iPhone 15 vs Google Pixel 7 : ఐఫోన్ 15 వర్సెస్ గూగుల్ పిక్సెల్ 7.. ఏది బెస్ట్?
iPhone 15 vs Google Pixel 7 : ఐఫోన్ 15 వర్సెస్ గూగుల్ పిక్సెల్ 7. ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
iPhone 15 vs Google Pixel 7 : యాపిల్ లవర్స్ ఎంతగానో వెయిట్ చేసిన ఐఫోన్ 15 సిరీస్‌ను ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ టెక్ సంస్థ. దీనికి మంచి డిమాండ్ లభిస్తుందని టెక్ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 15ని గూగుల్ పిక్సెల్ 7తో పోల్చి.. ఈ రెండిట్లో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ట్రెండింగ్ వార్తలు
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్స్ ఇవే..
ఐఫోన్ 15 సిరీస్‌లో డైనమిక్ ఐల్యాండ్‌ను అన్ని మోడల్స్‌కు స్టాండర్డ్‌గా ఇచ్చింది యాపిల్ సంస్థ. ఇందులో 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఉంటుంది. కానీ ఇందులో యాపిల్ ప్రో-మోషన్ టెక్నాలజీ లేదు. అంటే ఈ సిరీస్‌కు 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే లభిస్తున్నట్టు. ఇందులో సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ లభిస్తోంది.
iPhone 15 price in India : ఇక గూగుల్ పిక్సెల్ 7లో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.3 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తోంది.
ఐఫోన్ 15లో ఏ16 బయోనిక్ ఎస్ఓసీ చిప్సెట్ ఉంటుంది. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో కూడా ఇది ఉంది. గూగుల్ పిక్సెల్ 7లో టెన్సార్ జీ2 ప్రాసెసర్, టిటానియం ఎం2 కో-ప్రాసెసర్ ఉంటాయి. 8జబీ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.
ఇదీ చూడండి:- iPhone 15 Pro Max price: ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర ఎంతో తెలుసా?
ఈ రెండు ఫోన్స్‌లోని కెమెరా సెటప్ వివరాలు..
ఐఫోన్ 15లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. 48ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా లెన్స్‌లు వస్తున్నాయి. సెన్సార్ షిప్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబులిటీ, ఫొటోనిక్ ఇంజిన్, డీప్ ఫ్యూజన్ టెక్నాలజీ వంటివి లభిస్తున్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 12ఎంపీ కెమెరా వస్తోంది.
Google Pixel 7 price in India : ఇక గూగుల్ పిక్సెల్ 7 రేర్‌లో 50ఎంపీ ఆక్టా పీడీ క్వాడ్ బయర్, 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా సెటప్ ఉంటుంది. లేజర్ డిటెక్ట్ ఆటోఫోకస్ సెన్సార్, గూగుల్ సూపర్ రెస్ జూమ్, ఫ్లికర్ సెన్సార్ వంటివి ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 10.8 ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది.
ఈ రెండు గ్యాడ్జెట్స్ ధరల వివరాలు..
సరికొత్త ఐఫోన్ 15 128జీబీ వేరియంట్ ధర రూ. 79,990. ప్రీ-ఆర్డర్లు శుక్రవారం మొదలయ్యాయి. 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లలో ఈ సిరీస్ వస్తోంది. పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్స్‌లో ఇది అందుబాటులో ఉండనుంది.
iPhone 15 pro price in India : మరోవైపు గూగుల్ పిక్సెల్ 7 128జీబీ వేరియంట్ ధర రూ. 59,999గా ఉంది. ఒబ్సీడియన్, స్నో, లెమన్‌గ్రాస్ రంగుల్లో అందుబాటులో ఉంది.
అయితే.. గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ సిరీస్.. అక్టోబర్‌లో లాంచ్‌కు సిద్ధమవుతోంది.
సంబంధిత కథనం