Google pixel 8 vs iPhone 15 : గూగుల్​ పిక్సెల్​ 8 వర్సెస్​ ఐఫోన్​ 15.. ఏది బెస్ట్​?-google pixel 8 vs iphone 15 check detailed comparison of features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Google Pixel 8 Vs Iphone 15 Check Detailed Comparison Of Features Here

Google pixel 8 vs iPhone 15 : గూగుల్​ పిక్సెల్​ 8 వర్సెస్​ ఐఫోన్​ 15.. ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Oct 06, 2023 10:10 AM IST

Google pixel 8 vs iPhone 15 : గూగుల్​ పిక్సెల్​ 8 వర్సెస్​ ఐఫోన్​ 15.. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..

గూగుల్​ పిక్సెల్​ 8 వర్సెస్​ ఐఫోన్​ 15..
గూగుల్​ పిక్సెల్​ 8 వర్సెస్​ ఐఫోన్​ 15..

Google pixel 8 vs iPhone 15 : స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో పోటీ మరింత పెరిగింది! గూగుల్​ సంస్థ.. తన పిక్సెల్​ 8 సిరీస్​ని తాజాగా లాంచ్​ చేయడం ఇందుకు కారణం. గత నెలలో లాంచ్​ అయిన ఐఫోన్​ 15 సిరీస్​కు ఇది గట్టిపోటీనిస్తుందని టాక్​ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

గూగుల్​ పిక్సెల్​ 8 వర్సెస్​ ఐఫోన్​ 15- స్పెసిఫికేషన్స్​..

గూగుల్​ పిక్సెల్​ 8లో 6.2 ఇంచ్​ ఎల్​టీపీఎస్​ ఓఎల్​ఈడీ ఆక్టువా డిస్​ప్లే ఉంటుంది. ఇందులో ఆల్​వేస్​ ఆన్​ డిస్​ప్లే ఉంటుంది. 60 హెచ్​జెడ్​- 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో ఈ స్మార్ట్​ఫోన్​ వస్తోంది. ఇందులో అబ్సీడియన్​, హాజెల్​, రోస్​ వంటి కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​ ఆప్షన్స్​ వస్తున్నాయి. ఈ గూగుల్​ పిక్సెల్​ 8లో టెన్సార్​ జీ3 చిప్​సెట్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 14 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది.

Google pixel 8 price in India : ఇక ఐఫోన్​ 15 విషయానికొస్తే.. ఇందులో 6.1 ఇంచ్​ సూపర్​ రెటీనా ఎక్స్​డీఆర్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే లభిస్తుంది. ఆల్​వేస్​ ఆన్​ డిస్​ప్లే లేదు. 60 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ వస్తోంది. బ్లాక్​, యెల్లో, బ్లూ, గ్రీన్​, పింక్​ వంటి కలర్​ ఆప్షన్స్​ లభిస్తున్నాయి. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 6జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 6జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉన్నాయి. ఏ16 బయోనిక్​ ప్రాసెసర్​ వస్తోంది. ఐఓఎస్​17 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది.

గూగుల్​ పిక్సెల్​ 8 వర్సెస్​ ఐఫోన్​ 15- ఇతర ఫీచర్స్​..

గూగుల్​ పిక్సెల్​ 8లో 50ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా-వైడ్​ రేర్​ కెమెరా సెటప్​ వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 10.5 ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది. అండర్​ డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ స్కానర్​, ఫేస్​ అన్​లాక్​ వంటి ఫీచర్స్​ కూడా ఉన్నాయి. 4,575 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 27వాట్​ వయర్డ్​, 18వాట్​ వయర్​లెస్​ గూగుల్​ పిక్సెల్​ స్టాండ్​ వస్తోంది. యూఎస్​బీ- టైప్​ సీ ఛార్జర్​ లభిస్తుంది.

iPhone 15 price in India : ఇక ఐఫోన్​ 15 విషయానికొస్తే.. ఇందులో 48ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా-వైడ్​ రేర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 12ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తుంది. ఫేస్​ఐడీ సెక్యూరిటీ వస్తోంది. 3,349ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 27వాట్​ వయర్డ్​, 15వాట్​ మగ్​సేఫ్​ వయర్​లెస్​ ఛార్జర్​ వంటివి ఉన్నాయి. యూఎస్​బీ- టైప్​ సీ పోర్ట్​ కూడా వస్తోంది.

గూగుల్​ పిక్సెల్​ 8 వర్సెస్​ ఐఫోన్​ 15- ధర..

Google pixel 8 features : గూగుల్​ పిక్సెల్​ 8 సిరీస్​ ప్రారంభ ధర రూ. 75,999. ఐఫోన్​ 15 ప్రారంభ ధర 799 డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ. 79,900.

WhatsApp channel

సంబంధిత కథనం