రానున్న కొన్ని నెలల్లో కనీసం మరో 10 వేల ఉద్యోగాలను తొలగించనున్నట్లు మెటా ప్లాట్ ఫామ్స్ (Meta Platforms Inc) ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేటి పరిస్థితుల్లో మరోసారి ఉద్యోగుల భారీ తొలగింపు (layoff) తప్పదని వెల్లడించింది. ఖర్చును తగ్గించుకునే దిశగా.. ఉద్యోగాల తొలగింపే కాకుండా, మరికొన్ని చర్యలు తీసుకోబోతున్నట్లు మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (Meta Chief Executive Mark Zuckerberg) వెల్లడించారు. అందులో భాగంగా కొన్ని ప్రాజెక్టులను కేన్సిల్ చేసుకోవడం, హైరింగ్ రేట్స్ ను తగ్గించడం మొదలైనవి ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం ఉద్యోగుల సామర్ధ్యం పై ననే ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.
ఉద్యోగుల కోతలో ముందుగా రిక్రూట్మెంట్ టీమ్ (recruitment teams) లను తొలగించనున్నారు. ఆ తరువాత రీస్ట్రక్చరింగ్ టీమ్స్ ను, అనంతరం టెక్నాలజీ గ్రూప్ ఎంప్లాయీస్ పై వేటు వేస్తారు. ఈ ఏప్రిల్ చివరి నాటికి ఈ విభాగాల్లో లే ఆఫ్ (layoff) ప్రక్రియ ముగుస్తుంది. ఆ తరువాత మే నెలలో బిజినెస్ టీమ్ లో లే ఆఫ్ (layoff) ప్రారంభిస్తారు. ప్రధానంగా నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులకే ఈ లే ఆఫ్ (layoff) ముప్పు అధికంగా ఉంది. కంపెనీ భర్తీ చేయాలని గతంలో భావించిన 5 వేల ఉద్యోగాల భర్తీని కూడా నిలిపేయనుంది. ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని దీర్ఘకాలంలో తట్టుకోవాలంటే ఈ కఠిన నిర్ణయాలు తప్పవని జుకర్ బర్గ్ (Mark Zuckerberg) స్పష్టం చేశారు. తొలి విడతలో ఇప్పటికే 11 వేలమంది ఉద్యోగులను, అంటే మొత్తం ఉద్యోగుల్లో సుమారు 13% మందిని మెటా (Meta) తొలగించిన విషయం తెలిసిందే. సంస్థ నిర్వహణ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవాలని మెటా (Meta) భావిస్తోంది.