Huawei new smartphone : శాటిలైట్​ కాలింగ్​ ఫీచర్​తో హువావే ప్రీమియం స్మార్ట్​ఫోన్​ లాంచ్​!-huawei mate 60 rs ultimate design luxury smartphone with satellite calling ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Huawei New Smartphone : శాటిలైట్​ కాలింగ్​ ఫీచర్​తో హువావే ప్రీమియం స్మార్ట్​ఫోన్​ లాంచ్​!

Huawei new smartphone : శాటిలైట్​ కాలింగ్​ ఫీచర్​తో హువావే ప్రీమియం స్మార్ట్​ఫోన్​ లాంచ్​!

Sharath Chitturi HT Telugu
Sep 25, 2023 06:18 PM IST

Huawei Mate 60 RS Ultimate Design : హువావే నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అయ్యింది. ఇందులో శాటిలైట్​ కాలింగ్​ ఫీచర్​ ఉంది.

శాటిలైట్​ కాలింగ్​ ఫీచర్​తో హువావే ప్రీమియం స్మార్ట్​ఫోన్​ లాంచ్​!
శాటిలైట్​ కాలింగ్​ ఫీచర్​తో హువావే ప్రీమియం స్మార్ట్​ఫోన్​ లాంచ్​!

Huawei Mate 60 RS Ultimate Design : చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ హువావే.. సరికొత్త అల్ట్రా- ప్రీమియం స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ను లాంచ్​ చేసింది. ఈ బ్రాండింగ్​ పేరు అల్టిమేట్​ డిజైన్​. ఈ బ్రాండ్​లో తొలి గ్యాడ్జెట్​ పేరు హువావే మేట్​ 60 ఆర్​ఎస్​ అల్టిమేట్​ డిజైన్​. లగ్జరీ, ప్రీమియం సెగ్మెంట్​లో ఇది ప్రకంపనలు సృష్టించే విధంగా ఉందని టెక్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ ఇవే..

గతేడాది లాంచ్​ అయిన మేట్​ 50 ఆర్​ఎస్​ పార్షే డిజైన్​ స్ఫూర్తితో ఈ హువావే మేట్​ 60 ఆర్​ఎస్​ అల్టిమేట్​ డిజైన్​ను రూపొందించినట్టు కనిపిస్తోంది. లుక్స్​ అగ్రెసివ్​గా ఉన్నాయి. ఇందులో ఆక్టోగోనల్​ కెమెరా మాడ్యూల్​ ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ బాడీని సిరామిక్​తో తయారు చేయడం విశేషం. ఫ్రేమ్​కి అల్యూమీనియం సపోర్ట్​ ఇచ్చారు. రెడ్​, బ్లాక్​ కలర్స్​లో ఈ మోడల్​ అందుబాటులోకి వచ్చింది.

ఇక ఈ గ్యాడ్జెట్​లో 6.82 ఇంచ్​ ఫ్లాట్​ ఓఎల్​ఈడీ ఎల్​టీపీఓ డిస్​ప్లే ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం టాప్​ సెంటర్​లో 3 పంచ్​ హోల్స్​ ఉంటాయి. ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ మొబైల్​ రేర్​లో 3 హై-పర్ఫార్మింగ్​ లెన్స్​లు ఉన్నాయి. 48ఎంపీ ప్రైమరీ, 40ఎంపీ అల్ట్రా వైడ్​, 48ఎంపీ అల్ట్రా మాక్రో టెలిస్కోపిక్​ కెమెరా సెటప్​ దీని సొంతం. 3.5ఎక్స్​ ఆప్టికల్​ జూమ్​, 100ఎక్స్​ డిజిటల్​ జూమ్​ కెపబులిటీ ఈ మొబైల్​కు ఉంది. ఇక సెల్ఫీ కోసం ఇందులో 13 ఎంపీ అల్ట్రా వైడ్​ యాంగిల్​ కెమెరా లభిస్తోంది. టైమ్​ లాప్స్​ ఫొటొగ్రఫీ, స్లో మోషన్​, పానారోమిక్​ షార్ట్స్​ వంటివి ఉన్నాయి. యాంటీ షేక్​ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

హువావే మేట్​ 60 ఆర్​ఎస్​ అల్టిమేట్​ డిజైన్​లో ఇంటెలిజెంట్​ వేరియబుల్​ ఆపరేచర్​, 10 స్టాప్​ అడ్జెస్టెబుల్​ ఫిజికల్​ ఆపరేచర్​, సూపర్​ నైట్​ సీన్​ మోడ్​, షూట్​ మాక్రో, టెలీఫొటో పిక్చర్స్​ వంటి ఫీచర్స్​ వస్తున్నాయి.

Huawei Mate 60 RS Ultimate Design satellite calling feature : ఈ స్మార్ట్​ఫోన్​లో కిరిన్​ 9000ఎస్​ చిప్​సెట్​ ఉంటుంది. హాంగ్​మెంగ్​ ఓఎస్​ 4.0 సాఫ్ట్​వేర్​తో ఈ మోడల్​ పనిచేస్తుంది. 16జీబీ ర్యామ్​- 512జీబీ/ 1టీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉన్నాయి. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50వాట్​ ఫాస్ట్​ వయర్​లెస్​ ఛార్జింగ్​, 20వాట్​ రివర్స్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ ఈ మోడల్​కు లభిస్తోంది.

ఇక ముఖ్యమైన విషయానికొస్తే.. ఈ హువావే మేట్​ 60 ఆర్​ఎస్​ అల్టిమేట్​ డిజైన్​.. టైంగ్​టంగ్​ శాటిలైట్​ కాల్స్​, బైడౌ శాటిలైట్​ మెసేజ్​లకు సపోర్ట్​ చేస్తుంది. డ్యూయెల్​ బ్యాండ్​ వైఫై, బ్లూటూత్​ 5.2, జీపీఎస్​ వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ కూడా ఉన్నాయి.

ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ ధర ఎంతంటే..

Huawei new luxury smartphone : చైనాలో ఈ హువావే మేట్​ 60 ఆర్​ఎస్​ అల్టిమేట్​ డిజైన్ 16జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 1,641 డాలర్లుగా ఉంది. ఇండియన్​ కరెన్సీలో అది సుమారు రూ. 1.37లక్షలు. ఇక 16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 1,778 డాలర్లు. అంటే సుమారు రూ. 1.48లక్షలు. చైనాలో ఈ నెల 28 నుంచి ఆ గ్యాడ్జెట్​ సేల్​ మొదలవుతుంది. బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

సంబంధిత కథనం