Meta lay offs: ‘మెటర్నిటీ లీవ్ లో ఉన్నా వదలట్లేదు’; జుకర్ బర్గ్ పై ఆగ్రహం-zuckerberg took pay cut employee laid off on maternity leave calls out meta ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Meta Lay Offs: ‘మెటర్నిటీ లీవ్ లో ఉన్నా వదలట్లేదు’; జుకర్ బర్గ్ పై ఆగ్రహం

Meta lay offs: ‘మెటర్నిటీ లీవ్ లో ఉన్నా వదలట్లేదు’; జుకర్ బర్గ్ పై ఆగ్రహం

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 07:42 PM IST

Meta lay offs: మరో మాస్ లే ఆఫ్ కు తెర తీసిన మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) పై ఉద్యోగులు మండిపడ్తున్నారు. ఉద్యోగుల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP)

Meta lay offs: రానున్న రెండు, మూడు నెలల్లో మరో 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్ (facebook), వాట్సాప్ (whatsapp) ల యాజమాన్య సంస్థ మెటా (Meta) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై, ఉద్యోగుల తొలగింపు ప్రక్రియపై మెటా (Meta) ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Meta lay offs: మెటర్నిటీ లీవ్ లో ఉన్నప్పటికీ..

మెటా లే ఆఫ్ (Meta layoff) తో జాబ్ కోల్పోయిన ఉద్యోగులు తమ ఆవేదనను, ఆగ్రహాన్ని సోషల్ మీడియా సాక్షిగా వ్యక్తం చేస్తున్నారు. లే ఆఫ్ (layoff) ప్రక్రియ పనితీరు, సామర్ధ్యం ఆధారంగా జరగడం లేదని విమర్శిస్తున్నారు. కొన్నేళ్లుగా సంస్థ కోసం కష్టపడుతున్న ఉద్యోగులను, సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసిన ఉద్యోగులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెటర్నిటీ లీవ్ (maternity leave) లో ఉన్న సమయంలో తనను ఉద్యోగం నుంచి తొలగించారని సారా ష్నీడర్ అనే ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మెటా లో టాలెంట్ అక్విజిషన్ టీమ్ (Talent acquisition team) లో లీడ్ గా వ్యవహరించారు. పనితీరు ఆధారంగా లే ఆఫ్స్ (layoff) ఇవ్వడం లేదని ఆరోపించారు. ‘ మెటా (Meta) నా జీవితంలో కీలక మైలురాళ్లకు సాక్షిగా నిలిచింది. నా జీవిత భాగస్వామిని అక్కడే కలిశాను. వివాహం చేసుకున్నాను. ఒక బేబీకి కూడా జన్మనిచ్చాను. ఇప్పుడు అనూహ్యంగా సంస్థకు దూరమవుతున్నాను. పనితీరు ఆధారంగా లే ఆఫ్ ప్రకటించి ఉంటే నన్ను తొలగించేవారు కాదు’’ అని సారా సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకున్నారు. మెటా (Meta) లో సీనియర్ టెక్నికల్ రిక్రూటర్ (senior technical recruiter) గా ఉన్న ఆండీ ఆలెన్ కూడా తన ఆవేదనను లింక్డ్ ఇన్ (LinkedIn) లో పంచుకున్నారు. మెటర్నిటీ లీవ్ (maternity leave) లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని, ఇది తనను షాక్ కు గురి చేసిందని ఆమె తెలిపారు. వేలాది ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి మెటాకు ఎందుకు వచ్చిందని, ఈ మిస్ కాలిక్యులేషన్ కు కారణమేంటని ఆమె ప్రశ్నించారు. ఉద్యోగుల పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Meta lay offs: జుకర్ బర్గ్ వేతనం తగ్గించుకున్నాడా?

మరోవైపు, మెటా తొలగించిన ఉద్యోగులు సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) పై మండిపడుతున్నారు. ఖర్చుల తగ్గింపు లక్ష్యంతో ఉద్యోగులను తొలగిస్తున్న సీఈఓ తన వేతనాన్ని ఏమైనా తగ్గించుకున్నాడా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) పర్సనల్ సెక్యూరిటీ బడ్జెట్ ను 40% పెంచుతూ మెటా బోర్డ్ ఇటీవలనే నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పటి వరకు 10 మిలియన్ డాలర్లుగా ఉన్న మార్క్ జుకర్ బర్గ్ (Meta CEO Mark Zuckerberg) పర్సనల్ సెక్యూరిటీ ఖర్చు ఇకపై 14 మిలియన్ డాలర్లు కానుంది.

Whats_app_banner