Indian Navy recruitment 2023 : ఇండియన్​ నేవీలో వేకెన్సీలు- ఇలా అప్లై చేసుకోండి..-indian navy recruitment 2023 see how to apply for 372 vacancies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Indian Navy Recruitment 2023 See How To Apply For 372 Vacancies

Indian Navy recruitment 2023 : ఇండియన్​ నేవీలో వేకెన్సీలు- ఇలా అప్లై చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
May 16, 2023 01:42 PM IST

Indian Navy recruitment 2023 : 372 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది ఇండియన్​ నేవీ. మే 29తో అప్లికేషన్​ గడువు ముగియనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

నేవీలో వేకెన్సీలు.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
నేవీలో వేకెన్సీలు.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి (PTI)

Indian Navy recruitment 2023 : 372 వేకెన్సీల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది ఇండియన్​ నేవీ. ఛార్జ్​మెన్​-2 పోస్టుల కోసం అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు అప్లికేషన్​ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్​ను joinindiannavy.gov.in లో సబ్మీట్​ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్​లోని ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

ఇండియన్​ నేవీ రిక్రూట్​మెంట్​ 2023..

  • 372 ఛార్జ్​మెన్​-2 వేకెన్సీల భర్తీకి రిక్రూట్​మెంట్​ ప్రక్రియ జరుగుతోంది.
  • అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 18ఏళ్లు, గరిష్ఠంగా 25ఏళ్లు ఉండాలి.
  • Indian Navy recruitment 2023 apply online : సంబంధిత అభ్యర్థులు ఏదైనా రికగ్నైజ్డ్​ కాలేజీలో సైన్స్​(ఫిజిక్స్​/ కెమిస్ట్రీ/ మాథ్స్​)లో డిగ్రీ పొంది ఉండాలి.
  • ఎస్​సీ, ఎస్​టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్​ఎం అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • ఇతరులు రూ. 278ని అప్లికేషన్​ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా అప్లై చేసుకోండి..

స్టెప్​ 1:- joinindiannavy.gov.in వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోంపేజ్​లో 'జాయిన్​ నేవీ' ఆప్షన్​పై క్లిక్​ చేయండి. అనంతరం 'వేస్​ టు జాయిన్​' ఆప్షన్​పై క్లిక్​ చేయండి.

Indian Navy recruitment 2023 apply online date : స్టెప్​ 3:- సివీలియన్​ ఆప్షన్​లోని ఛార్జ్​మెన్​-2ని ఎంచుకోండి.

స్టెప్​ 4:- అప్లికేషన్​ ఫార్మ్​ను నింపండి.

స్టెప్​ 5:- సంబంధిత డాక్యుమెంట్స్​ను సబ్మీట్​ చేయండి.

Indian Navy recruitment 2023 last date : స్టెప్​ 6:- అప్లికేష్​ ఫీజు చెల్లించి.. అప్లికేషన్​ను సబ్మీట్​ చేయండి.

స్టెప్​ 7:- అప్లికేషన్​ను ప్రింటౌంట్​ తీసుకోండి.

ఐఓసీఎల్​ రిక్రూట్​మెంట్​ 2023 ..

IOCL recruitment 2023 apply online : ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి గుడ్​ న్యూస్​. 65 నాన్-​ ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది ఐఓసీఎల్​ (ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ లిమిటెడ్​). అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లికేషన్​ ప్రక్రియ తుది గడవు మే 30. అభ్యర్థులు తమ అప్లికేషన్​ను సంస్థ అధికారిక వెబ్​సైట్​ iocl.com లో సబ్మీట్​ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం