IDFC First Bank Q1 Results: 61 శాతం పెరిగిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నికర లాభాలు-idfc first bank q1 results net profit jumps 61 percent yoy to 765 crore rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Idfc First Bank Q1 Results: 61 శాతం పెరిగిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నికర లాభాలు

IDFC First Bank Q1 Results: 61 శాతం పెరిగిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నికర లాభాలు

HT Telugu Desk HT Telugu
Jul 29, 2023 06:22 PM IST

IDFC First Bank Q1 Results: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నికర లాభాల్లో 61% పెరుగుదల నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ శనివారం వెల్లడించింది. Q1FY24 లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 765 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (MINT_PRINT)

IDFC First Bank Q1 Results: 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ శనివారం వెల్లడించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నికర లాభాల్లో 61% పెరుగుదల నమోదైంది. Q1FY24 లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 765 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. Q1FY23 లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నికర లాభాలు రూ. 474 కోట్లు. అంటే సంవత్సర కాలంలో బ్యాంక్ నికర లాభాల్లో 61% వృద్ధి నమోదైంది.

వడ్డీ ఆదాయంలో 36% వృద్ధి

ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలో కూడా Q1FY23 తో పోలిస్తే Q1FY24 లో 36% వృద్ధి నమోదైంది. Q1FY23 లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 2,751 కోట్లు కాగా, Q1FY24 లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 3,745 కోట్లు. ఈ క్యూ 1 లో బ్యాంక్ ఆపరేటింగ్ ఆదాయం 45% పెరిగి, రూ. 1427 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (Q1FY23) లో బ్యాంక్ ఆపరేటింగ్ ఆదాయం రూ. 987 కోట్లుగా ఉంది. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ 6.3 శాతానికి పెరిగింది.

తగ్గిన ఎన్పీఏలు

స్థూల నిరర్ధక ఆస్తుల (GNPA) విలువ కూడా Q1FY24 లో 2.17 శాతానికి తగ్గింది. Q1FY23 బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తుల (GNPA) విలువ 3.36% గా ఉంది. అర్బన్ రిటైల్ బిజినెస్ లో మంచి ఫలితాలను సాధించామని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వెల్లడించింది. భవిష్యత్తులో వినియోగదారులకు ఉపయోగపడే మరిన్ని బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ ను తీసుకువస్తామని తెలిపింది.

Whats_app_banner