తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Minimize Fuel Bills : ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలంటే.. ఇవి ట్రై చేయండి!

How to minimize fuel bills : ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలంటే.. ఇవి ట్రై చేయండి!

06 January 2023, 8:14 IST

    • How to minimize fuel bills : నెలనెలా.. ఇంధన బిల్లులు చూసి భయపడిపోతున్నారా? వాహనాల మైలేజ్​ను పెంచుకుని, ఫ్యూయెల్​ బిల్లులను తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి. అవేంటంటే..
కారు మైలేజ్​ పెరగాలంటే ఇవి ట్రై చేయండి..
కారు మైలేజ్​ పెరగాలంటే ఇవి ట్రై చేయండి..

కారు మైలేజ్​ పెరగాలంటే ఇవి ట్రై చేయండి..

How to improve car mileage : వాహనాలు కొనడం ఒక ఎత్తు అయితే.. వాటికి పెట్రోల్​/ డీజిల్​ కొట్టించేందుకు పెట్టే ఖర్చు ఇంకో ఎత్తు! ముఖ్యంగా దేశంలో ఇంధన ధరలు.. ఏడాదిన్నరలో ఏ రేంజ్​లో పెరిగాయో అందరికి తెలిసిందే. మరి ఈ సమయంలో ఇంధన ఖర్చులు తగ్గించుకునే విధంగా కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే.. వాహనాల మైలేజ్​ పెరగడంతో పాటు ఫ్యూయెల్​ బిల్లులు కూడా తగ్గుతాయి. అవేంటంటే..

ట్రెండింగ్ వార్తలు

First Bajaj CNG motorcycle: బజాజ్ నుంచి తొలి సీఎన్జీ మోటార్ సైకిల్; జూన్ 18 న లాంచ్

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

సిగ్నల్​ పడితే..

నగరాల్లో జీవించే వారికి.. ట్రాఫిక్​ కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ట్రాఫిక్​ ఉన్నప్పుడు.. ఇంజిన్​ను ఆఫ్​ చేస్తే మంచిది! ఇంజిన్​ రన్నింగ్​లో ఉంటే ఇంధనం ఖర్చు అవుతుంది. బండి నడవకపోతుంటే.. ఇంజిన్​ను ఆపడం ఉత్తమం. ట్రాఫిక్​ సిగ్నల్​ ఎంత సేపు ఉందనేది లెక్కేసుకుని మీరు మీ ఇంజిన్​ను ఆపాల్సి ఉంటుంది. ఎక్కువసేపు పడుతుంటే ఆపేయాలి. 30సెకన్ల కన్నా తక్కువ వ్యవధి ఉంటే.. ఇంజిన్​ ఆఫ్​ చేయాల్సిన అవసరం లేదు.

డ్రైవింగ్​తోనే సాధ్యం..!

How to save car fuel : ఫ్యూయెల్​ బిల్లులు తగ్గించుకోవడం అనేది మన డ్రైవింగ్​పైనే ఆధారపడి ఉంటుంది. కారు, బైక్​ను సరిగ్గా నడిపితేనే.. ఇంధనం తక్కువ ఖర్చు అవుతుంది. ప్రతిసారీ బ్రేక్​లు సడెన్​గా వేయడం, సడెన్​గా వాహనాన్ని రైజ్​ చేయడం వంటివి చేయడంతో ఇంజిన్​ మీద ఎక్కువ ప్రెజర్​ పడి.. ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. అదే సమయంలో ఒకే స్పీడు, ఒకే ఆర్​పీఎంను మెయింటైన్​ చేస్తే.. మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీర్ఘకాలంలో భారీగా డబ్బు ఆదా అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

రూట్​తో జాగ్రత్త..!

గమ్యస్థానానికి ఎంత తొందరగా చేరుకుంటే అంత మంచిది! అంటే.. లాంగ్​ రూట్​ను ఎంచుకోకుండా, షార్ట్​ రూట్​లో వెళ్లడం ఉత్తమం. లాంగ్​ రూట్​లో వెళ్లి ట్రాఫిక్​లో ఇరుక్కుంటే.. మాటిమాటికీ బ్రేక్​లు వేయాల్సి ఉంటుంది. యాక్సలరేషన్​ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే.. ఇంజిన్​పై ప్రెజర్​ పడుతుంది. ఇంధనం ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలంటే.. షార్ట్​ రూట్స్​ చూసుకోవాల్సిందే.

టైర్​ ప్రెజర్​..

Tips to improve car mileage : కారుకు మంచి మైలేజ్​ లభించాలంటే.. టైర్​ ప్రెజర్​ కూడా కీలకమే. ఆప్టిమమ్​ టైర్​ ప్రెజర్​ ఉండేడట్టు ఎప్పటికప్పుడు చెక్​ చేసుకోవాలి. టైర్​ ప్రెజర్​ తగ్గితే.. రోడ్డుతో రాపిడి పెరగడం/తగ్గడం జరిగి.. కావాల్సిన దాని కన్నా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. అయితే.. టైర్​ ప్రెజర్​ అనేది ఒక్కో వాహనానికి ఒక్కో విధంగా ఉంటుంది. యూజర్​ మేన్యువల్​లో టైర్​ ప్రెజర్​ గురించి రాసి ఉంటుంది. దానిని ఫాలో అయ్యి.. ప్రతిసారి చెక్​ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మంచి మైలేజ్​ సంపాదించుకోవచ్చు. ఇంధన బిల్లులను తగ్గించుకోవచ్చు.