SBI Recruitment 2023 : ఎస్​బీఐలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​.. ఇలా అప్లై చేసుకోండి..-sbi recruitment 2023 eligibility vacancies and how to apply all you need to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sbi Recruitment 2023 : ఎస్​బీఐలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​.. ఇలా అప్లై చేసుకోండి..

SBI Recruitment 2023 : ఎస్​బీఐలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​.. ఇలా అప్లై చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
May 19, 2023 01:46 PM IST

SBI Recruitment 2023 : ఎస్​బీఐలో వివిధ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదలైంది. అప్లికేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

ఎస్​బీఐలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
ఎస్​బీఐలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

SBI Recruitment 2023 : స్పెషలిస్ట్​ క్యాడర్​ ఆఫీర్స్​కు చెందిన వివిధ రెగ్యూలర్​, కాంట్రాక్ట్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. డేటా, టెక్​, టెస్టింగ్​తో పాటు ఇతర విభాగాల్లోని అసిస్టెంట్​ జనరల్​ మేనేజర్​, చీఫ్​ మేనేజర్​, ప్రాజెక్ట్​ మేనేజర్​ వంటి పోస్టులను ఈ దఫా రిక్రూట్​మెంట్​లో భర్తీ చేయనుంది ఎస్​బీఐ. ఈ మేరకు అప్లికేషన్​ ప్రక్రియ ఈ నెల 16నే మొదలైపోయింది. జూన్​ 5తో అప్లికేషన్​ గడువు ముగుస్తుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లను bank.sbi/careers లో అప్లై చేసుకోవచ్చు.

ఎస్​బీఐ రిక్రూట్​మెంట్​ 2023..

SBI Recruitment 2023 apply online ఎలిజెబులిటీ:- ఈ దఫా ఎస్​బీఐ రిక్రూట్​మెంట్​కు అప్లే చేయాలని భావిస్తున్న వారు.. దేశంలో ఏదైనా అనుమతి పొందిన కళాశాల నుంచి డిగ్రీ పొంది ఉండాలి. 2022 నవంబర్​ 30కి ముందు పాసై ఉండాలి. ఫైనల్​ ఇయర్​లో ఉన్న వారు, మిలిటరీ సభ్యులు కూడా ఈ రిక్రూట్​మెంట్​కు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు పరిమితి:- అభ్యర్థుల కనిష్ఠ వయస్సు 20ఏళ్లు- గరిష్ఠ వయస్సు 28ఏళ్లుగా ఉండాలి.

  • వేకెన్సీ వివరాలు:- అసిస్టెంట్​ జనరల్​ మేనేజర్​ (సొల్యూషన్​ ఆర్కిటెక్ట్​ లీట్​)
  • SBI recruitment 2023 notification : చీఫ్​ మేనేజర్​ (పీఎంఓ- లీడ్​, టెక్​ ఆర్కిటెక్ట్​)
  • ప్రాజెక్ట్​ మేనేజర్​
  • మేనేజర్​ (టెక్​ ఆర్కిటెక్ట్​, డేటా ఆర్కిటెక్ట్​, డేవ్​సెక్​ఆప్స్​ ఇంజినీర్​, అబ్సర్వబులిటీ అండ్​ మానిటరింగ్​ స్పెషలిస్ట్​, ఇన్ఫ్రా/ క్లౌండ్​ స్పెషలిస్ట్​, ఇంటీగ్రేషన్​ లీడ్​, ఇంటీగ్రేషన్​ స్పెషలిస్ట్​, ఐటీ సెక్యూరిటీ ఎక్స్​పర్ట్​, ఎస్​ఐటీ టెస్ట్​ లీడ్​, పర్ఫార్మెన్స్​ టెస్ట్​ లీడ్​, ఎంఐఎస్​ అండ్​ రిపోర్టింగ్​ ఎనలిస్ట్​)
  • డిప్యూటీ మేనేజర్​ (ఆటోమేషన్​ టెస్ట్​ లీడ్​, టెస్టింగ్​ ఎనలిస్ట్​)

ఇదీ చూడండి:- Indian Navy recruitment 2023 : ఇండియన్​ నేవీలో వేకెన్సీలు- ఇలా అప్లై చేసుకోండి..

ఇలా అప్లై చేసుకోండి..

స్టెప్​ 1:- ఎస్​బీఐ ఆన్​లైన్​ పోర్ట్​లు వెళ్లి, లాగిన్​ అవ్వండి. 'కెరీర్స్​' ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

SBI recruitment 2023 last date to apply : స్టెప్​ 2:- కరెంట్​ ఓపెనింగ్స్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- అందుబాటులో ఉన్న వేకెన్సీలకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. సంబంధిత వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

స్టెప్​ 4:- అప్లికేషన్​ ప్రక్రియను పూర్తి చేసుకుని, ఫీజు చెల్లించండి.

సంబంధిత కథనం