Kotak Mahindra Bank Q1 results: క్యూ 1 ఫలితాల్లో కొటక్ మహింద్ర బ్యాంక్ దూకుడు; 67 శాతం పెరిగిన నికర లాభాలు-kotak mahindra bank q1fy24 results declared pat jumps 67 percent nii rises 33 percent ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kotak Mahindra Bank Q1 Results: క్యూ 1 ఫలితాల్లో కొటక్ మహింద్ర బ్యాంక్ దూకుడు; 67 శాతం పెరిగిన నికర లాభాలు

Kotak Mahindra Bank Q1 results: క్యూ 1 ఫలితాల్లో కొటక్ మహింద్ర బ్యాంక్ దూకుడు; 67 శాతం పెరిగిన నికర లాభాలు

HT Telugu Desk HT Telugu
Jul 22, 2023 08:29 PM IST

Kotak Mahindra Bank Q1 results: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను కొటక్ మహింద్ర బ్యాంక్ (Kotak Mahindra Bank) శనివారం ప్రకటించింది. ఈ Q1 లో బ్యాంక్ రూ. 3,452 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ సాధించిన నికర లాభాల కన్నా 67% ఎక్కువ.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (MINT_PRINT)

Kotak Mahindra Bank Q1 results: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను కొటక్ మహింద్ర బ్యాంక్ (Kotak Mahindra Bank) శనివారం ప్రకటించింది. ఈ Q1 లో బ్యాంక్ రూ. 3,452 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ సాధించిన నికర లాభాల కన్నా 67% ఎక్కువ. Q1FY23లో బ్యాంక్ రూ. 2,071 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

వడ్డీ ఆదాయంలో మెరుగుదల

కొటక్ మహింద్ర బ్యాంక్ (Kotak Mahindra Bank) ఈ Q1 లో రూ. 6,234 కోట్ల నికర వడ్డీ ఆదాయం (Net Interest Income NII) సముపార్జించింది. Q1FY23 లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 4,697 కోట్లు. అంటే, Q1FY23 కన్నా Q1FY243 లో బ్యాంక్ 33% అధిక నికర వడ్డీ ఆదాయాన్ని పొందింది. Q1FY24 లో బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ కూడా 5.57 శాతానికి పెరిగింది. Q1FY24 లో బ్యాంక్ రిటర్న్ ఆన్ అసెట్స్ (ROA) 2.63%, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ROE) 14.62% కి చేరాయి. బ్యాంక్ సగటు కరెంట్ డిపాజిట్లు కూడా ఈ Q1FY24 లో రూ. 59,431 కోట్లకు చేరాయి.Q1FY24 లో ఇవి రూ. 55,081 కోట్లుగా ఉన్నాయి. అంటే, దాదాపు డిపాజిట్లలో 8% మెరుగుదలను బ్యాంక్ నమోదు చేసింది. అలాగే, సగటు సేవింగ్స్ డిపాజిట్ల విలువ ఈ Q1FY24 లో రూ. 119,817 కోట్లకు చేరాయి. ఈ జూన్ 30 నాటికి బ్యాంక్ కస్టమర్ల సంఖ్య కూడా 4.35 కోట్లకు చేరింది. 2022 జూన్ 30 నాటికి కొటక్ మహింద్ర బ్యాంక్ కస్టమర్ల సంఖ్య 3.45 కోట్లుగా ఉంది. అలాగే, బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తుల (GNPA) విలువ ఈ Q1FY24 లో 1.77 శాతానికి తగ్గింది. Q1FY23లో బ్యాంక్ GNPAల విలువ 2.24 శాతంగా ఉంది.

WhatsApp channel