How to take care of car in rainy season : వర్షాకాలం వచ్చేస్తోంది.. మీ కారు భద్రమేనా?
How to take care of car in rainy season : వర్షాకాలం వస్తోందంటే.. డ్రైవర్లకు ఒకింత భయం మొదలవుతుంది. వరద నీటిలో బండిని ఎలా నడపాలని భయపడుతుంటారు. కారును ఎలా భద్రంగా చూసుకోవాలా? అని ఆలోచిస్తుంటారు. వీరులో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే..
Tips to take care of car in rainy season : వర్షాకాలం అడుగు దూరంలో ఉంది! జూన్ 4 నాటికి రుతుపవనాలు.. కేరళను తాకుతాయని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఇక వర్షాకాలం మొదలైందంటే.. మన రోడ్ల దుస్థితి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ పరిస్థితుల్లో మన కారును ఎలా భద్రంగా చూసుకోవాలి? ప్రయాణం మధ్యలో హఠాత్తుగా వర్షం పడితే.. ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకుందాము..
సేఫ్ పార్కింగ్ ముఖ్యం..
మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా భారీ వర్షం పడటం మొదలైతే.. ముందు మీరు బండిని పార్క్ చేయాలి. అందుకోసం ఒక సురక్షితమైన పార్కింగ్ లాట్/ ప్రదేశాన్ని చూసుకోవాలి. ఓపెన్ స్పేస్ లేని పార్కింగ్ లాట్ అయితే ఇంకా బెటర్. వర్షం నుంచి కారుకు ముప్పు ఉండదు. వర్షం పడుతున్నప్పుడు ఉరుములు, మెరుపులు సహజమే. క్లోజ్డ్ ఏరియాలో కారును పార్క్ చేస్తే వాటి నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
హాజర్డ్ లైట్స్ ఆన్ చేసి ఉంచాలి..
కారును పార్క్ చేసిన తర్వాత హాజర్డ్ లైట్స్ వేయడం మర్చిపోకూడదు. వర్షాకాలంలో విజిబులిటీ చాలా తక్కువగా ఉంటుంది. భారీ వర్షాలు పడే సమయంలో ఎదురుగా వస్తున్న కారుకు మీ బండి కనిపించకపోవచ్చు! అందుకే హాజర్డ్ లైట్స్ వేస్తే.. కారుకు ఎలాంటి ప్రమాదం ఉండదు.
ఇదీ చూడండి:- పాత కారు వాడుతుంటే.. ఈ టిప్స్‌తో మీ వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోండి
విండోలు మూసే ఉంచాలి..
ఇది సాధారణంగా అందురు చేసే విషమమే. వర్షాలు పడుతున్నప్పుడు విండోలు మూసివేయాలి. కొందరు సరదాకి తెరిచి పెడుతుంటారు. కానీ అలా చేస్తే కారులోకి దుమ్ము, నీరు చేరుతుంది. ఫలితంగా కేబిన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కేబిన్‌ను కడగడం అంటే.. చాలా కష్టమైన పనే!
ఇంజిన్ ఆఫ్ చేయాలి..
Car care tips in rainy season : రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు సడెన్‌గా వర్షం పడితే.. బండిని పార్క్ చేయాలి. ఆ తర్వాత ఇంజిన్ ఆఫ్ చేయాలి. వర్షం ఎంతసేపు పడుతుందో మనకి తెలియదు. అంతసేపూ ఇంజిన్ ఆన్‌లోనే ఉంటే.. ఫ్యూయెల్ ఖర్చు అయిపోతుంది. అందుకో.. రోడ్డు పక్కన కారు పెడితే, హాజర్డ్ లైట్ వేసిన తర్వాత.. ఇంజిన్ ఆపేయాలి.
చెట్ల కింద కారును పెట్టకండి..
చెట్లు, స్తంభాలకు దగ్గర్లో కారును పార్క్ చేయడం మంచిది కాదు! భారీ వర్షాలు, భారీ ఈదురుగాలులతో అవి కూలిపోయి, కారు మీద పడితే.. ఆ బాధ అంతా ఇంతా కాదు. వాహనం పూర్తిగా ధ్వంసమైపోతుంది.
లోతట్టు ప్రాంతాలకు వెళ్లకండి..
How to take care of car : భారీ వర్షాలకు మన రోడ్లు తట్టుకోలేవన్న విషయం తెలిసిందే! ఎక్కడపడితే అక్కడ నీరు ఉండిపోతుంది. లోతట్టు ప్రాంతాల్లో అయితే ఏకంగా మోకాళ్ల లోతులో నీరు పేరుకుపోతుంది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రయాణించడం మీకు, కారుకు మంచిది కాదు. పైగా పార్కింగ్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. లోతట్టు ప్రాంతాలతో పాటు కొండ ప్రాంతాల్లో పార్కింగ్ చేయకపోవడం శ్రేయస్కరం.
సంబంధిత కథనం