IDFC First Bank share : 2023 మల్టీబ్యాగర్ స్టాక్‌గా,, ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్’!
31 December 2022, 13:00 IST
- Multibagger stocks for 2023 : 2023లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్.. మల్టీబ్యాగర్ స్టాక్‌గా ఎదుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలని వివరిస్తున్నారు. ఆ వివరాలు..
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్
IDFC First Bank share : 2022లో బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్స్ మెరుగైన ప్రదర్శన చేశాయి. ముఖ్యంగా.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు.. గత ఆరు నెలల్లో మదుపర్లకు భారీ రిటర్నులు తెచ్చిపెట్టాయి. ఈ ర్యాలీ 2022తో ముగిసిపోదని.. 2023లోనూ కొనసాగుతుందని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వడ్డీ రేట్ల పెంపు, కార్పొరేట్ లెండింగ్ బిజినెస్‌లో వృద్ధి, కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ రాణించడం, ఆన్లైన్ లెండింగ్పై సంస్థ దృష్టిపెట్టడం వంటి అంశాలు.. ఐడీఎఫ్సీకి సానుకూల విషయాలని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఇండియా మార్కెట్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అనేది 'జెన్-ఎక్స్ బ్యాంక్'గా ఆవిర్భవిస్తోందని అభిప్రాయపడుతున్నారు.
IDFC First Bank share price : ఇక టెక్నికల్స్ విషయానికొస్తే.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్.. రూ. 45 వద్ద బ్రేకౌట్ ఇచ్చింది. ప్రస్తుతం రూ. 45- రూ. 60 మధ్యలో ట్రేడ్ అవుతోంది. రూ. 60 వద్ద ఉన్న రెసిస్టెన్స్‌ను దాటితే.. ఈ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ ధర రూ. 70కి కూడా చేరే అవకాశం ఉంది. ఇక రూ. 70 వద్ద స్థిరపడితే.. ఈ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ స్టాక్ ధర మూడంకెలకు చేరుతుందని, 2023 చివరిని నాటికి.. కనీసం రూ. 120కి వృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"రీటైల్ బ్యాంకింగ్ బిజినెస్‌తో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌కు లాభం చేకూరనుంది. దీనితో పాటు.. కార్పొరేట్ ఫండింగ్ కూడా కలిసివస్తుంది. డాలర్ ఇండెక్స్ కాస్త శాంతిస్తే.. లోకల్ లెండింగ్ సోర్స్‌లపై కార్పొరేట్ సంస్థలు దృష్టిపెట్టొచ్చు. వీటితో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వ్యాపారం వృద్ధిచెందుతుంది. అందువల్ల.. రానున్న కాలంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మార్జిన్లు మెరుగుపడతాయని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి," అని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్త వెల్లడించారు.
IDFC First Bank target : ప్రస్తుతం ఉన్న లెవల్స్ వద్ద మదుపర్లు కొనుగోలు చేసుకుని.. 2-3ఏళ్ల వరకు హోల్డ్ చేస్తే.. మంచి రిటర్నులు సంపాదించుకోవచ్చను ప్రొఫీషియెంట్ ఈక్విటీస్ ఫౌండర్- డైరక్టర్ మనోజ్ దాల్మియ తెలిపారు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ స్టాక్..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ స్టాక్ రూ. 58.85కు చేరింది. ఈ ఈ స్టాక్ గత ఐదు రోజుల్లో 9.6శాతం పెరిగింది. నెల రోజుల వ్యవధిలో 0.4శాతం వృద్ధి చెందింది.
IDFC First bank multibagger stock : కానీ ఆరు నెలల వ్యవధిలో మాత్రం.. ఏకంగా 87.12శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు 18.53శాతం పెరిగింది ఈ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు. మొత్తం మీద ఏడాది కాలంల.. 21.72శాతం వృద్ధిని నమోదు చేసి.. మదుపర్లకు సంతోషాన్నిచ్చింది.
(గమనిక:- ఇవి కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడులు చేసే ముందు.. మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)