Google Pixel Watch 2 : అదిరిపోయే ఫీచర్స్‌తో గూగుల్ పిక్సెల్ వాచ్ 2..!
Google Pixel Watch 2 : గూగుల్ పిక్సెల్ వాచ్ 2 త్వరలోనే లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
Google Pixel Watch 2 : 'పిక్సెల్' ఈవెంట్‌కు గూగుల్ సన్నద్ధమవుతోంది. అక్టోబర్ 4న జరగనున్న ఈ ఈవెంట్లో పిక్సెల్ 8 సిరీస్‌ను లాంచ్ చేయనుంది దిగ్గజ టెక్ సంస్థ. పిక్సెల్ వాచ్ 2ని కూడా లాంచ్ చేస్తోందని తెలుస్తోంది. కాగా.. లాంచ్‌కి ముందే ఈ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించిన ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలు..
గూగుల్ పిక్సెల్ వాచ్ 2 ఇలా ఉంటుంది..!
పిక్సెల్ వాచ్ 2.. ఫస్ట్ జనరేషన్ మోడల్‌ను పోలి ఉంది. రైట్ సైడ్‌లో రౌండ్ బెజెల్-లెస్ డిస్ప్లే, మెటల్ క్రౌన్ ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్‌ను 100శాతం అల్యుమీనియంతో తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో మూడు కొత్త సెన్సార్స్ వచ్చినట్టు సమాచారం.
Google Pixel Watch 2 release date : పాలిష్డ్ సిల్వర్/బే, మాట్ బ్లాక్/ ఓబ్సీడియన్, షాంపైన్ గోల్డ్/ హాజెల్, పాలిష్డ్ సిల్వర్/ పోర్సెలిన్ వంటి రంగుల్లో ఈ గూగుల్ పిక్సెల్ వాచ్ 2 అందుబాటులో ఉండనుంది. ఈ వాచ్‌కు మెటల్ స్లిమ్, యాక్టివ్ స్పోర్ట్ బాండ్స్‌ను ఇస్తోంది గూగుల్.
ఇక ఈ స్మార్ట్‌వాచ్‌లో ఫిట్బిట్కి చెందిన మల్టీ-పాత్ హార్ట్‌రేట్ సెన్సార్, స్ట్రెస్ మేనేజ్మెంట్ సిస్టెమ్ వంటివి ఉంటాయి. వీటితో వ్యాయామాలను, స్ట్రెస్‌తో బాడీలో కనిపించే మార్పులను ఈ వాచ్ రికార్డ్ చేస్తుందట. వీటితో పాటు అనేక హెల్త్, ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్స్, ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, హార్ట్ జోన్ ట్రైనింగ్, 6 నెలల ఫ్రీ ఫిట్‌బిట్ ప్రీమియం వంటివి కూడా వస్తాయని తెలుస్తోంది.
ఇదీ చూడండి:- Huawei new smartphone : శాటిలైట్ కాలింగ్ ఫీచర్‌తో హువావే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లాంచ్!
ఈ గూగుల్ పిక్సెల్ వాచ్ 2లో 24 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుందని, 75 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చని లీక్స్ సూచిస్తున్నాయి. అనేక సేఫ్టీ ఫీచర్స్‌ని కూడా ఇందులో గూగుల్ అప్డేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ సమయంలో మెడికల్ డేటాను కూడా షేర్ చేసుకోవచ్చట.
ఈ ఫీచర్స్పై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అక్టోబర్ 4న జరగనున్న ఈవెంట్‌తో ఈ గూగుల్ పిక్సెల్ వాచ్ 2పై ఓ క్లారిటీ వస్తుంది.
లాంచ్ ఎప్పుడు.. ధర ఎంత?
Google Pixel Watch 2 price in India : ఈ గూగుల్ పిక్సెల్ వాచ్ 2.. ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది. అక్టోబర్ 5న.. ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రకటించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం