iPhone 14 price cut: ఐ ఫోన్ 14 పై బంపర్ ఆఫర్; డోంట్ మిస్..
iPhone 14 price cut: ఐ ఫోన్ 15 లాంచ్ తో ఐ ఫోన్ 14 పై డిస్కౌంట్ ల వర్షం కురుస్తోంది. అందులో భాగంగానే ఆమెజాన్ కూడా ఐ ఫోన్ 14 పై మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది.
iPhone 14 price cut: ఐ ఫోన్ 15 కొనేంత బడ్జెట్ లేదా? అయినా ఐ ఫోన్ కొనాలని డిసైడ్ అయ్యారా? అయితే.. మీ కోసమే ఆమెజాన్ ఐ ఫోన్ 14 పై ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
రూ. 25 వేలకే..
ఐ ఫోన్ 14 పై ఆమెజాన్ మంచి డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఐ ఫోన్ 14 ను యాపిల్ 2022 సెప్టెంబర్ లో లాంచ్ చేసింది. ఇప్పటివరకు 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఐ ఫోన్ 14 ధర రూ. 69,900గా ఉంది. ఇప్పుడు ఆ ధరపై ఆమెజాన్ 10% అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ అనంతరం ఐ ఫోన్ 14 రూ. 62,999 లకే లభిస్తుంది. అంతేకాదు, ఇంకా అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే.. ఏదైనా వర్కింగ్ కండిషన్ లో ఉన్న మీ స్మార్ట్ ఫోన్ ను ఐ ఫోన్ 14 తో ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే, ఐ ఫోన్ 14 ధర మరింత తగ్గుతుంది. మీరు ఎక్స్చేంజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్ ను బట్టి మీకు గరిష్టంగా రూ. 37,500 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అంటే, మీకు ఎక్స్చేంజ్ లో పూర్తి మొత్తం లభిస్తే, ఐ ఫోన్ 14 ను మీరు రూ. 25,000 లకే సొంతం చేసుకోవచ్చు. మీరు ఎక్స్చేంజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ ఎలాంటి డ్యామేజీ లేకుండా, వర్కింగ్ కండిషన్ లో ఉండాలి. ఒకవేళ, మీరు హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే, అదనంగా రూ. 250 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఫీచర్స్..
ఐఫోన్ 14 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో A15 బయోనిక్ చిప్‌నుఅమర్చారు. ఇందులో 6GB RAM ఉంటుంది. వెనుకవైపు, రెండు కెమెరాలు ఉన్నాయి - ఒకటి సాధారణ ఫోటోల కోసం మరియు మరొకటి వైడ్ యాంగిల్ షాట్‌ల కోసం, రెండూ 12MP కెమెరాలే. ముందు భాగంలో, ఇది మరో 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.