SBI Recruitment 2023 : ఎస్బీఐలో మళ్లీ రిక్రూట్మెంట్.. నోటిఫికేషన్ వివరాలివే!
SBI Recruitment 2023 : ఎస్సీఓ రిక్రూట్మెంట్కు మరోమారు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఎస్బీఐ. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

SBI Recruitment 2023 : ఎస్సీఓ (స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్) పోస్టుల భర్తీకి మరోమారు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఎస్బీఐ. అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in లో అప్లికేషన్లు వేయవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 1న మొదలైంది. జూన్ 21 వరకు ప్రక్రియ కొనసాగనుంది. ఈ దఫా రిక్రూట్మెంట్లో 28 పోస్టులను భర్తీ చేయనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్ 2023..
వేకెన్సీ వివరాలు:-
వైస్ ప్రెసిడెంట్ (ట్రాన్స్ఫార్మేషన్)- 1 పోస్టు
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- ప్రోగ్రామ్ మేనేజర్- 4 పోస్టులు
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- క్వాలిటీ అండ్ ట్రైనింగ్ (ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్)- 1 పోస్టు
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- కమాండ్ సెంటర్ - 3 పోస్టులు
SBI SCO Recruitment 2023 : సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (మార్కెటింగ్)- 1 పోస్టు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)/ చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్)- 18 పోస్టులు
ఎలిజబులిటీ:-
వివిధ పోస్టులకు అప్లే చేస్తున్న వారు.. ఎస్బీఐ విడుదల చేసిన రెండు నోటిఫికేషన్స్‌ను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సెలక్షన్ ప్రక్రియ:-
అసిస్టెంట్ జనరల్ మేనేజర్/ చీఫ్ జనరల్ మేనేజర్- షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ.
కాంట్రాక్ట్ పోస్టులు- షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్.
ఇతర పోస్టులు- షార్ట్ లిసటింగ్, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్.
అప్లికేషన్ ఫీజు..
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థుల ఫీజు రూ. 750.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఉచితం.
రేపే చివరి తేదీ..
SBI Recruitment 2023 apply online : పలు ఎస్సీఓ పోస్టుల భర్తీకి గత నెల 16న మొదలైన అప్లికేషన్ ప్రక్రియ.. సోమవారంతో ముగియనుంది. డేటా, టెక్, టెస్టింగ్‌తో పాటు ఇతర విభాగాల్లోని అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ వంటి పోస్టులను ఈ దఫా రిక్రూట్మెంట్లో భర్తీ చేయనుంది ఎస్బీఐ. అభ్యర్థులు తమ అప్లికేషన్లను bank.sbi/careers లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం