తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Great Indian Festival: ఆమెజాన్ లో ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్; డోంట్ మిస్..

Amazon Great Indian Festival: ఆమెజాన్ లో ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్; డోంట్ మిస్..

HT Telugu Desk HT Telugu

07 October 2023, 19:02 IST

  • Amazon Great Indian Festival Sale: ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. సామ్సంగ్, రెడ్ మి, వన్ ప్లస్ వంటి బ్రాండ్స్ కు చెందిన ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ పై ఈ సేల్ లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amazon Great Indian Festival Sale: ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అన్ని రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ ప్రైమ్ మెంబర్స్ కోసం అక్టోబర్ 7వ తేదీన, మిగతా అందరికీ అక్టోబర్ 8వ తేదీన అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ లో సామ్సంగ్, రెడ్ మి, వన్ ప్లస్, రియల్ మి వంటి బ్రాండ్స్ కు చెందిన ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ పై మంచి ఆఫర్స్ ఉన్నాయి.

ఇవి పరిశీలించండి..

ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్స్ పై మంచి ఆఫర్స్ ఉన్నాయి. అవి..

  • రియల్ మి నార్జో ఎన్ 53

రియల్‌ మి నార్జో ఎన్ 53 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీతో వస్తుంది. ఈ సెగ్మెంట్లో నార్జో ఎన్ 53 అత్యంత స్లిమ్ మోడల్ స్మార్ట్ ఫోన్. దీని ఫెదర్ గోల్డ్ కలర్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీతో వస్తుంది.

  • సామ్సంగ్ గెలాక్సీ ఎం 13

సామ్సంగ్ గెలాక్సీ ఎం 13 స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 స్టోరేజీతో వస్తుంది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపర్చారు. ర్యామ్ ప్లస్ ఆప్షన్ తో ర్యామ్ ను 12 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్టార్ డస్ట్ బ్రౌన్ కలర్ లో ఇది లభిస్తుంది.

  • రెడ్ మి 12 సీ

స్లీక్ మ్యాటీ బ్లాక్ కలర్ లో లభించే రెడ్ మి 12 సీ స్మార్ట్ ఫోన్ లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ 85 ప్రాసెసర్ ను అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.71 ఇంచ్ ల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది.

  • సామ్సంగ్ గెలాక్సీ ఎం 34

ప్రిజ్మ్ సిల్వర్ కలర్ లో లభించే సామ్సంగ్ గెలాక్సీ ఎం 34 లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటాయి. ఇందులో 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో అమొలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ర్యామ్ ప్లస్ ఆప్షన్ తో ర్యామ్ ను 12 జీబీ వరకు పెంచుకోవచ్చు.

తదుపరి వ్యాసం