తెలుగు న్యూస్  /  Business  /  Ludo King And Subway Surfers Among Global List Of Most Data-hungry Mobile Gaming Apps

Most data hungry mobile: మీ డేటా ప్రైవసీని దొంగిలించే డేంజరస్ గేమింగ్ యాప్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu

30 May 2023, 15:14 IST

    • చిన్న, పెద్ద తేడా లేకుండా మొబైల్స్ లో గేమ్స్ ఆడుతుంటాము. కానీ, మనకి తెలియకుండా మన ఫోన్లోని మన పర్సనల్ డేటాను తస్కరించే డేంజరస్ గేమింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్, క్యాండీ క్రష్ సాగా, క్యారమ్ పూల్ డిస్క్ మొదలైనవి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొబైల్ గేమింగ్ యాప్స్ లో.. వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఎక్కువగా సేకరించే యాప్స్ గురించి వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్ సర్ఫ్ షార్క్ (SurfShark) సంస్థ ఒక అధ్యయనం చేసింది. ఆ అధ్యయనం ప్రకారం.. కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ (Call of Duty Mobile), క్యాండీ క్రష్ సాగా(Candy Crush Saga), క్యారమ్ పూల్ డిస్క్ గేమ్ (Carrom Pool Disc Game).. గేమింగ్ యాప్స్ వినియోగదారుల డేటాను ఎక్కువగా తీసుకుంటున్నాయి. ఫోన్ లోని మొత్తం 32 డేటా పాయింట్లలో నుంచి ఈ యాప్స్ గరిష్టంగా 17 పాయింట్స్ నుంచి డేటా ను తీసుకుంటున్నాయి. ఆ డేటా పాయింట్స్ లో కాంటాక్ట్స్, లొకేషన్, ఫొటోస్, వీడియోస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్.. మొదలైనవి ఉన్నాయి.

మొత్తం 50 గేమింగ్ యాప్స్..

దాదాపు 60 దేశాల్లో పాపులర్ అయిన మొత్తం 50 గేమింగ్ యాప్స్ ను ఈ సర్ఫ్ షార్క్ (SurfShark) సంస్థ పరిశీలించింది. ఒక్కో యాప్ డేటా కలెక్షన్ తీరును క్షుణ్నంగా పరీక్షించి, ఆ మేరకు పాయింట్లను కేటాయించింది. అన్ని గేమింగ్ యాప్స్ లో భారత్ లో చాలా పాపులర్ అయిన ‘సబ్ వే సర్ఫర్స్ (Subway Surfers)’ అత్యధికంగా డేటాను సేకరిస్తున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. అంతర్జాతీయంగా 6 వ మోస్ట్ పాపులర్ గేమింగ్ యాప్ అయిన ‘సబ్ వే సర్ఫర్స్ (Subway Surfers)’ ఈ సర్ఫ్ షార్క్ (SurfShark) ‘డేటా హంగర్ ఇండెక్స్’ లో 57.6 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. ఫోన్ లోని మొత్తం 12 డేటా పాయింట్ల నుంచి ఈ యాప్ సమాచారాన్ని సేకరిస్తోంది. అలాగే, డేటా ప్రైవసీకి సంబంధించి అత్యంత ప్రమాదకర గేమింగ్ యాప్స్ లో లుడో కింగ్ (Ludo King), కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్, క్యాండీ క్రష్ సాగా, క్యారమ్ పూల్ డిస్క్ తొలి స్థానాల్లో ఉన్నాయి. అందువల్ల యూజర్లు యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే సమయంలోనే ఆయా యాప్స్ అడుగుతున్న పర్మిషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ డేటా ను ఎక్కువగా సేకరించే యాప్స్ లో అత్యధికం ఫ్రాన్స్, అమెరికాల్లో రూపొందుతున్నాయట.