Stocks to buy : ఈ 5 స్టాక్స్​ కొంటే భారీ లాభాలు.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్​ ప్రైజ్​​ టార్గెట్ ఇదే!-hdfc bank to jsw steel anuj gupta recommends 5 stocks to buy for this week ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy : ఈ 5 స్టాక్స్​ కొంటే భారీ లాభాలు.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్​ ప్రైజ్​​ టార్గెట్ ఇదే!

Stocks to buy : ఈ 5 స్టాక్స్​ కొంటే భారీ లాభాలు.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్​ ప్రైజ్​​ టార్గెట్ ఇదే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Apr 02, 2023 10:35 AM IST

Stocks to buy this week : ఈ వారం కొనాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ను ప్రముఖ స్టాక్​ మార్కెట్​ నిపుణుడు అనూజ్​ గుప్తా వెల్లడించారు. ఆ వివరాలు..

ఈ స్టాక్స్​ కొంటే.. భారీ లాభాలు
ఈ స్టాక్స్​ కొంటే.. భారీ లాభాలు (unsplash)

Stocks to buy today : అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు, ఆర్థిక ఏడాది ముగింపు నేపథ్యంలో.. ఇండియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీగా పెరిగాయి. నిఫ్టీ50.. 279 పాయింట్లు వృద్ధి చెంది 17,359 వద్ద ముగిసింది. ఇక బీఎస్​ఈ సెన్సెక్స్​ 1000 పాయింట్ల లాభంతో 58,991 వద్దకు చేరింది. బ్యాంక్​ నిఫ్టీ.. 698 పాయింట్లు పెరిగి 40,608 లెవల్స్​ వద్ద స్థిరపడింది.

ఐఐఎఫ్​ఎల్​ సెక్యూరిటీస్​ వైస్​ ప్రెసిడెంట్​, ప్రముఖ స్టాక్​ మార్కెట్​ నిపుణుడు అనూజ్​ గుప్తా ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్​ 17,200. గత కొంతకాలంగా కన్సాలిడేషన్​ దశలో ఉన్న నిఫ్టీ, బ్యాంక్​ నిఫ్టీలు.. ఎట్టకేలకు స్ట్రాంగ్​ బ్రేకౌట్స్​ ఇచ్చాయి.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఈ వారానికి స్టాక్స్​ టు బై లిస్ట్​ను అనూజ్​ గుప్తా వెల్లడించారు. అవేంటంటే..

స్టాక్స్​ టు బై..

HDFC Bank share price target : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​:- బ్యాంక్​ నిఫ్టీ హెవీవెయిట్​ స్టాక్​ అయిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​.. ఛార్ట్​ పాటర్న్​ బ్రేకౌట్​ ఇచ్చింది. ఫలితంగా ఈ స్టాక్​లో పాజిటివ్​ ముమెంట్​ ఉండొచ్చు.

బై- కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​,

స్టాప్​ లాస్​- రూ. 1,574

టార్గెట్​ రూ. 1,660

Stocks to buy this week : జేఎస్​డబ్ల్యూ స్టీల్​:- 4 వారాల కన్సాలిడేషన్​ దశ అనంతరం జేఎస్​డబ్ల్యూ స్టాక్​ బ్రేకౌట్​ ఇచ్చింది. స్టాక్​ వాల్యూమ్స్​ కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా స్వల్పకాలంలో జేఎస్​డబ్ల్యూ స్టీల్​ షేర్లు పెరగొచ్చు.

బై- కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​,

స్టాప్​ లాస్​- రూ. 654

టార్గెట్​- రూ. 750

ICICI bank share price target : ఐసీఐసీఐ బ్యాంక్​:- ఈ బ్యాంక్​ షేర్లు 1 నెల హైలో ట్రేడ్​ అవుతున్నాయి. ఈ స్టాక్​లో ఫ్రైడే సెషన్​లో బుల్లిష్​ చార్ట్​ బ్రేకౌట్​ వచ్చింది. 1 వీక్​ టార్గెట్​ పెట్టుకోవచ్చు.

బై- రూ. కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​,

స్టాప్​ లాస్​ రూ. 835

టార్గెట్​ రూ. 940

బీఈఎల్​:- భారత్​ ఎలక్ట్రానిక్స్​ షేర్లు 6 వీక్​ హైలో ట్రేడ్​ అవుతున్నాయి. వాల్యూమ్​లు కూడా పెరుగుతున్నాయి. ఫ్రైడే ఈ స్టాక్​లో బ్రేకౌట్​ వచ్చింది. 1 వీక్​ టార్గెట్​ పెట్టుకోవచ్చు.

బై- రూ. కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​,

స్టాప్​ లాస్​ రూ. 92,

టార్గెట్​ రూ. 110

Stocks to buy list : ఫెడరల్​ బ్యాంక్​:- ఈ బ్యాంక్​ షేర్లు సైతం ఛార్ట్​ పాటర్న్​లో బ్రేకౌట్​ ఇచ్చాయి. షార్ట్​ టర్మ్​లో పెరగొచ్చు.

బై- కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​,

స్టాప్​ లాస్​- రూ. 124

టార్గెట్​- రూ. 150

(గమనిక:- ఇవి నిపుణుడి అభిప్రాయాలు మాత్రమే. ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం