Pravaig Defy electric SUV : మేడ్ ఇన్ ఇండియా ‘డిఫై’ ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. లాంచ్‌కు సిద్ధం!
18 November 2022, 13:54 IST
- Pravaig Defy electric SUV : మేడ్ ఇన్ ఇండియా డిఫై ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని త్వరలోనే రివీల్ చేయనుంది ప్రవాగ్. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఈవీలకు గట్టి పోటీనిచ్చే విధంగా కనిపిస్తోంది.
మేడ్ ఇన్ ఇండియా ‘డిఫై’ ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. లాంచ్‌కు సిద్ధం!
Pravaig Defy electric SUV : బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ సంస్థ ప్రవాగ్.. సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో భారతీయుల ముందుకు రానుంది. డిఫై ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ నెల 25న రివీల్ చేయనుంది ఈ సంస్థ. ఈ సంస్థ నుంచి వస్తున్న ఫ్లాగ్షిప్ వెహికిల్ ఇది. ఈ వాహనం రేంజ్, పర్ఫార్మెన్స్పై మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి.
డిఫై ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని గత కొంతకాలంగా టీజ్ చేస్తూ వస్తోంది ప్రవాగ్. ఇదొక 5 సీటర్ ప్రిమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ. వాస్తవానికి డిఫై ఎస్యూవీ.. ప్రవాగ్కు తొలి ఎలక్ట్రిక్ వాహనం కాదు. రెండేళ్ల క్రితం.. ఎక్స్‌టింక్షన్ ఎంకే1తో భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇదొక టూ డోర్, 4 సీటర్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు. కానీ ఇది కమర్షియల్‌గా క్లిక్ అవ్వలేదు. ఇక ఇప్పుడు డిఫై ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో మరోమారు ప్రజల ముందుకు రానుంది ప్రవాగ్. ఈసారి ప్రీమియం ఎస్‌యూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఫీచర్స్.. అదుర్స్..!
ప్రవాగ్ రివీల్ చేసిన సమాచారం ప్రకారం.. డిఫై ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 504కి.మీల దూరం ప్రయాణించవచ్చు. ఇదే నిజమైతే.. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ దూరం(ఒక్కసారి ఛార్జ్ చేస్తే) ప్రయాణించగలిగే ఈవీల జాబితాలోకి చేరిపోతుంది ఈ డిఫై ఎలక్ట్రిక్ ఎస్యూవీ. అంతేకాకుండా.. ఈ బ్యాటర్ 30 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అయిపోతుందని సంస్థ చెబుతోంది. అంటే ఈ ఈవీకి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టెమ్ ఉన్నట్టు స్పష్టమవుతోంది.
Defy electric SUV launch : ఈ డిఫై ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. 420హెచ్‌పీ పవర్, 620 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది ప్రవాగ్ చెబుతోంది. ఇది వోల్వో ఎక్స్‌సీ40 రీఛార్జ్, కియా ఈవీ6, ఆడీ ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో సమానంగా ఉండటం గమనార్హం. దీని టాప్ స్పీడ్.. 210కేఎంపీఎల్ అని సంస్థ చెబుతోంది. 0-100 కేఎంపీహెచ్‌ను కేవలం 4.9సెకన్లలో ఈ ఈవీ అందుకుంటుందని సంస్థ చెప్పడం విశేషం. ఫలితంగా ఈ ఈవీపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ డిఫై ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో వైఫ్, 15ఇంచ్ డెస్క్, 220వీ సాకెట్స్, 2.5ఎయిర్ ఫిల్టర్‌తో కూడిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ప్రీమియం సౌండ్ సిస్టెమ్, యూఎస్బీ సాకెట్, వయర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్స ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. ఫీచర్స్పై సంస్థ మరింత స్పష్టతను ఇవ్వాల్సి ఉంది.
Defy electric SUV price : ఇండియాలో.. డిఫై ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధరకు సంబంధించిన వివరాలను కూడా ప్రవాగ్ వెల్లడించాల్సి ఉంది.