Bank holidays in July : జులైలో బ్యాంక్​లకు సగం రోజులు సెలవులే! పూర్తి లిస్ట్​ ఇదిగో..-bank holidays in india july 2023 in telugu important dates to note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holidays In July : జులైలో బ్యాంక్​లకు సగం రోజులు సెలవులే! పూర్తి లిస్ట్​ ఇదిగో..

Bank holidays in July : జులైలో బ్యాంక్​లకు సగం రోజులు సెలవులే! పూర్తి లిస్ట్​ ఇదిగో..

Sharath Chitturi HT Telugu
Jun 30, 2023 09:47 AM IST

Indian Bank holidays in July : జులైలో బ్యాంక్​లకు 15 రోజుల పాటు సెలవులు ఉండనున్నయి. ఆర్​బీఐ విడదుల చేసిన లిస్ట్​ను ఇక్కడ చూడండి.

ఇండియా బ్యాంక్​ హాలీడే లిస్ట్​..
ఇండియా బ్యాంక్​ హాలీడే లిస్ట్​.. (MINT_PRINT)

Bank holidays in July 2023 : జులైలో బ్యాంక్​లకు 15 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. వీటిల్లో ఆది, రెండు- నాలుగు శనివారాలు కూడా ఉన్నాయి. వచ్చే నెలకు సంబంధించిన బ్యాంక్​ హాలీడే లిస్ట్​ను ఆర్​బీఐ ఇటీవలే విడుదల చేసింది. 15లో 8 సెలవులు నెగోషియెబుల్​ ఇన్​స్ట్రుమెంట్​ యాక్ట్స్​ కింద ఉన్నాయి. మిగిలినవి వీకెండ్​ సెలవులు కావడం గమనార్హం. కాగా.. ప్రతి నెల మొదటి, మూడోవ శనివారం బ్యాంక్​లకు సెలవు ఉండదు అన్న విషయం తెలిసిందే.

yearly horoscope entry point

వచ్చే నెలలో ఉన్న సెలవుల్లో కొన్ని రాష్ట్రాల ఆధారంగా ఉన్నాయి. నేషనల్​ హాలీడేలో మాత్రం దేశవ్యాప్తంగా బ్యాంక్​లు మూతపడే ఉంటాయి.

జులైలో బ్యాంక్​ సెలవుల వివరాలు..

జులై 2 2023:- ఆదివారం

జులై 5 2023:- గురు హర్గోబింద్​ సింగ్​ జయంతి. జమ్ము- శ్రీనగర్​లోని బ్యాంక్​లకు సెలవు.

జులై 6 2023:- ఎంహెచ్​ఐపీ డే. మిజోరంలోని బ్యాంక్​లకు సెలవు.

జులై 8 2023:- రెండో శనివారం.

జులై 9 2023:- ఆదివారం

జులై 11 2023:- కేర్​ పూజ. త్రిపురలోని బ్యాంక్​లకు హాలీడే.

జులై 13 2023:- భాను జయంతి. సిక్కింలోని బ్యాంక్​లకు సెలవు.

జులై 16 2023:- ఆదివారం.

ఇదీ చూడండి:- 2023లో బ్యాంక్​ సెలవుల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

జులై 17 2023:- యూ టిరోట్​ సింగ్​ డే. మేఘాలయలోని బ్యాంక్​లకు హాలీడే.

జులై 21 2023:- ద్రుప్కా టెషి-జి, గ్యాంగ్​టక్​లోని బ్యాంక్​లకు సెలవు.

జులై 22 2023:- నాలుగో శనివారం.

జులై 23 2023:- ఆదివారం.

జులై 29 2023:- మొహర్రం. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంక్​లకు సెలవు.

జులై 30 2023:- ఆదివారం

జులై 31 2023:- మార్టీడం డే. హరియాణా, పంజాబ్​లోని బ్యాంక్​లకు సెలవు.

ఇవి పనిచేస్తాయి..

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.

బ్యాంక్​ పనుల కోసం వెళ్లేవారు.. సెలవుల లిస్ట్​ను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత తమ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడతారు.

ఆగస్ట్​లో బ్యాంక్​ సెలవులివే..!

ఆగస్ట్​ 15:- మంగళవారం, స్వాతంత్ర్య దినోత్సవం. దేశవ్యాప్తంగా బ్యాంక్​లకు సెలవు.

ఆగస్ట్​ 16:- బుధవారం, పార్సీ న్యూ ఇయర్​

Bank Holidays 2023 Hyderabad : ఆగస్ట్​ 31:- గురువారం, రక్షా బంధన్​. దేశవ్యాప్తంగా బ్యాంక్​లకు సెలవు.

వీటితో పాటు వీకెండ్​ సెలవులు కూడా ఉండనున్నాయి.

మరోవైపు బ్యాంక్​లకు జూన్​ నెలలో 12 రోజుల పాటు సెలవు లభించింది.

Whats_app_banner

సంబంధిత కథనం