Gold dress: బంగారు ఆకులతో అనంత్ అంబానీ షేర్వానీ, ఆశ్చర్యపోయే వివరాలివే-know the details ananth ambani gold groom dress ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gold Dress: బంగారు ఆకులతో అనంత్ అంబానీ షేర్వానీ, ఆశ్చర్యపోయే వివరాలివే

Gold dress: బంగారు ఆకులతో అనంత్ అంబానీ షేర్వానీ, ఆశ్చర్యపోయే వివరాలివే

Koutik Pranaya Sree HT Telugu
Jul 21, 2024 12:30 PM IST

Gold dress: అనంత్ అంబానీ 100 బంగారు ఆకులతో అలంకరించిన ఎరుపు రంగు షేర్వానీని ధరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆశ్చర్యపరుస్తాయి.

బంగారు డ్రెస్సులో అనంత్ అంబానీ
బంగారు డ్రెస్సులో అనంత్ అంబానీ (instagram)

అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ లో అన్నీ ప్రత్యేకమే. నీతా అంబానీ భారతదేశపు గొప్ప సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసేలా ఈ వేడుకలు నిర్వహించారు. పెళ్లిని గ్రాండ్ గా చేయడంలో వాళ్లు ధరించిన దుస్తులు, ఆభరణాల పాత్ర కూడా ఉంది. అంబానీ ఆడపడుచులే కాదు పురుషులు కూడా ప్రత్యేక ట్రెండ్స్ సెట్ చేశారు. ఇక అనంత్ అంబానీ వేసుకున్న పెళ్లి దుస్తుల వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఈ షేర్వానీ వివరాలను మనీష్ మల్హోత్రా పంచుకున్నారు.

బంగారు ఆకులు:

అనంత్ అంబానీ కోసం డిజైన్ చేసిన ఈ షేర్వానీలో హ్యాండ్ పెయింటింగ్, బంగారు ఆకులను మిళితం చేశారు. దీనిని భిల్వారా కళాకారులు 600 గంటల్లో తయారు చేశారు. ముగ్గురు నిపుణులైన పిచ్వాయ్ కళాకారులు బంగారు ఆకులను ఉపయోగించి 110 గంటల్లో అంటే 4 రోజులకు పైగా దీనిని చిత్రించారు. ఇంత కష్టపడి ఈ షేర్వానీపై ఏం తయారు చేశారని మీరు ఆలోచిస్తుంటే, ఈ షేర్వానీపై శతాబ్దాల నాటి పిచ్వాయ్ పెయింటింగ్ వేశారని చెప్పాలి. నిజమైన బంగారు పొరను పూయడం ద్వారా దీనిని బంగారు రంగులోకి మార్చారు.

పిచ్వాయ్ పెయింటింగ్స్:

పిచ్వాయ్ పెయింటింగ్స్ రాజస్థాన్ లోని నాథ్ద్వారా ఆలయంతో ముడిపడి ఉన్నాయి. శ్రీకృష్ణుడిని పూజించే చోటు ఇది. ఈ పెయింటింగ్ లో కూడా శ్రీకృష్ణుని బొమ్మలు, ఆవు, పువ్వులు, ఆకులు మిళితం అయి ఉంటాయి. ఈ పెయింటింగ్ ప్రత్యేకంగా దుస్తులపై తయారు చేస్తారు. ఈ పెయింటింగ్ చరిత్ర 17వ శతాబ్దం నాటిది.

Whats_app_banner