తెలుగు న్యూస్  /  బిజినెస్  /  5g Support On Iphones: ఐఫోన్ యూజర్లకు గుడ్‍న్యూస్.. 5జీ సపోర్ట్ వచ్చేసింది.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే!

5G Support on iPhones: ఐఫోన్ యూజర్లకు గుడ్‍న్యూస్.. 5జీ సపోర్ట్ వచ్చేసింది.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే!

14 December 2022, 7:35 IST

    • 5G Support on iPhones: భారత్‍లో యాపిల్ ఐఫోన్‍లకు 5జీ సపోర్ట్ వచ్చేసింది. 5జీని ఎనేబుల్ చేసే అధికారిక అప్‍డేట్‍ను యాపిల్ విడుదల చేసింది.
5G Support on iPhones: ఐఫోన్ యూజర్లకు గుడ్‍న్యూస్.. 5జీ సపోర్ట్ వచ్చేసింది (Photo: Unsplash)
5G Support on iPhones: ఐఫోన్ యూజర్లకు గుడ్‍న్యూస్.. 5జీ సపోర్ట్ వచ్చేసింది (Photo: Unsplash)

5G Support on iPhones: ఐఫోన్ యూజర్లకు గుడ్‍న్యూస్.. 5జీ సపోర్ట్ వచ్చేసింది (Photo: Unsplash)

5G Support on Apple iPhones: యాపిల్ ఐఫోన్ యూజర్ల నిరీక్షణ ముగిసింది. ఇండియాలో ఐఫోన్‍లకు 5జీ సపోర్ట్ వచ్చేసింది. 5జీ ఎనేబుల్ చేసిన ఐఓఎస్ 16.2 (iOS 16.2) అప్‍డేట్‍ను యాపిల్ అధికారికంగా విడుదల చేసింది. దీంతో దేశంలో జియో, ఎయిర్‌టెల్ 5జీ నెట్‍వర్క్ కవరేజ్ అందుబాటులో ఉన్న నగరాల్లోని ఐఫోన్ యూజర్లు.. ఇక 5జీని వాడుకోవచ్చు. 2020 ఆ తర్వాత వచ్చిన అన్ని ఐఫోన్ మోడళ్లకు 5జీ సపోర్టును యాపిల్ అందిస్తోంది. 5జీ కోసం ఐఫోన్ యూజర్లు సిమ్ మార్చాల్సిన అవసరం లేదు. 4జీ సిమ్ 5జీకి కూడా సపోర్ట్ చేస్తుంది. కాగా, ఏ ఐఫోన్ మోడల్స్ 5జీకి సపోర్ట్ చేస్తాయి.. వాటిలో 5జీని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

5జీ సపోర్ట్ చేసే ఐఫోన్ మోడల్స్ (5G Enabled Apple iPhones)

  • ఐఫోన్ 12
  • ఐఫోన్ 12 మినీ
  • ఐఫోన్ 12 ప్రో
  • ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్
  • ఐఫోన్ 13
  • ఐఫోన్ 13 మినీ
  • ఐఫోన్ 13 ప్రో
  • ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్
  • ఐఫోన్ 14
  • ఐఫోన్ 14 ప్లస్
  • ఐఫోన 14 ప్రో
  • ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్
  • ఐఫోన్ ఎస్ఈ మూడో జనరేషన్ (2022)

ఐఫోన్‍లో 5జీని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

5G Activation on Apple iPhones: ముందుగా 5జీని ఎనేబుల్ చేసేందుకు యాపిల్ ఇచ్చిన ఐఓఎస్ 16.2 అప్‍డేట్‍ (iOS 16.2 Update) ను ఐఫోన్‍లో చేసుకోవాలి. అందుకోసం ముందుగా ఐఫోన్‍లో సెట్టింగ్స్ (Settings) యాప్‍లోకి వెళ్లాలి. ఆ తర్వాత జనరల్ (General) ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అనంతరం సాఫ్ట్ వేర్ అప్‍డేట్‍ (Software Update) పై క్లిక్ చేస్తే ఐఓఎస్ 16.2 డౌన్‍లోడ్ చేసుకోవాలని కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి అప్‍డేట్ చేసుకోవాలి. అప్‍డేట్‍కు ముందే మొత్తం డేటాను బ్యాకప్ చేసుకుంటే మంచిది. అలాగే అప్‍డేట్ చేసే సమయంలో బ్యాటరీ లైఫ్ కనీసం 50శాతం ఉండేలా చూసుకోవాలి.

ఇక అప్‍డేట్ పూర్తయ్యాక ఇక మీ ఐఫోన్ 5జీ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీ ప్రాంతంలో 5జీ నెట్‍వర్క్ కవరేజ్ ఉన్నట్టయితే.. నోటిఫికేషన్ ఏరియాలో 5జీ స్టేటస్ చూపిస్తుంది. ఒకవేళ చూపించకపోతే.. సెట్టింగ్స్ లో సెల్యులార్ సెక్షన్‍లో సెల్యులార్ డేటా ఆప్షన్‍లోకి వెళ్లాలి. అక్కడ 5జీ ఆప్షన్‍ను ఎంపిక చేసుకోవచ్చు.

5G Network in India: ప్రస్తుతం దేశంలో హైదరాబాద్‍ సహా 13 నగరాల్లో రిలయన్స్ జియో 5జీ (Reliance Jio 5G) నెట్‍వర్క్ అందుబాటులో ఉంది. అలాగే గుజరాత్‍లోని 33 జిల్లా కేంద్రాల్లోనూ జియో 5జీ సర్వీస్ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‍తో పాటు 12 నగరాల్లో 5జీ సర్వీసులను ఎయిర్‌టెల్ అందిస్తోంది. క్రమంగా 5జీ నెట్‍వర్క్ ను జియో, ఎయిర్‌టెల్ విస్తరిస్తున్నాయి. 2023 చివరి కల్లా దేశమంతా 5జీ సర్వీస్‍లు విస్తరించాలని రెండు టెలికం సంస్థలు భావిస్తున్నాయి.