(1 / 7)
యాపిల్ ఈవెంట్ లో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ అల్ట్రా 2 ని కూడా లాంచ్ చేశారు.
(Apple)(2 / 7)
యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో సరికొత్త ఎస్ 9 సిప్ (SiP) ని అమర్చారు. ఇ ది యాపిల్ సంస్థ పవర్ ఫుల్ వాచ్ సిప్. అలాగే, ఈ వాచ్ లో 4 కోర్ న్యూరల్ ఇంజన్ ఉంటుంది.
(Apple)(3 / 7)
యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో డబుల్ ట్యాప్ జెస్చర్ ఫీచర్ ఉంది. దీని ద్వారా యూజర్ చాలా సులభంగా ఈ వాచ్ ను ఆపరేట్ చేయవచ్చు. డిస్ ప్లే ను టచ్ చేయకుండానే బొటనవేలు, చూపుడు వేలుతో ఈ వాచ్ లో చాలా ఫీచర్స్ ను ఆపరేట్ చేయవచ్చు.
(Apple)(4 / 7)
యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో 3000 నిట్స్ డిస్ ప్లే ఉంటుంది. ఇది చాలా బ్రైట్ గా ఉంటుంది. సన్ లైట్ లో క్లియర్ గా కనిపిస్తుంది.
(Apple)(5 / 7)
యాపిల్ వాచ్ అల్ట్రా 2 ను సిరి ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. వాటర్ స్పోర్ట్స్, స్కూబా డైవింగ్ వంటివి ఈ వాచ్ పెట్టుకునే చేయవచ్చు. ఇందులోని ఓషియానిక్ ప్లస్ యాప్ వాటర్ స్పోర్ట్స్ వివరాలు తెలియజేస్తుంది.
(Apple)(6 / 7)
ఈ వాచ్ ను రీసైకిల్డ్ టైటానియం తో తయారు చేశారు. ఈ వాచ్ ఆల్పైన్ లూప్ ఇండిగో, బ్లూ, ఆలివ్ కలర్స్ లో, ట్రయిల్ లూప్ బీజ్, గ్రీన్, గ్రే, బ్లూ, బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.
(Apple)(7 / 7)
సెప్టెంబర్ 22 నుంచి ఈ యాపిల్ వాచ్ అల్ట్రా 2 ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర భారత్ లో రూ. 89,999. అమెరికాలో 799 డాలర్లు.
(Apple)ఇతర గ్యాలరీలు