Amazon Great Indian Festival: ఆమెజాన్ లో ఈ ఐ ఫోన్ లపై అదిరిపోయే ఆఫర్స్-amazon great indian festival sale goes live for prime members deals on iphone 13 iphone 14 more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Great Indian Festival: ఆమెజాన్ లో ఈ ఐ ఫోన్ లపై అదిరిపోయే ఆఫర్స్

Amazon Great Indian Festival: ఆమెజాన్ లో ఈ ఐ ఫోన్ లపై అదిరిపోయే ఆఫర్స్

HT Telugu Desk HT Telugu
Oct 07, 2023 04:31 PM IST

Amazon Great Indian Festival: ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో ఐ ఫోన్ 13, ఐ ఫోన్ 14 సిరీస్ లపై ఆకర్షణీయమైన ఆఫర్స్ ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP)

Amazon Great Indian Festival: ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ప్రైమ్ మెంబర్స్ () కు అక్టోబర్ 7వ తేదీ నుంచి, అందరికీ అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, హోం అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫ్యాఫస్.. తదితర అన్ని ప్రొడక్ట్స్ పై ఇందులో డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి.

ఐ ఫోన్ లపై..

ఐ ఫోన్ కొనాలన్న ఆలోచనలో ఉన్నవారు కూడా ఈ సేల్ లో ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపుతో.. వాటిని సొంతం చేసుకోవచ్చు. ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో..

ఐ ఫోన్ 13: రూ. 52,499

ఐ ఫోన్ 14: రూ. 61,999

ఐ ఫోన్ 14 ప్లస్: 70,999

ఐ ఫోన్14 ప్రొ: రూ. 1,19,990

ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్: రూ. 1,77,999 లకే సొంతం చేసుకోవచ్చు. ఐ ఫోన్ లే కాకుండా, ఇతర బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ కూడా భారీ డిస్కౌంట్ లతో ఈ సేల్ లో అందుబాటులో ఉన్నాయి.

వన్ ప్లస్ 11ఆర్ 5జీ

వన్ ప్లస్ 11ఆర్ 5జీ లో 6.7-అంగుళాల 120 Hz సూపర్ ఫ్లూయిడ్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్, 8GB ర్యామ్ ఉన్నాయి. వీటి ద్వారా వేగవంతమైన మల్టీ టాస్కింగ్, గేమింగ్ సాధ్యమవుతాయి. వన్ ప్లస్ 11ఆర్ 5జీ లో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆమెజాన్ సేల్ లో రూ.39,999 లకే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ అదనం.

వన్ ప్లస్ 11 5 జీ

వన్ ప్లస్ 11 5 జీ స్మార్ట్ ఫోన్ (8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్) ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ. 56,998 లకే అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్స్ అదనం. ఇందులో 6.7-అంగుళాల అమొలెడ్ క్యూహెచ్ డీ డిస్‌ప్లే ఉంటుంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా, 48 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 32 ఎంపీ టెలీఫొటో లెన్స్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్, 8GB ర్యామ్ ఉన్నాయి.