HDFC merger : విలీనానికి వేళాయె.. నేడే హెచ్​డీఎఫ్​సీ- హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ మర్జర్​..!-hdfc bank hdfc merger today 1 july 2023 all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hdfc Merger : విలీనానికి వేళాయె.. నేడే హెచ్​డీఎఫ్​సీ- హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ మర్జర్​..!

HDFC merger : విలీనానికి వేళాయె.. నేడే హెచ్​డీఎఫ్​సీ- హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ మర్జర్​..!

Sharath Chitturi HT Telugu
Jul 01, 2023 06:28 AM IST

HDFC merger today : హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ విలీనం నేడు జరగనుంది. ఫలితంగా.. 44ఏళ్ల చరిత్ర కలిగిన హెచ్​డీఎఫ్​సీ సంస్థ కనుమరుగైపోనుంది.

నేడే హెచ్​డీఎఫ్​సీ- హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ మర్జర్​..!
నేడే హెచ్​డీఎఫ్​సీ- హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ మర్జర్​..! (MINT_PRINT)

HDFC HDFC bank merger today : దేశ చరిత్రలోనే అతి పెద్ద 'మర్జర్​'కు సమయం ఆసన్నమైంది. హౌజింగ్​ ఫైనాన్స్​ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ.. తన సబ్సిడీ అయిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో నేడు (శనివారం) విలీనం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఇరు కంపెనీల బోర్డులు శుక్రవారం ఆమోదించడంతో.. అతిపెద్ద మర్జర్​కు లైన్​ క్లియర్​ అయ్యింది.

దేశంలోనే తొలి హోం ఫైనాన్స్​ సంస్థ..

హెచ్​డీఎఫ్​సీ- హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ విలీనంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ రివర్స్​ మర్జర్​తో.. 44ఏళ్ల చరిత్ర కలిగిన హెచ్​డీఎఫ్​సీ.. 2023 జులై 1 నుంచి కనుమరుగైపోతుంది. దేశంలోనే తొలి హోం ఫైనాన్స్​ కంపెనీగా గుర్తింపు పొందిన హెచ్​డీఎఫ్​సీ.. ఇక కనిపించదు.

హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ సంస్థలు స్టాక్​ మార్కెట్​లో లిస్ట్​ అయిన విషయం తెలసిందే. కాగా.. ఈ మర్జర్​ తర్వాత హెచ్​డీఎఫ్​సీ షేర్లు స్టాక్​ మార్కెట్​లో కనిపించవు. ఇందుకోసం జులై 13ను రికార్డ్​ డేట్​గా నిర్ణయించాయి రెండు కంపెనీల బోర్డులు. ఆ తర్వాత హెచ్​డీఎఫ్​సీ షేర్​హోల్డర్లకు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లను కేటాయిస్తారు. 42 హెచ్​డీఎఫ్​సీ షేర్లున్న వారికి.. 25 హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు లభిస్తాయి. అదే సమయంలో హెచ్​డీఎఫ్​సీ వారెంట్లను కూడా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ వారెంట్లుగా విక్రయించేందుకు జులై 13ని డేట్​గా నిర్ణయించారు.

HDFC merger latest news : నాన్​- కన్వర్టెబుల్​ డిబెంచర్స్​ బదిలీకి జులై 12, హెచ్​డీఎఫ్​సీ కమర్షియల్​ పేపర్స్​ను హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ పేరుకు బదిలీ చేసేందుకు జులై 7న డేట్​ను ఫిక్స్​ చేశారు అధికారులు.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ పేరెంట్​ కంపెనీ హెచ్​డీఎఫ్​సీ. కాగా పేరెంట్​ కంపెనీని తనలో విలీనం చేసుకోవాలని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ బోర్డు గతేడాది ఏప్రిల్​లో నిర్ణయించింది. అప్పటి నుంచి వివిధ అనుమతులు పొందుతూ.. చివరికి ఈ రెండు సంస్థలు నేడు విలీనం కాబోతున్నాయి.

2023 మార్చ్​ చివరి నాటికి.. హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ వ్యాపార విలువ రూ. 41లక్షల కోట్లుగా ఉంది. ఇక మర్జర్​ తర్వాత ఏర్పడే కంపెనీ నెట్​ వర్త్​ రూ. 4.14లక్షల కోట్లుగా ఉండనుంది. ఇక లాభాల విషయానికొస్తే.. మార్చ్​ 30 నాటికి అది రూ. 60వేల కోట్లుగా ఉంది.

మరోవైపు విలీనం అనంతరం హెచ్​డీఎఫ్​సీలోని ఉద్యోగులందరు.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ఉద్యోగులుగా మారిపోతారు.

దీపక్​ పరేఖ్​ రాజీనామా..

HDFC merger with HDFC bank : హెచ్​డీఎఫ్​సీ- హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ విలీనానికి ఒక రోజు ముందు.. అంటే జూన్​ 30న హెచ్​డీఎఫ్​సీ ఛైర్మన్​ పదవి నుంచి తప్పుకున్నారు దీపక్​ పరేఖ్​. తన రాజీనామా విషయాన్ని ఈ వ్యాపార దిగ్గజం ముందే ప్రకటించారు. హెచ్​డీఎఫ్​సీతో తనకు ఉన్న 46ఏళ్ల అనుబంధానికి శనివారంతో ముగింపు పలికారు.

"నా బాధ్యతలను వేరొకరికి అప్పగించాల్సిన సమయం వచ్చింది. ఇక భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవడమే నేను చేసేది. హెచ్​డీఎఫ్​సీ షేర్​హల్డర్లతో నేను మాట్లాడటం ఇదే చివరిసారి. కానీ హెచ్​డీఎఫ్​సీ భవిష్యత్తు అద్భుతంగా ఉండనుంది. మన చరిత్రను ఎవరు తుడిచేయలేరు. మన లేగేసీ ముందుకెళుతూనే ఉంటుంది," అని దీపక్​ అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం