అదరగొట్టాయి. ముఖ్యంగా పంచాయత్ సిరీస్ మూడో సీజన్ అంచనాలను అందుకుంటూ భారీ వ్యూస్ సాధించింది. ఈ ఏడాది 2024 తొలి ఆరు నెలల్లో ఓటీటీ వ్యూవర్‌షిప్‍పై ఆర్మాక్స్ మీడియా ఓ రిపోర్ట్ వెల్లడించింది. వీటిలో ఈ సంవత్సరం తొలి అర్ధ భాగంలో అత్యధిక వ్యూస్ సాధించిన హిందీ వెబ్ సిరీస్‍ల జాబితాను వెల్లడించింది. టాప్-10 లిస్ట్ ఇదే.

టాప్‍లో పంచాయత్ సీజన్ 3

పాపులర్ వెబ్ సిరీస్ పంచాయత్ మూడో సీజన్ ఈ ఏడాది మే 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది తొలి రెండు సీజన్లు ఫుల్ సక్సెస్ కాగా.. ఇప్పుడు వచ్చిన మూడో సీజన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పంచాయత్ మూడో సీజన్ భారీ వ్యూస్ దక్కించుకుంది. జితేంద్ర కుమార్, రఘువీర్ యాదవ్, నైనా గుప్తా, ఫైజల్ మాలిక్ ప్రధాన పాత్రలు పోషించిన రూరల్ డ్రామా సిరీస్‍కు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు పంచాయత్ 3వ సీజన్ 28.2 మిలియన్ (2.82 కోట్లు) దక్కించుకుంది. దీంతో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న హిందీ వెబ్ సిరీస్‍గా నిలిచింది.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి వెబ్ సిరీస్ రెండో స్థానంలో నిలిచింది. మే 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ సిరీస్ ఇప్పటి వరకు 20.3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ ఏడాది ఫస్టాఫ్‍లో ఎక్కువ మంది చూసిన సిరీస్‍ల్లో రెండో ప్లేస్‍లో నిలిచింది. హీరామండి సిరీస్‍లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావ్ హైదరి, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఎక్కువ మంది చూసిన హిందీ సిరీస్‍లు

ఆర్మాక్స్ మీడియా రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఓటీటీల్లో రిలీజైన హిందీ వెబ్ సిరీస్‍ల్లో ఇప్పటి అత్యధిక వ్యూస్ దక్కించుకున్న వాటి టాప్-10 లిస్ట్ ఇదే.

  1. పంచాయత్ సీజన్ 3 - 28.2 మిలియన్ వ్యూస్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
  2. హీరామండి - 20.3 మిలియన్ వ్యూస్ (నెట్‍ఫ్లిక్స్)
  3. ఇండియన్ పోలీస్ ఫోర్స్ - 19.2 మిలియన్ వ్యూస్ (అమెజాన్ ప్రైమ్ వీడియో )
  4. కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 - 15.7 మిలియన్ వ్యూస్ (నెట్‍ఫ్లిక్స్)
  5. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 3, 4 సీజన్లు - 14.8 మిలియన్ (హాట్‍స్టార్)
  6. షోటైమ్ - 12.5 మిలియన్ వ్యూస్ (హాట్‍స్టార్)
  7. గుల్లక్ సీజన్ 4 - 12.1 మిలియన్ వ్యూస్ (సోనీ లివ్)
  8. మహారాణి సీజన్ 3 - 10.2 మిలియన్ వ్యూస్ (హాట్‍స్టార్)
  9. కిల్లర్ సూప్ - 9.2 మిలియన్ వ్యూస్ (నెట్‍ఫ్లిక్స్)
  10. జమ్నాపార్ - 9.2 - 9.2 మిలియన్ వ్యూస్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)

 

మీర్జాపూర్ 3వ సీజన్ జూలై 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. జూన్ వరకు వచ్చిన సిరీస్‍లను మాత్రమే ఆర్మాక్స్ పరిగణనలోకి తీసుకుంది.

నేరుగా ఓటీటీలోకి వచ్చిన హిందీ సినిమాల జాబితాలో అమర్ సింగ్ చమ్కీలా (నెట్‍ఫ్లిక్స్) టాప్‍లో నిలిచింది.

Whats_app_banner