Bank holidays in July : జులైలో బ్యాంక్​లకు 14 రోజుల పాటు సెలవులు!-list of bank holidays in july 2023 check full list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holidays In July : జులైలో బ్యాంక్​లకు 14 రోజుల పాటు సెలవులు!

Bank holidays in July : జులైలో బ్యాంక్​లకు 14 రోజుల పాటు సెలవులు!

Sharath Chitturi HT Telugu
Jun 23, 2023 10:36 AM IST

Bank holidays in July : జులైలో బ్యాంక్​ సెలవులకు సంబంధించిన లిస్ట్​ను ఆర్​బీఐ విడుదల చేసింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

జులై బ్యాంక్​ సెలవుల లిస్ట్​ ఇదే..
జులై బ్యాంక్​ సెలవుల లిస్ట్​ ఇదే..

Bank holidays in July : జూన్​ నెల ముగింపు దశకు చేరుకుంటోంది. బ్యాంక్​లకు జూన్​ నెలలో 12 రోజుల పాటు సెలవు లభించింది. ఇక జులైలో ఏకంగా 14 రోజుల పాటు సెలవు తీసుకోనున్నాయి! జులై​కు సంబంధించిన సెలవుల లిస్ట్​ను ఆర్​బీఐ ఇటీవలే విడుదల చేసింది. బ్యాంకు పనుల కోసం వెళ్లే వారు.. సెలవుల లిస్ట్​ను చూసుకోవడం ఎంతో ముఖ్యం. సెలవుల బట్టి మీ పనిని ప్లాన్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జులైలో బ్యాంక్​ సెలవుల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

బ్యాంక్​ హాలీడే లిస్ట్​- జులై 2023..

జులై 4 2023:- ఆదివారం

జులై 5 2023:- గురు హర్గోబింద్​ సింగ్​ జయంతి. జమ్ము- శ్రీనగర్​లోని బ్యాంక్​లకు సెలవు.

జులై 6 2023:- ఎంహెచ్​ఐపీ డే. మిజోరంలోని బ్యాంక్​లకు సెలవు.

జులై 8 2023:- రెండో శనివారం.

జులై 9 2023:- ఆదివారం

జులై 11 2023:- కేర్​ పూజ. త్రిపురలోని బ్యాంక్​లకు హాలీడే.

జులై 13 2023:- భాను జయంతి. సిక్కింలోని బ్యాంక్​లకు సెలవు.

జులై 16 2023:- ఆదివారం.

ఇదీ చూడండి:- 2023లో బ్యాంక్​ సెలవుల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

జులై 17 2023:- యూ టిరోట్​ సింగ్​ డే. మేఘాలయలోని బ్యాంక్​లకు హాలీడే.

జులై 22 2023:- నాలుగో శనివారం.

జులై 23 2023:- ఆదివారం.

జులై 29 2023:- మొహర్రం. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంక్​లకు సెలవు.

జులై 30 2023:- ఆదివారం

జులై 31 2023:- మార్టీడం డే. హరియాణా, పంజాబ్​లోని బ్యాంక్​లకు సెలవు.

ముఖ్య గమనిక..

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.

Whats_app_banner

సంబంధిత కథనం