Car accessories : వర్షాకాలంలో.. మీ కారులో ఈ యాక్ససరీస్ కచ్చితంగా ఉండాల్సిందే!
Car accessories for rainy season : వర్షాకాలం కోసం సన్నద్ధమవుతున్నారా? మీకే కాదు.. మీ కారుకు కూడా రక్షణ కావాలి కదా. అందుకే.. ఈ సీజన్లో కచ్చితంగా ఉండాల్సిన యాక్ససరీస్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
Car accessories for rainy season : వర్షాకాలంలో డ్రైవింగ్ అంటే ఒకింత కష్టమైన పనే. ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్.. డ్రైవర్లకు చాలా చిరాకు వస్తుంది. ఇక నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళను తాకేశాయి. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరగనుంది. ఈ నేపథ్యంలో మీకే కాదు.. మీ కారుకు కూడా రక్షణ అవసరమే. అందుకే.. వర్షాకాలంలో కారులో కచ్చితంగా ఉండాల్సిన యాక్ససరీస్‌ను ఇక్కడ తెలుసుకుందాము..
విండో విజర్..
వర్షాకాలంలో కారు విండోలు తీసి నడపడం చాలా కష్టం. వర్షం నీరు కారు కేబిన్‌లోకి పడితే.. ఇక అంతే! అలా అని ప్రతిసారి విండో మూసి, ఏసీ ఆన్ చేసుకుని కూర్చోవడం చాలా మందికి చిరాకును తెప్పిస్తుంది. అందుకే.. 'విండో విజర్'ని వాడాలి. వీటినే డోర్ విజర్స్ అని కూడా అంటారు. ఇవి విండోలపైన ఉంటాయి. వీటితో వర్షపు చినుకులు కారు కేబిన్ లోపలికి రాకుండా ఉంటాయి. ఫలితంగా చల్లటి వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేయవచ్చు.
ఫాగ్ ల్యాంప్స్..
Car accessories Hyderabad : వర్షాకాలంలో ఫాగ్‌తో డ్రైవర్లు తరచూ ఇబ్బంది పడుతుంటారు. తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే కారుకు ఫాగ్ ల్యాంప్స్ కచ్చితంగా ఉండాలి. ఇప్పుడొస్తున్న కార్లలో ఫాగ్ ల్యాప్స్ ప్రీ ఇస్టాల్డ్గానే ఉంటున్నాయి. కానీ పాత కార్లకు ఫాగ్ ల్యాంప్స్ రావడం లేదు. అందువల్ల.. ఫాగ్ ల్యాంప్స్‌ను కొనుగోలు చేసి, మెకానిక్‌తో ఫిట్ చేయించుకోవడం ఈ వర్షాకాలంలో చాలా అవసరం.
ఇదీ చూడండి:- How to take care of car in rainy season : వర్షాకాలం వచ్చేస్తోంది.. మీ కారు భద్రమేనా?
వైపర్ బ్లేడ్..
కారులో అతి తక్కువగా వాడే పరికరాల్లో వైపర్ బ్లేడ్ ఒకటి. వర్షాకాలం అయిపోతే.. వాటిని ఉపయోగించం. మరి ఇప్పుడు వర్షాకాలం తిరిగొస్తోంది. అందుకే.. వైపర్ బ్లేడ్ పనితీరును చెక్ చేసుకోవడం మంచిది. సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా బ్లేడ్స్‌ని రిప్లేస్ చేయాలా? అని చూసుకోవాలి. వేడి వల్ల వైపర్ బ్లేడ్స్ రబ్బర్‌పై ఎఫెక్ట్ పడుతుంది. వేర్ అండ్ టేర్‌కు గురైతే.. వైపర్ బ్లేడ్స్‌ను మార్చాల్సి ఉంటుంది.
కార్ బాడీ కవర్..
కార్ బాడీ కవర్ అన్నది ముఖ్యమైన యాక్ససరీస్‌లో ఒకటిగా మారింది. ముఖ్యంగా వానా కాలంలో దీనిని ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. క్లోజ్డ్ ప్రాంతంలో కారును పార్క్ చేసుకోలేకపోతే.. ఓపెన్ ప్లేస్‌లో పెడితే కారుకు కవర్ వేయాల్సి ఉంటుంది. దీని వల్ల వర్షంతో పాటు దుమ్ము, చెట్ల నుంచి రాలే ఆకులు వంటి వాటి నుంచి కూడా కారుకు రక్షణ లభిస్తుంది.
మడ్ఫ్లాప్..
Rainy season car accessories : ఇప్పుడు ప్రతి కారుకు మడ్‌ఫ్లాప్స్ వస్తున్నాయి. దీనిని మౌల్డెడ్ ప్లాస్టిక్‌తో రూపొందిస్తారు. ఫ్రెంట్ టైర్ల వెనక, రేర్ టైర్ల ముందు భాగంలో ఈ మడ్ఫ్లాప్ అనేది ఉంటుంది. మట్టి నుంచి కారు మెటల్ పార్ట్‌కు రక్షణ కల్పిస్తుంది ఈ మడ్ఫ్లాప్. టైర్ల కదలిక కారణంగా అటు, ఇటు పడే మట్టి, దుమ్ము, నీటిని ఈ మడ్ఫ్లాప్తో కారు మెటల్ బాడీకి తాకకుండా అడ్డుకోవచ్చు. మీ కారుకు మడ్ఫ్లాప్ లేకపోతే.. డీలర్షిప్ షోరూమ్‌కు వెళ్లి దానిని ఫిట్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం