Flipkart TV sale: ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీల మేళా; 40 శాతం పైగా డిస్కౌంట్స్; ఈ 5 మోడల్స్ పై బెస్ట్ ఆఫర్స్-flipkart tv sale grab these smart tvs with over 40 percent discount ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Flipkart Tv Sale! Grab These Smart Tvs With Over 40 Percent Discount

Flipkart TV sale: ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీల మేళా; 40 శాతం పైగా డిస్కౌంట్స్; ఈ 5 మోడల్స్ పై బెస్ట్ ఆఫర్స్

HT Telugu Desk HT Telugu
Aug 26, 2023 06:08 PM IST

Flipkart TV sale: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీల మేళా నడుస్తుంది. దాదాపు అన్ని బ్రాండ్స్ స్మార్ట్ టీవీలు ఇక్కడ 40 శాతం పైగా డిస్కౌంట్ లో లభిస్తున్నాయి. వివిధ సైజుల్లో, వివిధ కాన్ఫిగరేషన్స్ తో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని వివరాలు ఇక్కడ మీకోసం…

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Flipkart)

Flipkart TV sale: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీల మేళా నడుస్తుంది. దాదాపు అన్ని బ్రాండ్స్ స్మార్ట్ టీవీలు ఇక్కడ 40 శాతం పైగా డిస్కౌంట్ లో లభిస్తున్నాయి. వివిధ సైజుల్లో, వివిధ కాన్ఫిగరేషన్స్ తో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని వివరాలు ఇక్కడ మీకోసం…

ట్రెండింగ్ వార్తలు

LG 4K OLED TV: ఎల్ జీ పోజ్ 4కె ఓఎల్ఈడి టీవీ

ఎల్ జీ పోజ్ 4కె ఓఎల్ఈడీ ఈవో టీవీ ఫ్లిప్కార్ట్ లో 45% డిస్కౌంట్ లో లభిస్తుంది. ప్రీమియం బ్రాండ్ అయిన ఎల్జీ నుంచి అత్యాధునిక స్పెసిఫికేషన్స్ తో ఈ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి వచ్చింది. దీన్ని ఒరిజినల్ ధర రూ. 1,99,,990 కాగా 45% డిస్కౌంట్ అనంతరం.. ఈ టీవీ రూ. 109,990 ధరకు లభిస్తుంది. ఇందులో 9 జనరేషన్ 5ఐ ప్రాసెసర్ ఉంది దీంతో అద్భుతమైన పర్ఫామెన్స్ మీకు లభిస్తుంది. అదనంగా రూ. 11 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.

SONY 55-inch Google TV: 55 ఇంచ్ ల సోనీ గూగుల్ టీవీ

సోనీ 55 ఇంచ్ అల్ట్రా హెచ్డీ 4k ఎల్ఈడి స్మార్ట్ గూగుల్ టీవీ ఫ్లిప్ కార్ట్ లో 43% డిస్కౌంట్ కి లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ. 99,900 కాగా డిస్కౌంట్ అనంతరం రూ. 55,990 లకు లభిస్తుంది. రూ. 11 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ అదనం. ఇందులో సోనీ స్పెసిఫిక్ ఎక్స్ 1 ప్రాసెసర్ ఉంటుంది.

LG 55-inch Smart TV: 55 ఇంచ్ ల ఎల్ జీ టీవీ

ఈ ఎల్జి యూక్యూ 7500 55 ఇంచ్ అల్ట్రా హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఫ్లిప్కార్ట్ లో 41 శాతం డిస్కౌంట్ తో లభిస్తుంది. అంటే దీని ఒరిజినల్ ధర రూ. 71, 990 కాగా డిస్కౌంట్ అనంతరం రూ. 41990 కి లభిస్తుంది అదనంగా 7000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ స్మార్ట్ టీవీలో యుహెచ్డీ 4కే రిజొల్యూషన్ డిస్ప్లే ఉంటుంది.

SAMSUNG 43-inch Smart TV: సామ్సంగ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ

సాంసంగ్ క్రిస్టల్ 4 కె ఐస్మార్ట్ సిరీస్ 43 ఇంచ్ అల్ట్రా హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ టైసన్ టీవీ ఫ్లిప్కార్ట్ లో 41% డిస్కౌంట్తో అందుబాటులో ఉంది. దీని ఒరిజినల్ ధర రూ. 52,900 కాగా డిస్కౌంట్ అనంతరం రూ. 30, 990 కి లభిస్తుంది. అదనంగా 11 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది. ఇందులోని ప్యూర్ కలర్ ఆప్షన్ అద్భుతమైన డిస్ప్లేని అందిస్తుంది.

LG 50-inch Smart TV: ఎల్ జీ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ

ఎల్జి యు ఆర్ 7500 అల్ట్రా హెచ్డి 50 ఇంచ్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పై కూడా ఫ్లిప్కార్ట్ లో 41 శాతం డిస్కౌంట్ ఉంది. ఒరిజినల్ ధర రూ. 69,990 కాగా డిస్కౌంట్ అనంతరం రూ. 40990 కి వస్తుంది. దీనిపై రూ. 11 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది.

WhatsApp channel

టాపిక్