Flipkart: త్వరలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్; ఈ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్
Flipkart Big Billion Days Sale: ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఆ సేల్ లో భారీ డిస్కౌంట్స్ తో లభించే స్మార్ట్ ఫోన్స్ వివరాలను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అత్యధిక డిస్కౌంట్ తో లభించే స్మార్ట్ ఫోన్స్ వివరాలను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. వాటిలో నథింగ్ ఫోన్ 1, మోటో ఎడ్జ్ 30, గూగుల్ పిక్సెల్ 7, సామ్సంగ్ గెలాక్సీ ఎం 13, పోకో ఎం5 మొదలైన ఫోన్స్ ఉన్నాయి. అందువల్ల స్మార్ట్ ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉన్నవారు మరి కొన్ని రోజులు ఎదురు చూడడం మంచిది.
ఈ ఫోన్లపై మంచి ఆఫర్స్
- సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 13: ఈ స్మార్ట్ ఫోన్ ఒరిజినల్ ధర రూ. 11,999 కాగా, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో రూ. 9,199 లకు లభిస్తుంది.
- నథింగ్ ఫోన్ 1: అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న నథింగ్ ఫోన్ 1 ధర లాంచ్ సమయంలో రూ. 32, 999. కాగా, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కేవలం రూ. 23,999 లకు లభిస్తుంది.
- గూగుల్ పిక్సెల్ 7: గూగుల్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో లాంచ్ అయిన సమయంలో రూ. 59,999 గా ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అది కేవలం రూ. 36,499 లకు లభిస్తుంది.
- రెడ్ మి నోట్ 12 స్మార్ట్ ఫోన్ ఒరిజినల్ ధర రూ. 17,999 కాగా, ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఆ ఫోన్ రూ. 10,799 లకే లభిస్తుంది.
- అలాగే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో వివో వీ 29ఈ స్మార్ట్ ఫోన్ రూ. 24,999 లకు, రియల్ మి సీ 55 ఫోన్ ను రూ. 9,499 లకే సొంతం చేసుకోవచ్చు.
- ఈ డిస్కౌంట్ లతో పాటు బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ లు ఉంటాయి.