mahindra ev SUV launch: ఎం అండ్​ ఎం నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలు..!-mahindra unveils five electric suvs to fast track ev shift ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mahindra Unveils Five Electric Suvs To Fast Track Ev Shift

mahindra ev SUV launch: ఎం అండ్​ ఎం నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలు..!

Sharath Chitturi HT Telugu
Aug 15, 2022 07:58 PM IST

Mahindra new electric car launch : ఎలక్ట్రిక్​ వాహనాల మార్కెట్​లోకి మహీంద్రా అండ్​ మహీంద్రా గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చింది! కొత్తగా ఐదు ఎలక్ట్రిక్​ కార్లను లాంచ్​ చేసింది.

ఎం అండ్​ ఎం నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలు..!
ఎం అండ్​ ఎం నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలు..! (Youtube)

Mahindra new electric car launch : ఎస్​యూవీ సెగ్మెంట్​లో దూసుకెళుతున్న మహీంద్రా అండ్​ మహీంద్రా(ఎం అండ్​ ఎం).. ఆ విభాగంలో మరో అడుగు ముందుకేసింది. ఒకేసారి.. ఐదు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలను ఆవిష్కరించింది.

ట్రెండింగ్ వార్తలు

ఎస్​యూవీ సెగ్మెంట్​లో బలంగానే ఉన్నప్పటికీ.. ఎలక్ట్రిక్​ వాహనాల పోటీలో మహీంద్రా అండ్​ మహీంద్రా కాస్త వెనకపడింది. మార్కెట్​లో.. ఆ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్​ కారు(ఈ వెరిటో) ఒక్కటే ఉంది. ఇక తాజాగా ఈ ఐదు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలతో ఇందులోనూ తన మార్కెట్​ను పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోమవారం విడుదల చేసింది.

mahindra ev SUV launch: ఏ బ్రాండ్ల కింద?

కొత్త ఎస్​యూవీలను ఎక్స్​యూవీ- బీఈ అనే రెండు బ్రాండ్ల కింద అమ్మేందుకు ప్రణాళికలు​ రచిస్తోంది మహీంద్రా అండ్​ మహీంద్రా.

ప్రస్తుతం ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ది పైచేయి. కాగా.. టాటా మోటార్స్​ని ఢీకొట్టే విధంగా ప్రణాళికలు వేసింది మహీంద్రా అండ్​ మహీంద్రా. ఇందులో భాగంగా.. కొత్త ఎస్​యూవీలు.. 2024 చివరి నాటికి మార్కెట్​లోకి తీసుకురావాలని చూస్తోంది.

వాస్తవానికి ఇతర దేశాలతో పోల్చుకుంటే.. ఇండియాలో ఈవీ సెగ్మెంట్​ అంత మెరుగ్గా లేదు. కానీ ఒక్కసారి క్లిక్​ అయితే.. విప్లవాత్మక మార్పులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల.. అనేక వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​వైపు అడుగులు వేస్తున్నాయి.

ఓలా కూడా..

ప్రముఖ టూవీలర్​, ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ ఓలా సైతం.. ఎలక్ట్రిక్​ కారు రంగంలోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించి.. ఎలక్ట్రిక్​ కారును సోమవారం ఆవిష్కరించింది. 2024 మధ్యలో ఎలక్ట్రిక్​ వాహనాన్ని మార్కెట్​లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఓలా.

ఓలా ఎలక్ట్రిక్​ కారుకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం