India's first self driving car : ఇది దేశంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు..!
India's first self driving car : దేశంలోనే తొలి సెల్ఫ్ డ్రైవింగ్ కారును మైనస్ జీరో అనే స్టార్టప్ సంస్థ ఆవిష్కరించింది. ఈ కారు విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..
India's first self driving car : అమెరికాతో పాటు ఇతర దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోడ్ల మీద దూసుకెళుతున్నాయి. కానీ ఇండియాలో ఇప్పటికీ అది ఒక కలగానే ఉంది. ఇక ఇప్పుడు ఆ కలని నిజం చేస్తూ.. దేశంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఆవిష్కరించింది ఓ స్టార్టప్ సంస్థ. బెంగళూరుకు చెందిన ఆ సంస్థ పేరు మైనస్ జీరో. ఇక ఆ వాహనం పేరు 'జెడ్పాడ్'. మరి ఈ కారు విశేషాలు చూసేద్దామా..!
దేశంలో మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు..
ఈ జెడ్పాడ్ సైజు చిన్నగా ఉంది. అయితే ఈ వాహనం దేశంలో ఏ పరిస్థితుల్లోనైనా డ్రైవ్ చేయగలదని మైనస్ జీరో చెబుతోంది. ఇందులో స్టీరింగ్ వీల్ లేకపోవడం విశేషం! స్టీరింగ్ వీల్ బదులుగా ఇందులో అనేక హై- రిసొల్యూషన్ కెమెరాలు ఉంటాయి. ఇవి ట్రాఫిక్‌తో పాటు డ్రైవింగ్ కండీషన్లను ఎనలైజ్ చేస్తాయి. ఇదొక లెవల్ 5 అటానమీతో కూడుతున్న సెల్ఫ్ డ్రైవింగ్ కారు అని సంస్థ చెబుతోంది. లెవల్ 5 పొందితే.. అసలు మనుషుల ప్రమేయం లేకుండానే వాహనం సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుంది!
ఈ జెడ్పాడ్లోని కెమెరా సెన్సార్లు.. వాహనం పరిసరాలకు చెందిన రియల్ టైమ్ ఇమేజ్‌లను క్యాప్చర్ చేయగలవు. వాటిని కృత్రిమ మేథస్సు (ఏఐ) కలిగిన సిస్టెమ్కు చేరవేస్తాయి. ఈ ఏఐ.. ఆ ఫొటోలను ఎనలైజ్ చేసి.. వెహికిల్‌ని నావిగేట్ చేస్తుంది. అవసరమైనప్పుడు స్పీడ్ పెంచుతుంది, అడ్డంకులు వస్తే వాహనాన్ని ఆపుతుంది.
ఇదీ చదవండి:- Baojun Yep electric SUV : మరో బుడ్డి ఎలక్ట్రిక్ వాహనం వచ్చేస్తోంది!
లాంచ్ ఎప్పుడు..?
ఈ ఆటోనోమస్ కారు ప్రస్తుతానికి క్యాంపస్, పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్వంటి క్లోజ్డ్ ఏరియాల్లో ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని మైనస్ జీరో వెల్లడించింది. ఈ సంస్థను గుర్సిమ్రన్ కాల్రా.. 2021లో స్థాపించారు. టెస్లా, గూగుల్ రూపొందిస్తున్న ఫుల్లీ- ఆటోనోమస్ వాహనాలకు ధీటుగా ఇండియాలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తీసుకురావాలన్న లక్ష్యంతో సంస్థ కృషిచేస్తోందని ఆయన వివరించారు. తమ టెక్నాలజీని ఇతర కంపెనీలకు కూడా ఇస్తున్నామని, ఫలితంగా వారి వాహనాల్లో ఏడీఏఎస్ సేఫ్టీ ఫీచర్స్ పెరుగుతున్నాయని అన్నారు.
zPod self driving car : ఇండియా రోడ్లకు తగ్గట్టుగా ఆటోనోమస్ కార్లను రూపొందించేందుకు ఏఐ మీద ఆధారపడుతోంది ఈ మైనస్ జీరో. రానున్న రెండేళ్లల్లో విదేశాల్లోనూ తమ వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఇక ఇండియాలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ జెడ్పాడ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు.
సంబంధిత కథనం