iPhone 15 Pro : ఐఫోన్​ 15 ప్రో 'డ్రాప్​ టెస్ట్​'లో షాకింగ్​ రిజల్ట్​.. కింద పడితే ఇక అంతే!-iphone 15 pro may be more prone to cracking and breaking than iphone 14 pro ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 15 Pro : ఐఫోన్​ 15 ప్రో 'డ్రాప్​ టెస్ట్​'లో షాకింగ్​ రిజల్ట్​.. కింద పడితే ఇక అంతే!

iPhone 15 Pro : ఐఫోన్​ 15 ప్రో 'డ్రాప్​ టెస్ట్​'లో షాకింగ్​ రిజల్ట్​.. కింద పడితే ఇక అంతే!

Sharath Chitturi HT Telugu
Sep 24, 2023 03:14 PM IST

iPhone 15 Pro : ఐఫోన్​ 15 ప్రో కొనే ప్లాన్​లో ఉన్నారా? లేదా.. ఇప్పటికే కొనేశారా? అయితే.. ఈ ‘డ్రాప్​ టెస్ట్​’ రిజల్ట్​ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

ఐఫోన్​ 15 ప్రో 'డ్రాప్​ టెస్ట్​'లో షాకింగ్​ రిజల్ట్​..
ఐఫోన్​ 15 ప్రో 'డ్రాప్​ టెస్ట్​'లో షాకింగ్​ రిజల్ట్​.. (Bloomberg)

iPhone 15 Pro drop test : సాధారణంగా యాపిల్​ ఐఫోన్​ ధరలు ఎక్కువగానే ఉంటాయి. ఈ ధరల గురించి ఇప్పటికే చాలా మీమ్స్​ చూసే ఉంటారు. అలాంటిది.. కష్టార్జితంలో కొన్న ఐఫోన్​ కిందపడితే! గుండె పగిలిపోతుంది కదూ..! ఐఫోన్​ 15 ప్రో విషయంలో అయితే ఇదే జరిగే అవకాశం ఉందని ఒక 'డ్రాప్​ టెస్ట్​' సూచిస్తోంది. ఈ డ్రాప్​ టెస్ట్​ రిజల్ట్​ ఏంటంటే..

ఐఫోన్​ 15 ప్రో కింద పడితే..

యూట్యూబర్​ సామ్​ కోల్​ అనే వ్యక్తి ఈ డ్రాప్​ టెస్ట్​ను నిర్వహించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. ఐఫోన్​ 14 ప్రో, ఐఫోన్​ 15 ప్రో మోడల్స్​తో ఈ వీడియో తీశాడు.

iPhone 15 Pro price in India : వేరువేరు హైట్స్​, యాంగిల్స్​ నుంచి ఈ రెండు యాపిల్​ స్మార్ట్​ఫోన్స్​ను కాంక్రీట్​ సర్ఫేస్​పై పడేశాడు సామ్​. తొలుత రెండు ఫోన్స్​కి ఏం అవ్వలేదు. అయితే.. ఐఫోన్​ 15 ప్రోను.. 6 అడుగుల ఎత్తు నుంచి కాంక్రీట్​ సర్ఫేస్​పై పడేస్తే.. ఆ ఫోన్​ డిస్​ప్లైకు క్రాక్స్​ వచ్చాయి. బ్లాక్​ గ్లాస్​ పగిలిపోయింది. అంతేకాదు.. ఆ గ్యాడ్జెట్​ అసలు పనిచేయడమే మానేసింది!

ఐఫోన్​ 14 ప్రో మాత్రం.. 6 అడుగుల ఎత్తు నుంచి కిందపడేసినా.. స్మూత్​గానే పనిచేస్తూ ఉండటం గమనార్హం. స్వల్పంగా స్క్రాచ్​లు పడినా.. డిస్​ప్లే, బ్లాక్​ గ్లాస్​కు ఏం అవ్వలేదు.

ఇదీ చూడండి:- iPhone 16 Pro : ఐఫోన్​ 16 ప్రో.. యాపిల్​ లవర్స్​కు మంచి కిక్​ ఇచ్చే వార్త ఇది!

iPhone 15 Pro drop test results : "ఐఫోన్​ 15 ప్రోలో టిటానియం ఫ్రేమ్​ ఉంటుంది. అయితే.. ఈ మొబైల్​కు కర్వ్​డ్​ ఎడ్జ్​లు రావడంతో.. బ్లాక్​ గ్లాస్​ పగిలిపోయిందని అనుకుంటున్నాను. ఫోన్​ కేస్​లు వాడకుండా తిరిగేవాళ్లు.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి," అని యూట్యూబర్​ సామ్​ కోల్​ వ్యాఖ్యలు చేశాడు.

ఐఫోన్​లు ఎంత కాస్ట్​ ఉంటాయో.. వాటిని రిపేర్​ చేయించేందుకు అయ్యే ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. అందుకే.. ఐఫోన్​లను కొంటే సరిపోదు, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి కూడా!

డ్రాప్​ టెస్ట్​ను నమ్మొచ్చా..?

iPhone 15 Pro durability : డ్రాప్​ టెస్ట్​కు సైంటిఫిక్​ ప్రమాణాలు ఉండవు. డ్రాప్​ టెస్ట్​ ఫలితాలు అనేక ఫ్యాక్టర్స్​పై ఆధారపడి ఉంటాయి. ఫోన్​ పడేసే సర్ఫేస్​, యాంగిల్​పైనా ఇవి ఆధారపడి ఉంటాయి.

సాధారణంగా.. డ్రాప్​ టెస్ట్​ను స్మార్ట్​ఫోన్​ బ్రాండ్స్​.. కంట్రోల్డ్​ కండీషన్స్​లో నిర్వహిస్తూ ఉంటాయి. వేరువేరు హైట్స్​ నుంచి ఒక సర్ఫేస్​పై పడేస్తాయి. ఆ ఇంపాక్ట్​ను లెక్కించేందుకు​ ఫోర్స్​ మీటర్స్​ ఉంటాయి.

ఏది ఏమైనా.. ఐఫోన్​ అనే కాదు.. ఏ ఫోన్​ కొన్నా దానికి ఫోన్​ కేస్​ కూడా కొనుక్కోవడం బెటర్​!

Whats_app_banner

సంబంధిత కథనం