iPhone 16 Pro : ఐఫోన్​ 16 ప్రో.. యాపిల్​ లవర్స్​కు మంచి కిక్​ ఇచ్చే వార్త ఇది!-check all the talks and rumours about iphone 16 pro ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 16 Pro : ఐఫోన్​ 16 ప్రో.. యాపిల్​ లవర్స్​కు మంచి కిక్​ ఇచ్చే వార్త ఇది!

iPhone 16 Pro : ఐఫోన్​ 16 ప్రో.. యాపిల్​ లవర్స్​కు మంచి కిక్​ ఇచ్చే వార్త ఇది!

Sharath Chitturi HT Telugu
Sep 24, 2023 01:26 PM IST

iPhone 16 Pro : ఐఫోన్​ 15 లాంచ్​తో ఇక ఐఫోన్​ 16 సిరీస్​పై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 16 ప్రోకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్​ బయటకు వచ్చింది.

ఐఫోన్​ 16 ప్రో.. యాపిల్​ లవర్స్​కు మంచి కిక్​ ఇచ్చే వార్త ఇది!
ఐఫోన్​ 16 ప్రో.. యాపిల్​ లవర్స్​కు మంచి కిక్​ ఇచ్చే వార్త ఇది! (Apple)

iPhone 16 Pro : ఐఫోన్​ 15 కోసం యాపిల్​ లవర్స్​ ఏ విధంగా హడావుడి చేస్తున్నారో గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాము. ఈ గ్యాడ్జెట్స్​కు ఉన్న డిమాండ్​ అలాంటిది! ముఖ్యంగా.. ప్రో మోడల్స్​ కొనేందుకు కస్టమర్లు చాలా ఆసక్తిగా ఉన్నారు. వీటన్నింటి మధ్య యాపిల్​ లవర్స్​కు మరింత కిక్​ ఇచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే..

ఐఫోన్​ 16 ప్రో విశేషాలు..

ప్రతి యేటా సెప్టెంబర్​లో కొత్త ఐఫోన్​ సిరీస్​ను లాంచ్​ చేస్తూ ఉంటుంది యాపిల్​ సంస్థ. ఐఫోన్​ 15 కూడా ఈ నెలలోనే బయటకు వచ్చింది. ఇక ఐఫోన్​ 16 లాంచ్​ కోసం ఏడాది ఆగాల్సిందే. అయితే ఈ సిరీస్​లోని ప్రో మోడల్​పై ఇప్పటికే రూమర్స్​, లీక్స్​ జోరుగా సాగుతున్నాయి. ఐఫోన్​ 15 ప్రో మోడల్​ కన్నా ఐఫోన్​ 16 ప్రో మరింత క్రేజీగా ఉండనుందని వార్తలు వస్తున్నాయి.

ఐఫోన్​ 16 ప్రో, ఐఫోన్​ 16 ప్రో మ్యాక్స్​లోని డిస్​ప్లే (6.3 ఇంచ్​, 6.9ఇంచ్​).. ఐఫోన్​ 15 కన్నా పెద్దగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఐఫోన్​ 15 ప్రోలో 6.1 ఇంచ్​ స్క్రీన్​ ఉంది. ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​కు అది 6.7 ఇంచ్​గా ఉంది. స్క్రీన్​ ఎంత పెద్దగా ఉంటే, గ్యాడ్జెట్​ అంత బెటర్​గా ఉంటుందని యాపిల్​ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

iPhone 16 Pro price : ఇక ఐఫోన్​ 16 సిరీస్​లో కెమెరా క్వాలిటీ నెక్స్ట్​ లెవల్​లో ఉంటుందని టాక్​ నడుస్తోంది. ముఖ్యంగా ప్రో మోడల్స్​కు 48ఎంపీ అల్ట్రా వైడ్​ కెమెరా లభిస్తుందని సమాచారం. ఇదే జరిగితే.. పిక్చర్​ క్వాలిటీ మరింత మెరుగు అవుతుంది.

ఇదీ చూడండి:- iPhone 14 price cut: ఐ ఫోన్ 14 పై బంపర్ ఆఫర్; డోంట్ మిస్..

మరోవైపు ఐఫోన్​ 16 ప్రో మోడల్​లో 5ఎక్స్​ ఆప్టికల్​ జూమ్​ ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​లో ఇది ఉంది. దీనితో ఫొటోగ్రఫీని నెక్స్ట్​ లెవల్​కు తీసుకెళ్లొచ్చని టెక్​ నిపుణులు చెబుతున్నారు.

iPhone 16 Pro max price : ఐఫోన్​ 16 ప్రోలో వైఫై-7 ఉంటుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చాలా ఫోన్స్​కు ఇంకా వైఫై-6 కూడా సరిగ్గా అందలేదు! ఈ వైఫై-7తో ఇంటర్నెట్​ స్పీడ్​ మరింత వేగవంతం అవుతుంది.

యాపిల్​ ఐఫోన్​ 16 సిరీస్​ గురించి రానున్న రోజుల్లో మరిన్ని వార్తలు వెలుగులోకి వస్తాయి. లాంచ్​ కోసం మాత్రం 2024 సెప్టెంబర్​ వరకు ఎదురు చూడాల్సిందే.

ఇండియాలో ఐఫోన్​ 15 రేట్లు..

iPhone 15 sales in India : ఇండియాలో.. ఐఫోన్​ 15 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 79,900గా ఉంది. ఇక ఐఫోన్​ 15 ప్లస్​ ధర రూ. 89,900. ఐఫోన్​ 15 ప్రో 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 1,34,900. అదే సమయంలో టాప్​ ఏండ్​ వేరియంట్​.. ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​ 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 1,59,900.

WhatsApp channel

సంబంధిత కథనం