Ph D Admissions : తెలుగు వర్శిటీలో ఎంఫిల్, PhD ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల-pstu notification released for phd admissions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ph D Admissions : తెలుగు వర్శిటీలో ఎంఫిల్, Phd ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల

Ph D Admissions : తెలుగు వర్శిటీలో ఎంఫిల్, PhD ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 04, 2023 04:19 PM IST

Potti Sreeramulu Telugu University Updates: పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తెలుగు వర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

తెలుగు వర్శిటీలో ప్రవేశాలు
తెలుగు వర్శిటీలో ప్రవేశాలు

Potti Sreeramulu Telugu University Ph.D Admissions: 2023-24 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి ప్రవేశ నోటిఫికేషన్లు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే ఓయూ నిర్వహిస్తున్న పీజీసెట్ నోటిఫికేషన్ రాగా... తాజాగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ నుంచి కూడా ప్రకటన విడుదలైంది. పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, స‌ర్టిఫికెట్ కోర్సుల్లో ప్ర‌వేశాలతో పాటు ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ముఖ్య తేదీలతో పాటు ప్రవేశాల నిబంధనలను పేర్కొంది.

శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీసైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం కోర్సుల్లో ఎంఫిల్ తో పాటు పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనుంది. 2019 - 20, 2020 - 2021 విద్యాసంవత్సరానికి గాను సీట్లు కేటాయిస్తారు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా... జూన్ 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆల‌స్య రుసుముతో జూన్ 30వ తేదీ లోగా అప్లయ్ చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. మరిన్ని వివ‌రాల కోసం www.pstucet.org  వెబ్‌సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

TS CPGET 2023 Notification 2023: రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీగెట్‌-2023) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. మే 12వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ముఖ్య వివరాలు:

ఎంట్రెన్స్ పరీక్ష - కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్

నిర్వహించే వర్శిటీ - ఉస్మానియా వర్శిటీ

కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్లు - 12 -05 -2023.

దరఖాస్తులుకు చివరి తేదీ - 11 -06 -2023.

500 రూపాయల ఫైన్ తో దరఖాస్తు గడువు - 18 -06- 2023.

2000 రూపాయల ఫైన్ తో దరఖాస్తు గడువు -20 -06 -2023.

పరీక్షలు - జూన్ చివరి వారంలో జరిగే అవకాశం

పరీక్షల విధానం - కంప్యూటర్ ఆధారిత పరీక్షలు

అధికారిక వెబ్ సైట్లు - cpget.tsche.ac.in 

2023-24లో ప్రవేశాల కోసం సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగా… దాదాపు 300 కాలేజీల్లో అడ్మిషన్ల కోసం దాదాపు 45 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీపీగెట్‌ కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. జూన్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుం రూ.500తో జూన్ 18వ తేదీ వరకు రూ.2 వేల ఆలస్య రుసుంతో జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పరీక్షలు జూన్ ఆఖరి వారం నుంచే జరిగే అవకాశం ఉంది.

IPL_Entry_Point