తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Great Indian Festival : యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రో 2పై క్రేజీ డిస్కౌంట్​..!

Amazon Great Indian Festival : యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రో 2పై క్రేజీ డిస్కౌంట్​..!

Sharath Chitturi HT Telugu

08 October 2023, 13:40 IST

    • Amazon Great Indian Festival : యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రో 2పై అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లో ఆఫర్స్​ లభిస్తున్నాయి. ఆ వివరాలు..
యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రో 2పై క్రేజీ డిస్కౌంట్​..!
యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రో 2పై క్రేజీ డిస్కౌంట్​..! (Apple)

యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రో 2పై క్రేజీ డిస్కౌంట్​..!

Amazon Great Indian Festival sale : ఇండియాలో ఫెస్టివల్​ సీజన్​తో పాటు ఆఫర్స్​, డిస్కౌంట్స్​ హడావుడి కూడా మొదలైంది. దిగ్గజ ఈ-కామర్స్​ సంస్థలు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లు.. పలు ప్రాడక్ట్స్​పై పొటీపడి మరీ క్రేజీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రో సెకెండ్​ జెన్​పై మంచి ఆఫర్స్​ కనిపిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

SBI Q4 Results: క్యూ 4 ఆదాయంలో అంచనాలను అధిగమించిన ఎస్బీఐ; షేర్ హోల్డర్లకు డివిడెండ్ ఎంతంటే?

Bank holiday tomorrow: అక్షయ తృతీయ సందర్భంగా బ్యాంకులకు రేపు సెలవు ఉంటుందా?

Maruti Suzuki Swift launch: మారుతి సుజుకీ స్విఫ్ట్ 2024 మోడల్ లాంచ్; మైలేజీ 25 కిమీల పైనే. ధర కూడా అందుబాటులోనే..

Simpl layoffs: ఫిన్ టెక్ కంపెనీ ‘సింప్ల్’ లో 25% ఉద్యోగులకు ఉద్వాసన; ఉద్యోగులకు సీఈఓ క్షమాపణలు

అతి తక్కువ ధరకే యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రో 2..!

యాపిల్​ వెబ్​సైట్​లో ఎయిర్​పాడ్స్​ ప్రో 2 ధర రూ. 24,900గా ఉంది. కాగా.. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లో మాత్రం ఈ గ్యాడ్జెట్​ను ఆఫర్​లో రూ. 18,499కే కొనుగోలు చేసుకోవచ్చు. పలు బ్యాంక్​ల కార్డులపై ఇంకొన్ని ఆఫర్స్​  కూడా వస్తున్నాయి. ఫలితంగా.. ఫ్లిప్​కార్ట్​లో ఈ మోడల్​ రూ. 16,999కి.. అమెజాన్​లో రూ. 16,749కే పొందొచ్చు.

Apple Airpods pro price : వాస్తవానికి ఈ యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రోని 2022లో లాంచ్​ చేసింది దిగ్గజ టెక్​ సంస్థ. కాగా.. సెకెండ్​ జనరేషన్​ను ఈ ఏడాది సెప్టెంబర్​లో జరిగిన వాండర్​లస్ట్​ ఈవెంట్​లో ఆవిష్కరించింది.

ఈ ఇయర్​ఫోన్స్​లో లాస్​లెస్​ ఆడియో విత్​ అల్ట్రా-లో లేటేన్సీ వస్తోంది. ఇందులో హెచ్​2 చిప్​సెట్​ ఉంటుంది. యాపిల్​ విజన్​ ప్రోలో కూడా ఇదే చిప్​సెట్​ ఉంటుంది. ఫలితంగా.. ఈ రెండిటినీ కలిపి వాడితే క్రేజీ ఫీల్​ వస్తుందని, పవర్​ఫుల్​ 20 బిట్​, 48 కేహెచ్​జెడ్​ లాస్​లెస్​ ఆడియో అన్​లాక్​ అవుతుందని టెక్​ నిపుణులు చెబుతున్నారు.

ఐఫోన్​ 15, ఐఫోన్​ 15 ప్లస్​, ఐఫోన్​ 15 ప్రో, ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​లో యూఎస్​బీ-టైప్​ సీ కనెక్టర్​ వస్తున్న విషయం తెలిసిందే. ఇక యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రోని కూడా దానితోనే ఛార్జ్​ చేసుకోవచ్చు. ఈ డివైజ్​లో ఐపీ54 రేటింగ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ వస్తోంది. అంటే.. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా.. ఈ మోడల్​ని వాడుకోవచ్చు. ముఖ్యంగా అడ్వెంచర్​ చేసే వారికి ఇది బాగా హెల్ప్​ అవుతుంది.

అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​, ఫ్లిప్​కార్ట్​ బిగ్​బిలియన్​ డేస్​ సేల్​ రెండూ కూడా ఆదివారం మొదలయ్యాయి.

ఈ ఐఫోన్​ ప్రాడక్ట్స్​పై భారీ ఆఫర్లు..!

Flipkart big billion days 2023 : ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ సేల్​లో ఐఫోన్స్​పై మంచి డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

ఐ ఫోన్ 13: రూ. 52,499

ఐ ఫోన్ 14: రూ. 61,999

ఐ ఫోన్ 14 ప్లస్: 70,999

ఐ ఫోన్14 ప్రొ: రూ. 1,19,990

ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్: రూ. 1,77,999 లకే సొంతం చేసుకోవచ్చు. ఐ ఫోన్ లే కాకుండా, ఇతర బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ కూడా భారీ డిస్కౌంట్ లతో ఈ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.