IDFC First Bank : ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఇప్పుడు కొనొచ్చా? టార్గెట్ రూ. 140?
31 July 2023, 12:41 IST
- IDFC First Bank shares : ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు.. గత ఆరు నెలల్లో 40శాతం కన్నా ఎక్కువ పెరిగాయి. మరి ఇప్పుడు కొనొచ్చా? నిపుణుల మాట ఇది..!
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఇప్పుడు కొనొచ్చా?
IDFC First Bank : ఎఫ్వై 24 క్యూ1 ఫలితాల తర్వాత ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు దూసుకెళుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నాటికి ఈ స్టాక్.. 2.3శాతం పెరిగి రూ. 85.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ షేర్లను ఇప్పుడు కొనాలా? ఉన్న షేర్లను అమ్మేయాలా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి.. నిపుణులు ఇచ్చిన సమాధానాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఇప్పుడు కొనొచ్చా.. వెయిట్ చేయాలా?
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్యూ1 ఫలితాలు.. మార్కెట్ అంచనాలకు మించి ఉండటంతోనే షేర్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సంస్థ ఎన్పీఏ (నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్), మార్జిన్లు మార్కెట్ అంచనాలను బీట్ చేశాయని స్పష్టం చేస్తున్నారు.
"ఈ ప్రైవేట్ బ్యాంక్ వ్యాపారం బాగా వృద్ధిచెందుతోంది. ఎన్పీఏ, మార్జిన్లు.. అనుకున్న దాని కన్నా మెరుగ్గా నమోదయ్యాయి. అందుకే స్టాక్ పెరుగుతోంది," అని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్‌కు చెందిన వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ జైన్ తెలిపారు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్యూ1 ఫలితాల పూర్తి డేటాను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పటికే సంస్థ స్టాక్స్ ఉన్న వారు వాటిని హోల్డ్ చేయాలని.. కొత్తగా కొనాలనుకునే వారు కాస్త వెయిట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
IDFC First Bank share price target : "ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. షార్ట్ టర్మ్‌లో రూ. 92- రూ.95ని తాకొచ్చు. పోర్ట్‌ఫోలియోలో ఈ స్టాక్ ఉన్న వారు హోల్డ్ చేయాలి," అని మోతీలాల్ ఓస్వాల్ టెక్నికల్ ఎనలిస్ట్ చందన్ తపారియా తెలిపారు.
"సంస్థ ఫలితాలు శక్తివంతంగా ఉన్నప్పటికీ.. కొత్త షేర్లు కొనే ముందు కాస్త వెయిట్ చేయడం ఉత్తమం. ఈ స్టాక్ ఈ ఏడాదిలో ఇప్పటికే 40శాతం పెరిగింది. కరెక్షన్ వచ్చిన తర్వాత ఎంట్రీ ఇవ్వడం బెటర్," అని ఎస్ఎంసీ గ్లోబల్‌కు చెందిన సౌరభ్ జైన్ అభిప్రాయపడ్డారు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ ప్రేజ్ టార్గెట్ ఎంత..?
"రూ. 70 వద్ద బలమైన సపోర్ట్ ఉంది. రూ. 95 వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. అందుకే రూ. 70-రూ. 75 వద్ద కొనుగోళ్లు చేయవచ్చు. రూ. 95 రెసిస్టెన్స్ బ్రేక్ అయితే.. ఈ స్టాక్ రూ. 105 లెవల్స్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది," అని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌కు చెందిన వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా స్పష్టం చేశారు. ఆయన ప్రకారం.. ఈ స్టాక్ మీడియం టర్మ్ టార్గెట్ రూ. 130, లాంగ్ టర్మ్ టార్గెట్ రూ. 140!
షేర్ ప్రైజ్ హిస్టరీ..
IDFC First Bank results Q1 2024 : ఇండియా స్టాక్ మార్కెట్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు గత ఐదు రోజుల్లో 3.3శాతం పెరిగాయి. గత నెల రోజుల్లో 9.5శాతం వృద్ధిచెందాయి. ఇక ఆరు నెలల్లో ఈ స్టాక్ ఏకంగా 49.5శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 42.27శాతం, మొత్తం మీద ఏడాది కాలంలో ఏకంగా 107.39శాతం మేర లాభాలను నమోదు చేసింది.