Vivo Y17s launched : వివో నుంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్, ధర ఇవే!
Vivo Y17s launched : వివో వై17ఎస్ స్మార్ట్‌ఫోన్.. ఒక ఎంట్రీ లెవల్ గ్యాడ్జెట్. ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Vivo Y17s launched : అంతర్జాతీయ మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది వివో సంస్థ. దీని పేరు వివో వై17ఎస్. ఇదొక ఎంట్రీ లెవల్, బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్. సింగపూర్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది. లాంచ్ నేపథ్యంలో.. ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వివో కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే..!
వివో వై17ఎస్‌లో 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.56 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడ ప్యానెల్ ఉంటుంది. రేర్‌లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకండరీ కెమెరా సెటప్ లభిస్తోంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం.. ఈ డివైజ్ ఫ్రెంట్లో 8ఎంపీ కెమెరా వస్తోంది.
ఇక ఈ మోడల్లో మీడియాటెక్ హీలియో జీ84 చిప్సెట్ వస్తోంది. 6జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 12జీబీ ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్ దీని సొంతం. ఎక్స్ప్యాండెబుల్ స్టోరేజ్ కోసం.. ఈ మొబైల్లో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ కూడా లభిస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 సాఫ్ట్‌వేర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఈ వివో వై17ఎస్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనికి 15వాట్ ఛార్జర్ సపోర్ట్ లభిస్తోంది. ఈ మొబైల్‌కు 19.67గంటల యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ వస్తుండటం విశేషం. డ్యూయెల్ సిమ్, డ్యూయెల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఈ డివైజ్‌లో ఉన్నాయి.
వివో కొత్త స్మార్ట్‌ఫోన్ ధర ఎంతంటే..
సింగపూర్‌లో ఈ వివో వై17ఎస్ ధర 199 ఎస్జీడీ (146 డాలర్లు)గా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో అది సుమారు రూ. 12,150. గ్లిట్టర్ పర్పుల్, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది.
Vivo Y17s price : సింగపూర్ తర్వాత.. ఈ మోడల్ ఇతర ఆసియా మార్కెట్స్‌లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం. అయితే.. ఇండియాలో లాంచ్, ధర వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. దీనిపై సంస్థ స్పందించాల్సి ఉంది.
ఇండియాలోకి వివో టీ2 ప్రో..
వివో వై17ఎస్ విషయాన్ని పక్కనపెడితే.. వివో టీ2 ప్రో మోడల్‌ను ఇండియాలో లాంచ్‌కు సిద్ధం చేస్తోంది స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ. ఈ నెల 22న ఈ మోడల్ లాంచ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్ఓసీ చిప్సెట్ ఉంటుంది. రెండు వేరియంట్లు ఉండొచ్చని సమాచారం. అవి 8జీబీ ర్యామ్-128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం