Car loan interest rate : తక్కువ వడ్డీకి కారు లోన్​ తీసుకోవాలా? ఈ బ్యాంక్​లు ఇస్తాయి..!-list of banks that offer car loans with less interest rate compare full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Car Loan Interest Rate : తక్కువ వడ్డీకి కారు లోన్​ తీసుకోవాలా? ఈ బ్యాంక్​లు ఇస్తాయి..!

Car loan interest rate : తక్కువ వడ్డీకి కారు లోన్​ తీసుకోవాలా? ఈ బ్యాంక్​లు ఇస్తాయి..!

Sharath Chitturi HT Telugu
Jun 24, 2023 12:06 PM IST

Car loan interest date : కొత్తగా కారు తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. తక్కువ వడ్డీకి కార్​ లోన్​లు ఇస్తున్న బ్యాంక్​ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

తక్కువ వడ్డీకి కారు లోన్​ తీసుకోవాలా? ఈ బ్యాంక్​లు ఇస్తాయి..!
తక్కువ వడ్డీకి కారు లోన్​ తీసుకోవాలా? ఈ బ్యాంక్​లు ఇస్తాయి..! (REUTERS)

Car loan interest date : కారు కొనాలన్నది మధ్య తరగతి ప్రజల కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు చాలా ప్లాన్ చేస్తారు. కొంత సేవ్​ చేసి, ఇంకొంత లోన్​ తీసుకుని మంచి కారు కొనాలని చూస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగానే పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఉన్న వాటిల్లో తక్కువ వడ్డీకి కారు లోన్​ ఇస్తున్న బ్యాంక్​ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.

yearly horoscope entry point

ఎస్​బీఐ కార్​ లోన్​..

8.60శాతం- 14.75శాతం వడ్డీ రేటుతో ఎస్​బీఐ కార్​ లోన్ పొందవచ్చు. 8ఏళ్ల టెన్యూర్​ ఉంటుంది. అడ్వాన్స్​ ఈఎంఐ చెల్లించాల్సిన పని లేదు.

కొత్త కారు అయితే లోన్​ అమౌంట్​లో 0.25శాతం ప్లస్​ జీఎస్​టీ పడుతుంది. అంటే కనిష్ఠంగా రూ. 750, గరిష్ఠంగా రూ. 7,500 (జీఎస్​టీ మినహాయించి) వరకు ప్రాసెసింగ్​ ఫీజ్​ పడుతుంది. కారు ఆన్​ రోడ్​ ప్రైజ్​ మొత్తానికి లోన్​ పొందవచ్చు.

యాక్సిస్​ బ్యాంక్​ కార్​ లోన్​..

ప్రైవేట్​ బ్యాంకింగ్​ దిగ్గజం యాక్సిస్​ బ్యాంక్​లో 8.55శాతం నుంచి 13.05శాతం వడ్డీ రేట్లతో కారు లోన్​ పొందవచ్చు. 100శాతం వరకు ఆన్​ రోడ్​ ప్రైజ్​కు సమానమైన లోన్​ అమౌంట్​ తీసుకోవచ్చు. గరిష్ఠ టెన్యూర్​ 7ఏళ్లు.

ఇదీ చూడండి:- How to check CIBIL score : సిబిల్​ స్కోర్​ చెక్​ చేసుకోవాలా? ఇలా చేయండి..

కొత్త కారుకు లోన్​ తీసుకుంటుంటే ప్రాసెసింగ్​ ఫీజు.. ​రూ. 3,500 నుంచి రూ. 5,500 వరకు పడుతుంది. కాగా సంబంధిత వ్యక్తి వార్షిక ఆదాయం రూ. 2.4లక్షల కన్నా ఎక్కువ ఉంటేనే ఈ లోన్​ లభిస్తుంది. ఫార్మ్​ 16, పే స్లిప్​ ఆధారంగా లోన్​ను మంజూరు చేస్తారు.

బ్యాంక్​ ఆఫ్​ బరోడా కార్​ లోన్​..

బ్యాంక్​ ఆఫ్​ బరోడా కారు లోన్​ వడ్డీ రేట్లు 8.85శాతం నుంచి మొదలవుతాయి. టెన్యూర్​ 7ఏళ్లు ఉంటుంది. ప్రాసెసింగ్​ ఫీజు వంటివి ఏమీ ఉండవు. ప్రీ క్లోజింగ్​ ఛార్జెస్​లు కూడా ఉండవు.

ఆన్​ రోడ్​ ప్రైజ్​లో 90శాతం వరకు లోన్​ పొందవచ్చు. గరిష్ఠంగా రూ. 1కోటి వరకు లోన్​ తీసుకోవచ్చు. ప్రాసెసింగ్​ టైమ్​ తక్కువగా ఉంటుంది. తక్కువ డౌన్​పేమెంట్​తో కారు లోన్​ పొందవచ్చు.

కెనరా బ్యాంక్​ కార్​ లోన్​..

కెనరా బ్యాంక్ కారు లోన్​లపై 8.80శాతం నుంచి 11.95శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. తక్కువ ప్రాసెసింగ్​ ఛార్జీలతో లోన్​ పొందవచ్చు. కారు మోడల్​, తయారీ సంస్థ వంటివి ఏమీ చూడకుండా.. వాహనం ఏదైనా లోన్​ పొందవచ్చు. టెన్యూర్​ గరిష్ఠంగా 84 నెలల పాటు ఉంటుంది.

లోన్​ ఆమౌంట్​లో 0.25శాతం ప్రాసెసింగ్​ ఫీజు పడుతుంది. అంటే కనిష్ఠంగా రూ. 1000, గరిష్ఠంగా రూ. 5వేల వరకు ఈ ఛార్జీలు ఉంటాయి. తీసుకునే కారు బట్టి.. ఆన్​ రోడ్​ ప్రైజ్​లోని 80శాతం, 85శాతం, 90శాతం వరకు లోన్​ అమౌంట్​ పొందవచ్చు.

ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సిబిల్​ స్కోర్​ అన్నది ఎంత మెరుగ్గా ఉంటే.. అంత సులభంగా, తక్కువ వడ్డీకి లోన్​లు లభిస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం