IDFC First Bank merger : ఐడీఎఫ్సీ- ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ విలీనంపై లేటెస్ట్ అప్డేట్..
04 July 2023, 6:08 IST
- IDFC First Bank merger ratio : ఐడీఎఫ్సీ- ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ విలీనంపై ఓ అప్డేట్ వచ్చింది. ఐడీఎఫ్‌సీతో మర్జర్కు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఐడీఎఫ్సీ- ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ విలీనానికి ముహూర్తం ఫిక్స్!
IDFC First Bank merger ratio : ఐడీఎఫ్‌సీతో మర్జర్కు ఐడీఎఫ్సీ బ్యాంక్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. అమాల్గమేషన్ స్కీమ్ ద్వారా ఈ విలీనాన్ని పూర్తి చేయనుంది. ఇందుకు సంబంధించిన రేషియోను 155:100గా నిర్ణయించింది. ఈ మర్జర్ ప్రక్రియ.. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ప్రణాళికలు రచించింది ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్. ఈ మేరకు సోమవారం దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2023లో హెచ్డీఎఫ్సీ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మర్జర్ తర్వాత రెండో అతిపెద్ద ఒప్పందంగా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ విలీనం నిలువనుంది.
రేషియో వివరాలు..
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ బోర్డు ఆమోదించిన రేషియో ప్రకారం.. 100 ఐడీఎఫ్సీ షేర్లు ఉన్న వారికి.. 155 ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు లభిస్తాయి. ఫేస్ వాల్యూ రూ. 10గా ఉంటుంది.
IDFC IDFC First bank merger : "ఎలాంటి అవాంతరాలు లేకపోతే.. ఈ మర్జర్‌ను ఈ ఆర్థిక ఏడాదిలో పూర్తి చేయాలని భావిస్తున్నాము. ప్రతిపాదిత మర్జర్తో బ్యాంక్ బుక్ వాల్యూ 4.9శాతం పెరుగుతుంది," అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వెల్లడించింది.
ఇక ఇప్పుడు ఈ మర్జర్కు ఆర్బీఐ, సెబీ, సీసీఐ, ఎన్సీఎల్టీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈతో పాటు ఇతర రెగ్యులేటరీలు, షేర్‌హోల్డర్ల నుంచి ఆమోద ముద్ర లభించాల్సి ఉంది. వీటన్నింటికి కొంత సమయం పడుతుంది.
ఇదీ చూడండి:- HDFC merger : విలీనానికి వేళాయె.. నేడే హెచ్డీఎఫ్సీ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మర్జర్..!
"విలీన ప్రక్రియతో.. ఐడీఎఫ్సీ లిమిటెడ్ షేర్హోల్డర్లను ఆహ్వానిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మా బ్యాంక్ పునాదులు చాలా బలంగా తయారు చేశాము. కస్టమర్ ఫ్రెండ్లీ ప్రాడక్ట్స్ రూపొందిస్తున్నాము. కార్పొరేట్ గవర్నెన్స్ చాలా హైగా ఉంటుంది," అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈఓ వీ వైద్యనాథ్ తెలిపారు.
IDFC First Bank mrger with IDFC : ఈ ఐడీఎఫ్సీ- ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ విలీనం.. హెచ్డీఎఫ్సీ- హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో పోలి ఉంటుంది. అంటే.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్.. తన పేరెంట్ కంపెనీ అయిన ఐడీఎఫ్సీ హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీని తనలో మర్జ్ చేసుకుంటోంది. ఓ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకునేందుకు 2014లో ఐడీఎఫ్సీకి ఆర్బీఐ నుంచి అనుతులు లభించాయి. 2015లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఐడీఎఫ్సీ లోన్ అసెట్స్, అప్పులు.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌కు వెళ్లాయి. 2018 డిసెంబర్ 18న ఐడీఎఫ్సీ బ్యాంక్- క్యాపిటల్ ఫస్ట్లు విలీనమయ్యాయి.
షేర్ ప్రైజ్‌లు ఇలా..
సోమవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి ఐడీఎఫ్సీ షేరు రూ. 7 లాభంతో రూ. 109.90 వద్ద ముగిసింది. ఇక ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 2.9శాతం లాభంతో రూ. 81.70 వద్ద స్థిరపడింది.